నిన్న తిరుపతిలో జరిగిన సభలో కావూరి సాంబశివ రావు గారు కాస్త స్వరం పెంచి కేంద్ర నాయకత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. బహుశా, వెంకన్న పాదాల సాక్షిగా ఆయన అడుగులు ప్రాంతీయ పార్టీల వైపు పడుతున్నై అన్నది నిష్ఠుర సత్యం? ఇదే అదునుగా ఆయన సమైక్య వాదాన్ని పదునుగా వినిపించారు.
పందులులా మెక్కవచ్చనే తెలంగాణా నాయకులు విభజన కోరుతున్నరన్నారు. పదవి వచ్చిన తరువాత చెన్నారెడ్డి గారు ఉద్యమాన్ని ఏమి చేసారో గుర్తు చేసారు. పదవి వచ్చిన తరువాత అద్వానీ గారు ఆలె నరేందర్ గారికి రాసిన ఉత్తరాన్ని ఉటంకించారు. అవునండి కావూరి గారు, మొన్న మీకు మంత్రి వర్గంలో స్థానం కల్పించినట్లయితే మీరు తిరుపతిలో ఈ సభ పెట్టేవారా? పోనీలెండి సారూ, ఎవరు తింటే ఏముంది, ఎటొచ్చి ప్రజల సొమ్మే కదా? ఇంతకీ నేను చెప్పోచ్చేదేంటంటే - అందరు రాజకీయ నాయకులు అవకాశవాదులే అన్న నగ్న సత్యం. ప్రాంతాలను బట్టి బుద్ధులు వుండవు. దీని పర్యవసానంగా, ఆయన పాల్గొన్న ఈ సభతో, ఇరు ప్రాంతాల పత్రికలకు, ఛానళ్ళకు మంచి కాలక్షేపం. బహుశా రేపటికల్లా నమస్తే తెలంగాణా సహాయ సహకారాలతో, ఈ వాక్యాన్ని మార్చేసి తెలంగాణా వాళ్ళని పందులతో పోల్చిన "ఖండ" కావూరి అనే శీర్షికతో వార్త వస్తుంది. అంతే, కొంతమంది కష్టపడి చదువుకొనే విద్యార్ధులు అనబడే ఉద్యమకారులు ఆంద్ర న్యాయవాదుల వలన మా ప్రాక్టీసుకి అన్యాయం జరిగింది అని ఆక్రోశించే తెలంగాణా న్యాయవాదులు కావూరి ఇంటి దగ్గర "శాంతియుతంగా" పూల కుండీల దగ్గర ధర్నా చేసే అవకాశo వుంది. క చ రా గారో, దిలీపు గారో, హరీష్ సారో, క తా రా గారో తెలంగాణలో వున్న ఆంధ్రోల్లకి హెచ్చరిక జారీ చేసే ప్రమాదం వుంది - కావూరీ నువ్వు నోరుమూసుకోకుంటే ఆంధ్రోల్లని భాగో అనాల్సి వస్తుందని. ఉరుము ఉరిమి మంగలం మీద పడటం అంటే ఇదే కాబోలు.
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి