17, సెప్టెంబర్ 2013, మంగళవారం

హైదరాబాద్ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలి


గత దశాబ్ద కాలంగా తెలంగాణా ప్రాంతం నుంచి వినిపిస్తున్న డిమాండ్ - హైదరాబాద్ రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని అధికారిక కార్యక్రమంగా నిర్వహించాలని.     ఈ విషయంలో, తెలంగాణాలోని కొన్ని జిల్లాలలో బలంగా వున్న భాజపా అందరికంటే కొంచెం ఎక్కువగా తన వాణిని వినిపిస్తున్నది.   దీనికి ప్రధాన కారణం - భాజపా లెక్క ప్రకారం నిజాం రాష్ట్ర విమోచన ముస్లింలపై హిందువుల ఆధిపత్యానికి ప్రతీకగా మలుచుకోవాలనే దుర్బుద్ధి తప్ప మరేమీ కాదు. 


బ్రిటీష్ వాడు మనల్ని విడిచి పెట్టి పోతూ, విభజించి పాలించు అనే సూత్రాన్ని కూడా మనకు అప్పగించాడు.   భారత్ కు స్వతంత్రాన్ని ప్రకటించి, భారత్లో వున్న 500 పైగా సంస్థానాలు భారత్ లో భాగంగా ఉండాలా లేక స్వతంత్రంగా ఉండాలా అనేది వారి ఇష్టం అని మెలిక పెట్టారు.   ఒక్క కాశ్మీర్ రాజు, నిజాం నవాబు మినహా  మిగిలిన స్వతంత్ర సంస్థానాలు అన్నీ భారత్ లో కలవడానికి ఇష్టపడ్డాయి.   


వాస్తవానికి, ఖాసిం రిజ్వీ నాయకత్వంలో స్థానికంగా వున్న  దేశ్ముఖ్లు, దొరలు సాగించిన దోపిడీలు, హత్యలు, అత్యాచారాల పై తెలంగాణా విముక్తి పేరిట పోరాటాలు చేసింది కమ్యునిష్టులు.  పోరాటం తుది దశకు చేరుకుంటున్న సమయంలో, ఉక్కు మనిషి పటేల్  పోలీస్ చర్య తీసుకొని నిజాం కబంధ హస్తాల నుంచి ప్రజలను పూర్తి విముక్తం కావించాడు.   మిగిలిన ప్రాంతాలలోని తెలుగు వాళ్ళు బ్రిటీష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాడుతున్నపుడు, నిజాం రాష్ట్రంలోని తెలుగు వారు నిజాం పై పోరాడారు.    కానీ, చరిత్ర పాఠ్య పుస్తకాలలో తగినంత ప్రాధాన్యం కల్పించక పోవడానికి వోటు బాంక్ రాజకీయాలే కారణం. 


అదే సమయంలో ఫ్రెంచ్ వారి పాలనలో వున్న యానాం ను అనధికారికంగా విముక్తం చేయడానికి పధకం రచించింది అప్పటి ఆంద్ర రాష్ట్ర మంత్రి, టంగుటూరి వారి శిష్యుడు తెన్నేటి విశ్వనాధం గారు (ఆయన ఆత్మ కధలో రాసుకున్నారు).   ప్రపంచ దేశాల నుంచి  ఒత్తిడి వస్తుందని నెహ్రు వారించినా, అక్కడి స్థానిక తెలుగు వాళ్ళను ప్రోత్సహించి మరీ ఫ్రెంచ్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది.   చివరకు 1954 నుంచి దశలవారీగా  ఫ్రెంచ్ పాలన నుంచి యానాం విముక్తి ప్రారంభమైంది.   


ఈ రెండు ప్రాంతాల విముక్తికి  ఒకటే తేడా - ఖాసిం రిజ్వీ మిలిటరీ హెడ్ గా నిజాం పాలకులు ప్రజలపై అరాచకత్వానికి పూనుకున్నాడు.   కానీ ఫ్రెంచ్ వారు అలా చెయ్యలేదు.   


ఈ నేపధ్యంలో,  నిజాం  విమోచనా ఉద్యమాన్ని అధికారికంగా జరిపితే తప్పేంటి?    హైదరాబాద్ విమోచనా దినోత్సవాన్ని అధికారికంగా పాటించడానికి కాంగ్రెస్ పార్టీకి, తెదేపాకు, కొంతవరకు తెరాసాకు అభ్యంతరం ఉండవచ్చు.   కారణం ముస్లింల వోట్లు ఎక్కడ పోతాయోనని.   భాజపా కు ముస్లిం సమూహం వంద శాతం దూరం కాబట్టి, వారు అందరికన్నా ఎక్కువగా అరుస్తూ, సంబురాలు చెయ్యాల్సిందే అంటారు.    కానీ, నిజాం పాలన విముక్తిలో ముఖ్య పాత్ర పోషించిన కమ్యునిష్టులను పట్టించుకొనే నాధుడు లేడు.  

  

3 కామెంట్‌లు :

  1. అవును హైదరాబాద్ విమోచన క్రెడిట్ అంతా కమ్యూనిస్ట్‌లకే దక్కాలి. మిగతా నాయాళ్ళంతా చెత్తనా కొడుకులు ( ఈ విషయంలో)

    రిప్లయితొలగించండి
  2. హైదరాబాదు విమోచనకి సంబంధించినంత వరకూ అది కేవలం ఆ నగరానికి మాత్రమే కాదు మొత్తం తెలంగాణా సాయుధ పోరాటంలో ఒక భాగమే ననుకుంటాను. అయినా సరే ఆ క్రెడిట్ అంతా కమ్యునిష్టులకే దక్కుతుంది. ఆ నిజాముకి రాజ్ ప్రముఖ్ బిరుదు నిచ్చిన నెహ్రూని పోడ్డం మొదలైనప్పటి నుంచీ "ఆకాసంబు నందుండి" అనె పద్యాన్ని గుర్తు చేస్తూ పతనమి పోయారు. పాపం!

    రిప్లయితొలగించండి
  3. అవును నా ఉద్దెశం కూడా, మొత్తం నైజాం రాష్త్ర విమోచన.

    కమ్యునిష్టులు గతంలో చైనాకు అనుకూలంగా పనిచేసి విస్వాసాన్ని కోల్పోయారు. ఇటీవల జ్యొతి బసు ను ప్రధాని కాకుండా అడ్డుపడి మరో తప్పు చేశారు

    రిప్లయితొలగించండి