28, ఫిబ్రవరి 2014, శుక్రవారం

కాంగ్రెసుతో పొత్తు తెరాసకు నష్టం


తిరునాళ్ళకో, జాతరకో వెళ్ళేటప్పుడు ఉన్నంత హుషారు తిరిగి ఇంటికి వచ్చేప్పుడు వుండదు.  ఇది చాలా సహజం. ఉద్యమకారునికిగా కచరా సంవత్సరం క్రితం కాంగ్రెసును దుమ్మెత్తి పోస్తూ "తెరాస ను కాంగ్రెస్లో విలీనం చేస్తే ప్రత్యెక రాష్ట్రం ఇస్తామంటున్నారుగా, ఎంతో కష్టపడి పెంచిన పార్టీని మీ బొంద మీద కలపడానికి సిద్ధం, ఇప్పుడైనా రాష్ట్రం ప్రకటించండి" అని తనకు ఇష్టం లేకపోయినా స్వరాష్ట్రం కొరకు పార్టీని త్యాగం చెయ్యడానికి ఆనాడు సిద్ధపడ్డారు. కానీ ఈ రోజు పరిస్థితులు వేరు.   రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా రెండంకేలకే పరిమితమయ్యే పరిస్తితిలో వుంది.   అలాంటప్పుడు తెరాసను కాంగ్రెస్ లో విలీనం చేసి మరో (అ) చిరంజీవిగా మిగిలే బదులు, సొంతంగా 10-12 స్థానాలలో అభ్యర్ధులను గెలిపించుకొని రాబోయే భాజపా ప్రభుత్వానికి  మద్దతు ఇచ్చి తెలంగాణా రాష్ట్రానికి కావాల్సిన పనులు చేయించుకొనే వెసులుబాటు వుంటుంది.   తెలంగాణా రాష్ట్రంలో చెప్పుకోదగ్గ, జనాన్ని ఆకట్టుకోగలిగిన కాంగ్రెస్ నాయకుడు ఎవరూ లేరు.   నిన్నటి దాకా సొంత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని వాడు వీడు అని తిట్టిన వి హెచ్, పాల్వాయ్, పొన్నం  లను చూసి వోట్లేసే వెర్రిబాగుల వాళ్ళు తెలంగాణలో లేరు.  


ప్రస్తుత లోకసభలో 18 మంది ఏమ్పీలున్న డి ఎం కె నాలుగు పదవులు పొందింది.  వాళ్లకు వాళ్ళ రాష్ట్రానికి "మేళ్ళు"  జరిగాయి.      భక్తవ శంకరుడి దర్శనం కావాలంటే ముందు నందీశ్వరుడిని ప్రసన్నం చేసుకోవాలి.   కాంగ్రెస్ పార్టీలో అమ్మగారిని కలవాలంటే ఇలాంటి నందులు వేరు వేరు పేర్లతో, రూపాలతో దిల్లీలో వుంటాయి.   ముందు వారిని ప్రసన్నం చేసుకోవాలి, వారు అనుమతిస్తే అమ్మగారిని కలవచ్చు.   ఈ కష్టాలకు బదులు సొంతంగా పార్టీని కొనసాగించి మనకు కావలసిన మేళ్ళు జరిపించుకోవచ్చు.  కాంగ్రెస్ పార్టీలో కలిసిపోతే, ఆంధ్ర రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులను, ప్రజలను  పెద్దగా తిట్టడానికి వుండదు.  దీని బదులు ఇంకో 10 సంవత్సారాలు తమ పార్టీ కొనసాగితే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి పక్క రాష్ట్ర ప్రజలను దూషించి వారు గతంలో చేసినట్లుగా చెబుతున్న దోపిడీని గుర్తుచేసి వోట్లు దండుకోవచ్చు.  తీర్దానికి తీర్ధం - ప్రసాదానికి ప్రసాదం.   

2 కామెంట్‌లు :

  1. idanta ennikalalo labdi pondadaniki TRS, congress game plan kooda ayyi undochi. Kani congress ki teleni vishayam entante, final ga TRS hand istundi anedi.

    రిప్లయితొలగించండి
  2. తెరాసా వాళ్ళకి సొంత ఆప్షన్స్ అంటూ యేమీ ఇవ్వలేదే కాంగ్రెసు!ఈ మధ్యనే ఒక తెరాసా ప్రముఖుడు కూడా, 'మాదే ముందండీ వాళ్ళెలా ఇస్తే అలా తీసుకోవడమే గానీ' అనేశాడు గదా.ఇప్పుడు విలీనాన్ని వ్యతిరేకిస్తే అప్పుడిచ్చిన రాయల తెలంగాణా లాంటి మరో ఝలక్ ఇస్తుందేమో? కాంగ్రెసుకి తెరాసా నుంచి తెదెపా మీదుగా భాజపా వరకూ యెవరు యేం అలోచించినా తెలిస్పోతున్నాది గానీ కాంగ్రెసు యేమి ఆలోచిస్తున్నాదనేది బ్రహ్మకి కూడా తెలియనివ్వడం లేదు.

    ఈ సారి ఇచ్చే ఝలక్ మరీ ఖలక్ మనేటట్టు ఉంటే?!

    రిప్లయితొలగించండి