పద్మశ్రీ బిరుదును దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై ఉన్నత న్యాయస్థానం స్పందించిన తీర్పు హర్షణీయం. ఒక కులాన్ని అత్యంత నీచంగా చిత్రీకరించడం, హేళన చెయ్యడం ఇతగాడికి మొదటినుంచి వున్న అవలక్షణం. ఇటీవల విడుదలైన ఆయన తనయుడి చిత్రంలో బ్రాహ్మణులను హేళన చేస్తూ చిత్రీకరించిన సన్నివేశాలకు వ్యతిరేకంగా స్పందించిన వారిపై గుండాలతో దాడి చేయించిన సంస్కృతి ఇతగాడిది. శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారిని ఫోనులో గుండాల చేత బెదిరించిన నైజం బహిరంగం. తానొక్కడే ఈ దేశంలో అత్యంత "డిసిప్లిండ్" అని గొప్పలు చెప్పుకొనే ఈయన గారి డిసిప్లిన్ గురించి చాలామందికి తెలుసు. షూటింగ్ లలో "డిసిప్లిన్" పేరిట హీరోయిన్లపై చేయ్యిచేసుకోవడం, ఈయన గారి నోటి దురుసుతనం రాష్ట్ర ప్రజలందరికి తెలుసు. తెలుగు సినిమా వజ్రోత్సవాలలో ఈయన ప్రవర్తించిన తీరు అందరికీ గుర్తు వుండే వుంటుంది. ఇలాంటి పోగరుబోతులకు, అలాంటి వారితో రాసుకు పూసుకు తిరిగే ఇంకో హాస్య నటుడికి న్యాయస్థానం తీర్పు చెంప పెట్టు. న్యాయస్థానం వారి తీర్పు ఈ రోజు ఉదయం 6 గంటలకు దినపత్రికలో చూసి చాలా సంతోషించాను. కొంతైనా అహంకారం తగ్గించుకొని శేష జీవితాన్ని గడుపుటాడని ఆశిస్తున్నా.
24, డిసెంబర్ 2013, మంగళవారం
ఉన్నత న్యాయస్థానం వారి అత్యున్నత తీర్పు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి
(
Atom
)
అహంకారం అనేది ఎదురు దెబ్బలకు తగ్గేది కాదండీ. ఆ దెబ్బల ధాటికి తగ్గినట్లు కనిపించవచ్చును మహా ఐతే.
రిప్లయితొలగించండిమోహన్బాబుగారి ఈ రోజు టీవీలో మాట్లడేది విన్నాక ఆయనకు ఈ దెబ్బ చాలినట్లు కనిపించటం లేదు.
"మీరు తప్పు చేసారు. కాబట్టి పద్మశ్రీని వెనుకకు ఇచ్చేయకపోతే క్రిమినల్ చర్యలు తీసుకోవలసి ఉంటుంది" అని న్యాయస్థానంవారు అన్నాక "నేను తప్పు చేయలేదు" అనటం కోర్టి విజ్ఞతను ప్రశ్నించి ధిక్కరించటం క్రిందకే వస్తుంది! ఎంత అహంకారమండీ!
అధఃపాతాళానికి పడటం జరిగాక ఇటువంటి వారిలో కొందరికి కనువిప్పు కలుగవచ్చును, అహంకారం అదుపులోకి రావచ్చును.
పద్మ బిరుదులు మాత్రమే కాదండీ, గౌరవ డాక్టరేట్లు కూడా అలాగే దుర్వినియోగమవుతున్నాయి. సినిమా ఫీల్డ్ లో ఉన్నంతమంది "డాక్టర్" లు బయట కూడా లేరేమో.
రిప్లయితొలగించండిసామెత ఉన్నది కదా!! వాడు మనిషా--మోహన్ బాబా? అని.
రిప్లయితొలగించండి