కొత్త బిచ్చగాడు పొద్దెరగడని సామెత. బహుశా మన చిరు జీవి లాంటి వారు రాజకీయాలలోకి వస్తారని ముందే ఊహించి ఈ సామెత పుట్టిందేమో!
హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే, ప్రస్తుతం వస్తున్న ఆదాయం మొత్తం కేంద్రానికి చెందుతుంది. అప్పుడు నిధుల కోసం ఇరు రాష్ట్రాల తెలుగు ముఖ్యమంత్రులు చెరో బొచ్చ తీసుకొని ధిల్లీ వీధులపాలు అవ్వాల్సి వస్తుంది. ప్రస్తుత రాష్ట్ర ఆదాయంలో 50 శాతానికి పైగా ఆదాయం హైదరాబాదు నుంచే వస్తున్నది. అట్లాంటి ప్రాంతాన్ని కేంద్రం పాదాల వద్ద తాకట్టు పెట్టి ఎవరూ బావుకొనేదేమీ వుండదు. రాష్ట్రం విడిపోతే రైతులు , ఉద్యోగస్తులు నష్టపోతారు అని చెప్పే నాయకులు హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేస్తే ఈ నష్టాలు ఎలా పూడతాయి.
పంతాలకు పట్టింపులకు పోకుండా, ఒక పెద్ద సమస్యకు చిత్తశుద్ధితో తెలంగాణా నాయకులు పరిష్కారం కనుగొనదలచుకుంటే భద్రాచలం, మునగాల లాంటి ఆంద్ర ప్రాంతానికి చెందిన గ్రామాలను వదులుకొని, కొంత కాలం పాటు హైదరాబాద్ ఆదాయాన్ని పంచుకోవడం, ఉద్యోగస్తులకు వారు ఎక్కడ ఉండాలో తేల్చుకొనే అధికారం వారికే ఇస్తూ సామరస్య పూరక వాతావరణం కల్పించాలి. సీమాన్ద్రులకు మేము రక్షణ కల్పిస్తాం అంటూ భయపెట్టే వాళ్ళను తక్షణం బెయులు రాని కేసులు పెడితే సగం గొడవ సద్దుమణుగుతుంది. ఎక్కువ మంది సీమ ప్రజా ప్రతినిధులు కోరుకుంటున్నట్లు రాయల తెలంగాణా చేసి తెలంగాణా ప్రజలను ఒప్పించగలిగితే, ఈ సమస్యకు శాశ్వత మరియు సామరస్య పూర్వకమైన పరిష్కారం లభించ వచ్చు.
"इतने साल लुटे और कितने दिन लूटेंगे? जाओ अपनी कैपिटल": Asaduddin Owaisi
రిప్లయితొలగించండిఅయ్యా గొట్టిముక్కలవారూ, అదే అసదుద్దీన్ గారి పార్టీ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని చెప్పింది. మీకు ఉపయోగపడే వాక్యం దొరికేసరికి పూనకం వచ్చినట్లు ఊగిపోవటం, మీ అభిప్రాయాన్ని వ్యతిరేకించేసరికి ద్రోహులుగా ముద్రవేయటం ఏమి సంస్కారమో ఆలోచించుకోండి ముందు.
తొలగించండిsame owaisi said "we support united AP and if that is not possible Royala telangana only"
తొలగించండిnow you can start looting along with owaisee. suddenly you got love and affection on owasisee, great
రిప్లయితొలగించండిDid I praise Owaisi? Please don't read between lines.
తొలగించండిI really applaud your view on Hyderabad as Union Territory. It is practical that for received revenue the new states need to beg central government for their share. Just I am recollecting an old story of Two cats and one monkey.
రిప్లయితొలగించండి