2, సెప్టెంబర్ 2013, సోమవారం

చెల్లని కాసు - మోగని గంట


పొడిచేస్తాం పొడిచేస్తాం అన్నారు, తడి చేశారు అని మహా కవి శ్రీ శ్రీ చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి, ఈ రాజీ నామాలు చూస్తుంటే.   ముఖ్యమంత్రి సిఫారసు లేకుండా గవర్నర్ గారు మంత్రుల రాజీనామాను అంగీకరించే ప్రశ్నే లేదు.   చట్టం గురించి కనీస అవగాహన వున్న ఎవరికైనా తెలిసిన విషయమే ఇది.   కానీ, ప్రజలను మభ్యపెట్టే ఉద్దేశంతో గవర్నర్ను కలవడం మీడియాలో బ్రేకింగ్ న్యూస్ ఇవ్వడం చూస్తే ఇది ఒక ప్రహసనంగా కనపడుతుంది.


రాష్ట్ర విభజన ప్రకటన తరువాత, తీర సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులకు రాబోయే ఎన్నికలలో ధరావతు రావడం కష్టం అన్న విషయాన్ని కనిపెట్టి, మిగిలి వున్న రెండు పార్టీలలో ఎన్నికల నాటికి ఎక్కడో ఒక దగ్గర ఇరుక్కోవడానికి చేస్తున్న  టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలలో భాగంగానే ఈ రాజీనామాలను చూడాల్సి వుంటుంది.   ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రెండూ ప్రాంతాలలో జరగబోయే రాజకీయ విన్యాసాలు వీనుల విందు కాగలవు.    

2 కామెంట్‌లు :

  1. "...కాంగ్రెస్ నాయకులకు రాబోయే ఎన్నికలలో ధరావతు రావడం కష్టం...."

    నా ఉద్దేశ్యంలో, ప్రజల్లో "వీళ్ళు మనతో కలిసి రావటం లేదు వీళ్ళను ఓడిద్దాం" అనేటువంటి జ్ఞానం లేదు. మళ్ళి ఎలెక్షన్లు రాంగానే ఆ నుంచున్న వాడు "మన కులపోడేనా", లేదంటే తాగటానికి ఎంత పోయించాడు, ఎంత డబ్బు ఇచ్చాడు అని చూసుకుని ఓటేస్తున్నారు తప్ప మరొకటి కాదు. ప్రజలే అవినీతిపరులైపోయిన దేశం మనది. రాజకీయ చైతన్యం రావాలంటె ప్రజల్లోంచి రావాలి. అటువంటి రాజకీయ చైతన్యం ప్రజల్లోంచి వచ్చే అవకాశం ఇప్పట్లో శూన్యం. అందుకనే రాజకీయ నాయకులమని చెప్పుకునే లంపెన్ గాళ్ళు వాళ్ళకు ఎలా వీలైతే అలా ప్రజలను ఆడిస్తు తమ పబ్బం విజయవంతంగా గడిపేసుకుంటున్నారు.

    రిప్లయితొలగించండి
  2. "రాబోయే ఎన్నికలలో ధరావతు రావడం కష్టం"

    ఫరవాలేదండీ ఎనికలకు అయ్యే ఖర్చుల్లో బోడి ధరావతు ఏపాటిది? గద్దెను ఎక్కడానికి ధరావతు పోవడం అడ్డం రాదనే ఏనాడో రుజువు చేసారు మహానుభావులు.

    రిప్లయితొలగించండి