4, ఆగస్టు 2013, ఆదివారం

ఆంధ్రా నాయకుల దొంగ రాజీనామాలు


తీర సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు మరి ముఖ్యంగా కాంగ్రెస్ ఎం ఎల్ ఎ లు ఎం పీ లు రాజీనామా చేసి సమైక్యాన్ధ్రప్రదేశ్ కోరుకుంటున్నామని ప్రజలను మభ్య పెడుతున్నారు.   విభజన జరిగిపోయిన్ది.   దీనిని అడ్డుకోవడం ఎవరివలనా కాదు.  ప్రస్తుతం తేల్చాల్సింది న్యాయ పరంగా రావాల్సిన ఆస్తులలో వాటాలు, పునర్నిర్మాణానికయ్యే ఖర్చులు, తెలంగాణలో స్థిరపడిన వారికి కల్పించాల్సిన రాజ్యాంగ రక్షణలు మొదలైన  వాటిపై రాజ్యాంగ పరమైన రక్షణలు.     ఇవన్నీ డ్రాఫ్ట్ రూపంలో తయారు చేసి ప్రజలమధ్య వుంచి బిల్లును పార్లమెంటులో ప్రవెశపెట్టాలి.   నిజంగా అడ్డుకోవాలనే తపన లేదా రక్షణలు కల్పించడానికి సోనియా గాంధీ మెడలు వంచాలంటే తక్షణం కాంగ్రెస్ పార్టీ ఎంపీలు (మంత్రులతో సహా)  రాష్ట్రపతిని కలిసి తాము కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నామని ఉత్తరం ఇవ్వాలి.   అలానే, రాష్ట్రంలో కాంగ్రెస్ ఎం ఎల్ ఎ లు మంత్రులు గవర్నర్ ను కలిసి తాము కిరణ్ సర్కార్ పై విశ్వాసాన్ని కోల్పోయామని ఉత్తరం ఇవ్వాలి.    ఇలా చెయ్యకుండా దొంగ రాజీనామాలతో కొత్తగా రాబోయే రాజధానిలో సివిల్ కాంట్రాక్టుల కోసం తీర సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలను  తాకట్టు పెట్టడానికి కూడా వెనుకాడరు.   ఇందులో కావూరి, లగడపాటి, రాయపాటి ముందు వరుసలో నిలుస్తారు.     


నూతనంగా ఏర్పడే రాష్ట్రానికి ఒక వేళ కాపు సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇస్తే, ఉన్నత విద్యావంతుడు అనుభవము వున్న  పల్లం రాజు లాంటి వాళ్ళకు ఇస్తే మంచిది.   దగా స్టార్ లాంటి అతి తక్కువ చదువు వున్నవాడు, సొంత వూరిలో వోటమి పాలైనవాడు, తెలుగు ప్రజలను సామాజిక తెలంగాణా అని తరువాత సమైక్యమని ఇప్పుడు ప్రత్యేకమనే దగాకోరును మాత్రం ముఖ్యమంత్రిని చెయ్యకపోవడం భవిష్యత్ తరాలకు మంచిది.        

3 కామెంట్‌లు :

  1. ఇతర రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఏమి జరిగిందో అదే జరుగుతుంది. నాకు తెలిసి ఆస్తులు, అప్పులు, ఉద్యోగ నియామకాలు వగైరాలు అధికారిక యంత్రాంగానికి (executive wing) చెందినా విషయాలు. వీటికి పార్లమెంటులో పెట్టె బిల్లుతో సంబంధం లేదు. ఆంద్ర ప్రాంతానికి పాకేజు కూడా అంతే. కేంద్రం అనుకుంటే రేపే ప్రకటించవచ్చు.

    తెలంగాణాలో ఉన్న ప్రాంతెతరులకు ప్రత్యెక రక్షణ ఇచ్చే సదుపాయం లేదనుకుంటా. రాజ్యాంగ సవరణ లేకుండా సాధ్యం కాకపోవచ్చు. పైగా దీనివల్ల పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేదనే సంకేతాలు వెళ్తాయి. దీనితో ఇదే తరహా రక్షణ మాకూ కావాలంటూ ఇతర వర్గాలు (ఉ. బొంబాయిలో ఉత్తర భారతీయులు, బెంగుళూరులో తమిళులు, ఆంధ్రలో దళితులు వగైరా) అడిగే అవకాశాలు మెండు.

    ఇకపోతే మీకు కావాల్సింది ఏమిటి? సమైక్యమా వాటాలలో న్యాయమా? ఏది కావాలో అదే అడగండి తప్ప పక్కదారులు పోవడంతో మొదటికే నష్టం వస్తుందేమో?

    రిప్లయితొలగించండి
  2. "దగా స్టార్ లాంటి అతి తక్కువ చదువు వున్నవాడు, సొంత వూరిలో వోటమి పాలైనవాడు, తెలుగు ప్రజలను సామాజిక తెలంగాణా అని తరువాత సమైక్యమని ఇప్పుడు ప్రత్యేకమనే దగాకోరును మాత్రం ముఖ్యమంత్రిని చెయ్యకపోవడం భవిష్యత్ తరాలకు మంచిది"

    Do you still believe that Congress will win any seats in Andhra Area for your దగా స్టార్ to become CM????!!!!!!!!!!

    If still Congress wins seats in Andhra Area, there will not be any bigger fools than Andhra people in the world, nay entire universe.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Prasad garu: I believe Chandrashekar is referring to the immediate situation. There is a talk that KKR will resign or be replaced very soon.

      I am surprised by a couple of news stories. The first is the voting % in panchayat phase III (70% + throughout Andhra) the next day of the announcement. Equally seriously, most channels including ABN gave a reasonable score to Congress in 12 districts (except Cuddappah). So far, neither YCP nor TDP have said "voters gave tagine shasti to Congrss for giving Telangana"

      దీని భావమేమి తిరుమలేశా?

      తొలగించండి