ఒక కొత్త జిల్లా ఏర్పడితే కనీసం 10 మంది రాజకీయ నిరుద్యోగులకు పదవి దక్కుతుంది, అదే ఒక రాష్ట్రమే ఏర్పడితే వందలమంది రాజకీయ నిరుద్యోగులకు పదవి లభిస్తుంది. ఈ సూత్రాన్ని బాగా వంటపట్టించుకున్న భాజపా ఈ ఊబిలోకి కాంగ్రెస్ పార్టీని కూడా లాగింది. అవసరాన్ని బట్టి దీపాలు ఆర్పి, తలుపులు మూసేసి, ఎంపీలను కొట్టించైనా మూజువాణీ పెట్టేసి రాష్ట్రాల విభజన జరపవచ్చని ఇటీవలే రుజువైంది. భాజపా అగ్ర నాయకత్వం పదే పదే, తాము 3 రాష్ట్రాలు వేర్పాటు చేస్తే, ఇరు రాష్ట్రాలు మిఠాయిలు పంచుకున్నారు అని చెప్తూ "రాజధానితో పాటు రాష్ట్రం విడిపోలేదు" అన్న నగ్న సత్యాన్ని దాచిబెడతారు. 60 సంవత్సరాలకు పైబడి ప్రత్యెక రాష్ట్ర డిమాండ్ వున్న గూర్ఖాలాండ్లో తెలంగాణా విభజన తరువాత కదలిక మొదలైంది. గూర్ఖాలాండ్ నాలుగు దేశాల అంతర్జాతీయ సరిహద్దు (నేపాల్, భూటాన్, చైనా, బంగ్లాదేశ్) వెంబడి వుంది. తెలంగాణాలో రాజకీయ నాయకుల ప్రసంగాలకు ప్రేరేపితమై ఆత్మ హత్యలు జరిగితే, గూర్ఖాలాండు ప్రజలలో విద్యావంతులు తక్కువ. వారాల తరబడి బందులు, రాస్తారోకోలు చేసిన సందర్భాలు వున్నాయి. భాజపా అగ్రనేత జస్వంత్ సింగ్ 2009లో డార్జీలింగ్ పార్లమెంటు స్థానం నుంచి గూర్ఖాలాండు జనముక్తి మోర్చా మద్దుతుతో గెలుపొందాడు. తెలంగాణలో సోనియా గాంధీ కేవలం గులాబీ కండువా మాత్రమే కప్పుకుని 2009 లో ప్రచారం చేసింది. ఇక్కడ జస్వంత్ గారు ఏకంగా ఒక వేర్పాటు వాద, విచ్ఛిన్నకర శక్తితో చేతులు కలిపి వారి మద్దుతుతో ఎంపీగా కొనసాగుతున్నారు. తెలంగాణా బిల్లు ఆమోదం పొందిన తరువాత గూర్ఖాలాండు ఉద్యమకారులు దిల్లీలో జస్వంత్ సింగు గారికోసం తెగ వెదికారు. ఆయన ధిల్లీ లోనూ, డార్జిలింగు ఆఫీసులోను లేకపోవడంతో సమీప పోలీసు స్టేషన్ లో కూడా 'మిస్సింగ్ కంప్లైంట్' ఇచ్చారు.
సీట్ల కోసం, వోట్ల కోసం వెంపర్లాడే జాతీయ పార్టీలుగా చెప్పుకొనే ఈ పార్టీలు ఏదో ఒక రోజు ఈ దేశ విచ్చిన్నానికి పరోక్షంగా సహాయం చేస్తాయనడంలో ఆశ్చర్యం లెదు.
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి