కేజ్రీవాల్ - నిన్నటి దాకా ఒక నిబద్ధతకు, నిష్కళంక పాలనకు కాబోయే ప్రతినిధిగా ఓటర్లు భావించారు. దిల్లీలో ఏకంగా 28 శాసన సభ్యులను గెలిపించుకొని సాంప్రదాయ పార్టీలకు చెమటలు పెట్టించింది. కానీ ఏమి లాభం, కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ముఖ్యమంత్రి స్థానాన్ని దక్కించుకొని హస్తం చేతికి చిక్కింది. గంట సేపు ఒకరిని ఒకరు బూతులు తిట్టుకొనే రాజకీయ చర్చల్లో వచ్చే ఎస్ ఎం ఎస్ పోల్స్ లాగా ఈయన కూడా ఎస్ ఎం ఎస్ లు, ఈ మెయిల్స్ ద్వారా కాంగ్రెస్ మద్దతుకు అనుకూలంగా ఫలితాలు తీసుకున్నారు. అవినీతిని ఊడుస్తా, కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడింది, షీలా దీక్షిత్ ను ప్రాసిక్యూట్ చేస్తా అని నిన్నటి వరకు చిలక పలుకులు పలికిన ఈ సామాన్యుడి పార్టీ కాంగ్రెస్ వేసిన ఎత్తుకు చిత్తైంది. ముఖ్యమంత్రి పదవిని అధిష్టించిన తరువాత కానీ ఈయనకు తత్త్వం బోధ పడదు. మొదటినుంచి చాలా మందికి ఆమ్ ఆద్మీ పార్టీపై ఒక అనుమానం వుండేది - ఇది కాంగ్రెస్ పార్టీ కోవర్టేమో అని, బహుశా ఈ అనుమానం నిజం కావచ్చు.
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి