2, ఆగస్టు 2013, శుక్రవారం

ఆంధ్రా ఉద్యోగులు తెలంగాణా ఖాళీ చెయ్యాలి : క చ రా


తెలంగాణా వచ్చిందన్న పుట్టెడు దుఃఖంతో కుమిలి పోతున్న కె సి ఆర్, తెలంగాణలో పనిచేస్తున్న ఆంద్ర ప్రాంత ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణా ఖాళీ చెయ్యాల్సిందే, వేరే దారి లేదు అని హుకుం జారీ చేశారు.    సీమాంధ్ర సినిమా షూటింగులు, విద్యాలయాలు, సెటిల్మెంట్లు, రియల్ వ్యాపారాల ద్వారా బంగారు బాతు  గుడ్లు పెట్టే వ్యాపారాన్ని వదులుకుంటే తనకు మిగిలేది చిప్పే అనే సంగితి తెలిసిపోయింది.   కాంగ్రెస్ పార్టీలో చేరితే తన బతుకు చిరింజీవి బతుకు కన్నా అధ్వాన్నం అవుతుందనీ తెలుసు. 


అందుకే ఏదో విధంగా బెదిరింపులకు దిగడం ద్వారా, వచ్చిన తెలంగాణాకు మెలిక పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.    తనే తెలంగాణా రాష్ట్రానికి దిక్కైనట్లు, కాబోయే ముఖ్యమంత్రి తరహాలో హుకుం జారీ చేస్తున్నాడు.  కనీసం బిల్లు పెట్టిందాకా ఓపిక పట్టకుండా రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్నాడు (క్షమించాలి, బిల్లు పెట్టిన తరువాత చెయ్యమని కాదు నా ఉద్దేశ్యం) .   తెలంగాణా వచ్చిన తరువాత వొంటరి పోరు చేసి భంగపడే కంటే.  తెలంగాణా బిల్లు ఇంకా కార్యరూపం దాల్చలేదు అని చెప్పి ప్రజలను మరోసారి రెచ్చగొట్టి ఓట్లు, సీట్లు, నోట్లు దండుకొనే ప్రయత్నంగా  అని అనిపిస్తుంది.


పొరుగు ప్రాంతంలో భావోద్వేగాలు ఉన్నపుడు పెద్ద మనిషి తరహాలో, అయిందేదో అయింది, మనమంతా తెలుగు వాళ్ళం, విడిపోయినా మనమందరం ఒకటే, మీకున్న భయాలు, సందేహాలు నాకు చెప్పండి, ఇక నుంచి నేనే మీకు అండగా వుంటాను అని నష్టపోయిన వాళ్ళ మనసులు గెలుచుకొనే ప్రయత్నం చెయ్యకుండా శక్తి వంచన లేకుండా రెచ్చగొడుతున్నారు.   నిన్నటికి నిన్న హరీష్ రావు గారు ముఖ్యమంత్రి గారి పక్షపాతాన్ని ఎండగట్టారు - కారణం, సీమాంధ్రలో అల్లర్లు జరుగుతుంటే రబ్బరు బుల్లెట్లు ఉపయోగించ వద్దు అని ముఖ్యమంత్రి చెప్పారట. అంటే ఇతగాడి ఉద్దేశ్యం ఎ కె 47 ఎందుకు వాడడం లేదు అని అర్ధం.  కెసిఆర్ గారి పత్రికలో రాస్తారు, అక్కడ ఉద్యమంలో పిడికెడు మంది కూడా పాల్గోటం లేదు అని.  మరి పిడికెడు మంది కోసం ఎ కె 47 అవసరమా?   కె సి ఆర్ నిరాహార దీక్ష జరిగిన మొదటి రోజే రంగు నీళ్ళు నెత్తిన పోసుకొని అగ్గిపెట్టె వెతికి వందాలాది ప్రాణాలు పోవడంలో ఆజ్యం పోసిన ఘనుడీయన.     ఎక్కడ చనిపోయినా పేదలు, యువకులు మాత్రమె.  ఇది వాంచనీయం కాదు.   ఇంతవరకు కె సి ఆర్ కు కానీ, లగడపాటికి కానీ ఒక్క లాఠీ దెబ్బ తగల లేదు. ఇదీ మహాత్మా గాంధీ నడిపిన పోరాటానికి  ఈ కుక్క మూతి పిందేలకు వున్న తేడా.    


మరోపక్క డిగ్గీ రాజా గారు, తెలంగాణా లోని తీర సీమాన్ద్రులకు రక్షణ కల్పిస్తాం అని చెప్పి, తెలంగాణా సమాజాన్ని దౌర్జన్యకారులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు.   ఆవేశాకావేశాలు రిగిల్చేది ఇరుప్రక్కల వున్న రాజకీయ నాయకులు మాత్రమే!  నిన్న రాయలసీమలో 8వ తరగతి చదివే పిల్లవాడు ఆత్మ హత్య చేసుకున్నాడు.   అంతకుముందు హైదరాబాదులో ఒక ఆటో డ్రైవర్ 610 జీ వో అమలు చెయ్యలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. రాష్ట్రం అంటే ఏమిటో 8వ తరగతి పిల్లవాడికి తెలియదు.  610 జీవో ఆటో చోదకుడికి సంబంధం లేనిది.   ఆవేశంతో తీసుకునే నిర్ణయం తీవ్రంగా  వుంటుంది. 


కొంచం ఉద్రిక్తతలు తగ్గగానే, కె సి ఆర్ తో సహా, అన్ని ప్రాంతాల నాయకులు ఆంధ్రప్రాంతంలో పర్యటించి, ఆయన మీద వాళ్ళకున్న ద్వేషాన్ని పోగొట్టే ప్రయత్నం చెయ్యాలి.  ఆయన లాంటి మాటకారి (కిలాడీకి) ఇదేమి గొప్ప విషయం కాదు.   అలానే, ఇరు పక్షాల విశ్వ విద్యాలయ విద్యార్ధుల నాయకులు నెలరోజులపాటు విశ్వవిద్యాలయాల  ఇంటర్ చేంజ్ చేసుకొని తద్వారా మమేకం అయ్యేందుకు ప్రోత్సహించాలి.  పనిలో పని, పొన్నం ప్రభాకర్ గారికి పుల్లట్లు కూడా తినిపించాలి.   ఇంత కాలంగా విష బీజాలు నాటిన నాయకులు తమ అహాన్ని చంపుకొని ఈ చర్యలకు పూనుకోవాలి.   ఇది జరగకుండా విభజన జరిగితే, తెలంగాణా రాష్ట్రం మీద పెట్టుబడి దారులకు అపనమ్మకం ఏర్పడి  నష్టపోయే ప్రమాదం వుంది.  


ఇరుపక్షాలకు  ఆమోద యోగ్యమైన పద్ధతిలో,   కేంద్రం విధి విధానాలను రూపొందించి రాష్ట్ర విభజన జరిగినా నష్టం లేదు అనుకొనే వారు చాలా మంది తీర ప్రాంతంలో వున్నారు.   అహంకారాన్ని పక్కనబెట్టి, ఇరు ప్రాంతాల పెద్ద మనుషులు, మేధావులతో (నాన్ పొలిటికల్) తక్షణం ఒక కమిటీ వేసి, సమస్యాత్మ విషయాలు వాటి పరిష్కారాలు గుర్తించాల్సి వుంది.  తమ కోరికను సాధించుకున్న వారు కొంత పట్టు విడుపు ధోరణి అవలంబించాలి.  వైషమ్యాలు పెంచి పొషించి   ఎన్ని సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఇంకా తగల పెడతారు.   దీనివలన తెలుగు జాతి పరువు పొరుగు  రాష్ట్రాలలో నవ్వులపాలైంది. 

  

9 కామెంట్‌లు :

  1. k.c.r గారు ఆంధ్ర ఉద్యోగులను గురించి చేసిన వ్యాఖ్యలు most uncalled for!వారి చిరకాల స్వప్నం సాకారమౌతున్న వేళ ఉద్రిక్తతలు రేకెత్తే విధంగా వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదు!పార్లమెంట్ లో పాస్ అయ్యేవరకు తెలంగాణా వచ్చినట్లుగా నమ్మనేనమ్మనని చెప్పిన మీరు ఇప్పుడే ఎందుకు అనవసరంగా తొందరపడి కలుగచేసుకుంటున్నారు!మీరు ఇపుడు ఒక పెద్దమనిషిలా చాలా balanced గా మాట్లాడాలని మీకంటే వయసులో పెద్దవాడిగా సలహా ఇస్తున్నాను!

    రిప్లయితొలగించండి
  2. అపకారి గారు,

    బహుశా మీరు ఈ వ్యాఖ్యలు క చ రా గారి గురించి చేసినట్లు భావిస్తున్నాను. రాష్త్రం విడిపోతే, ఆకాశం కిందికి రాదు. ప్రకటన చేసే ముందు రాజధాని, డబ్బులు, నీళ్ళు, స్థానికత లాంటి ముఖ్యమైన విషయాలు తెలియచేయకుండా కొత్త వివాదానికి తెర లేపింది కెంద్రం. మొత్తం వ్యవహారంలో నష్ట్తపోయింది కర్నూలు, అనంతపురం, శ్రీకాకుళం మరియు విజయనగరం మాత్రమే. ప్రాంతం ఏదైనా మనుషులంతా ఒక్కటే. సాటి తెలుగు వాడు తన భవిష్యత్ గురించి బాధలో వుంటే, రబ్బర్ బుల్లెట్లు ఎందుకు వాడడం లేదు అనే రాజకీయ నాయకుడిని సమాజం పట్టించుకోక పోయినా, పై వాడు చూస్తూ వూరుకోడు. పెట్టుబడిదారుడు ఏ ప్రాంతం వాడైనా, వాడికి సమాజం మీద వుండే ప్రేమలో తేడా వుండదు. వ్యాపారం మీద మాత్రమే ద్రుష్టి వుంటుంది. పాపం వినోద్ గారు విశాఖ లోను, మహారాష్ట్ర లోనూ పరిశ్రమలు పెట్టారు కానీ ఆదిలాబాదులో కాదు. ముడిసరుకు, అనుకూలత ఎక్కడ వుంటే అక్కడ పరిశ్రమ వస్తుంది నాకు తెలంగాణా మీద అవ్యాజమైన ప్రేమ వుంది కాబట్టి నాకు నష్టం వచ్చినా ఇక్కడే పరిశ్రమ పెదతా అని అనడు. కాటికి కాళ్ళు చాచిన వి హెచ్ లాంటి వాళ్ళు కూడా ఫుడ్ బాల్ అసొసిఏషన్ అధ్యక్షుదిగా పోటీలో వుంటారే తప్ప, ఆ ఆట గురించి తెలిసిన ఇంకో తెలంగాణా వాడికి ఇప్పిద్దాం అనుకోరు. తెలంగాణా లోని వ్యాపారస్తులైన గంగుల, నామా, వినోద్, నల్గొండ బ్రొదర్స్, రామిరెడ్డి, గుత్తా, కె టి ఆర్ తో పాటు టి జి, కావూరి, లగడపాటి, వెకయ్య నాయుడు, బొత్సా ... లిస్టు పెద్దది, అందరి పెత్తుబడి దారుల్ మనస్తత్వం వొకటే వుంటుంది. తమ పెట్టుబడులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కాపాడుకొనేందుకు తెలుగు తల్లి లేదు, తెలంగాణా తల్లి లేదు - ఎవరైకైనా ద్రోహం చేస్తారు.

    విభజన ఆపడం ఎవరి చేతులో లేదు. అడ్డుకోవడం అందరి చేతిలో వుంది. ఏదో కుంటి సాకు చూపించి భాజపా కూడా బిల్లుకు అడ్డుపడి ఆంధ్రాలో 4 సీట్లకోసం ఆశించవచ్చు. ఈ క్రీడలో మహా అయితే, ఇంకో వంద మంది చనిపోతారు. మరుసటి రోజు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఏ నాయకుడైనా, నీతిగా నిజయతీగా మాట్లాడితే వాళ్ళని అసెంబ్లీ సాక్షిగా కొడతారు, జనం కూడా అలాంటి వారికి వొట్లు వెయ్యరు. అదంతే.





    రిప్లయితొలగించండి
  3. The same story as reported in Hindu. http://www.thehindu.com/news/national/andhra-pradesh/coastal-districts-employees-have-to-go-back-kcr/article4983220.ece

    Some excerpts:

    The staff from coastal districts and Telangana will work in their respective regions. The former will have no option but go back as the government had to function in Andhra also,

    He recalled that he had never given a call for “jago-bhago” in the past, but only asked those from Andhra who earned jobs unjustly in Telangana to return.

    రిప్లయితొలగించండి
  4. జై గారు,

    ఇల్లు కాలి ఒకడెడుస్తుంటే, చుట్ట కాల్చుకోవడానికి నిప్పు దొరికిందని సంతొషపడ్డాడట మరొకడు.

    తెలుగోడి కొట్లాట అరవోడికి మహా పసందు. కధ మొత్తం నడిపింది చిద్దూనే, దిగ్గీ కాదు. కాబట్టి హిందూ పేపర్లో, నమస్తె తెలంగాణాలొ అలానే వస్తుంది. దెక్కన్ హెరల్ద్ 1948 నుండి వస్తున్న ఆంగ్ల పత్రిక, 31 వ తేదీన వచ్హిన సంపాదకీయం చదవండి. అమెరికన్ సంస్థల రిపోర్టులు కూడా చదవండి.

    జాగో భాగో అని అనలేదు; నో ఆప్షన్ అని అనలేదు అని మీరంటే, మీరు ఆ విషయాన్ని నమ్ముతుంటే, మీరు కూదా వచ్చే ఎన్నికలలో పోటీ చెయ్యంది. మీరు ఆయన వ్యక్తిత్వాన్ని నమ్ముతుంటే, మీకో నమస్కారం, వాదించి ఉపయోగం లేదు.

    నేను చెప్పింది కాదు. తల్లి దయను కాదని పినతల్లి దయకు ఏడుస్తున్న నారాయణకు, వెంకయ్యకు, మా రాజమండ్రి రాములమ్మకు అలానే అర్ధమైంది, మీకు ఎప్పుడూ వేరే రకంగానే అర్ధమౌతుందంటారు, ఇది అనకూడని సందర్భం అని మీరు ఖందించాల్సిన విషయం మర్చిపోయారు, నమస్కారం, శెలవు.


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హిందూ పేపర్ తెలంగాణా పక్షపాతి అంటే ఏమనాలో తెలియడం లేదు. వాళ్ళు ఎప్పుడూ సమైక్యాంధ్రనే సమరించారు. FYI రామ్ గారు సీపీఎం మద్దతుదారులు.

      తొలగించండి
  5. Chandrashekhar, unrelated to the subject but of interest to you.

    లాస్య రామకృష్ణ తో నిమ్మగడ్డ చంద్రశేఖర్ గారి ఇంటర్వ్య

    http://submityourblogs.blogspot.in/2013/08/blog-post.html

    రిప్లయితొలగించండి
  6. todays hindu paper headlines --

    TELANGANA DECISION OPENS ASSAM WOUNDS

    demands for new states may rock parliament

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Yes, there will be an intensification of other demands. But all these are old demands (like Scotland, Quebec etc.). No one will demand a state just because Telangana has been conceded.

      People were claiming 500 new demands or a state for every district. These forecasts have been proved wrong.

      తొలగించండి