14, నవంబర్ 2012, బుధవారం

దురహంకారి రావణ "జెట్" మలాని




ఏవిటో ఈ మధ్య భా జ పా వారికి అన్నీ కష్టాలె.   ఒక పక్క సూట్కెసు కంపెనీల "గడ్డు" కరి గారి అవస్తలు, మధ్యలో స్వామి వివేకానంద తెలివి తేటలని దావూద్తో పొల్చడం,  దక్షిణ భారత దేశంలో (కర్నాటకలో) తిప్పలు...   ఇవన్ని చాలవన్నట్లు భా జ పా వారి ఇష్ట దైవం రాముడి (అవకాశం వుంటే వారి ఎన్నికల చిహ్నంగా కూడా  వాడుకొనే వారు)  మీద జెట్ మలాని గారి వ్యాఖ్యానం.   ఎన్నికలప్పుడు మాత్రమే రాముడి పంచలోహ విగ్రహాలు బైటకు తీసి చింత పండుతో తోముతారు.   ఎన్నికలు లేనప్పుడు ఇలా వ్యాఖ్యానాలు చెయ్యడం, వారి మాజీ కెంద్ర  మంత్రిగారి ఆధ్వర్యంలో  టాంకు బండు మీద అన్నమయ్య విగ్రహం పడగొట్టడం వీరి ద్వంద నీతికి తార్కాణం. 

రామాయణాన్ని జెట్ మలాని గారు మద్యం సేవించకు ముందు చదివుంటే ఈ రకమైన అసందర్భ ప్రేలాపన చేసి వుండే  వాడు కాదు.  


సీతా దేవి అపహరణ తర్వాత ఆమె జారవిడిచిన నగలను గుర్తించమని నైరాస్యంలొ, ఆత్రుతలో వున్న శ్రీరామ చంద్రుడు లక్షమణుని  కోరతాడు .    దానికి సమాధానంగా  లక్షమణుడు అన్నగారికి చెప్తాడు--  నేను వదినగారి కాలి మంజీరాలని మాత్రమే గుర్తించగలుగుతాను, అదికూడా నేను రోజు ఆవిడ పాదాలకు నమస్కారం పెడతాను కాబట్టి అని .  


కేవలం ఉన్నత స్థాయి  కేసులను మాత్రమే వాదించి గంటల పంచాంగం ప్రకారం డబ్బు  దండుకొనే  "జెట్"  గారికి విషయం పూర్తిగా తెలీక రాముణ్ణి లక్ష్మనుణ్ణి తూల నాడాడు.   శత్రు సమ్హారం జరగాలని వున్నపుడు అవతార పురుషులు ఉద్భవిస్తుంటారు, అదే దశావతారములలోని మర్మం.  ఇందులో భాగమే  అపోహలు, అనుమానాలు, అగ్ని ప్రవేశం మున్నగునవి.    అంతే గాని లక్ష్మణుడు ఎ కె 47 తుపాకితో ఎందుకు కాపలా కాయలేదు, రాముడు రజకుని మాటలు విని అమ్మవారిని ఎందుకు అగ్ని ప్రవేశం చేఇంచాడు ఇవన్నీ  ప్రతి పక్షాల కుట్ర అని ప్రశ్నించడం అర్ధ రహితం.







 

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి