23, ఆగస్టు 2013, శుక్రవారం

తగ్గుతున్న రూపాయి విలువ - కొందరికి మోదం మరికొందరికి ఖేదం


రూపాయి మారకం విలువ అంతర్జాతీయ మార్కెట్టులో గణనీయంగా తగ్గుముఖం పట్టింది.   డాలరు విలువ దాదాపు 64 రూపాయలకు ఎగబ్రాకింది.     ఈ మాసాంతానికి రూ॥ 70 వరకు పతనం తప్పదని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.    దీనికి ప్రధాన కారణం విదేశీ పరోక్ష పెట్టుబడుల ఉప సంహరణ(ట).   లాభాల స్వీకరణలో భాగంగా తమ పెట్టుబడులు మూకుమ్మడిగా వెనుకకు తీసుకుంటే, డాలరుకు వున్న డిమాండు పెరిగే అవకాశం వుంది.   


దీనివలన కొన్ని రంగాలతో ముడిపడిన ప్రజలకు అనుకోని లాభం చేకూరితే, కొంతమందికి విపరీతమైన నష్టాన్ని తెచ్చి పెడుతుంది.   అవేంటో చూద్దాం :  


విదేశాలలో పనిచేస్తున్న భారతీయులకు డాలర్ల రూపంలో జీతం వస్తుంది.   డాలర్ విలువ భారత ద్రవ్యంతో మార్పిడి రేటు పెరగడం వలన, మన దేశంలోని వారి NRI  ఖాతాలకు పెద్ద మొత్తంలో జమ అవుతుంది.  సహజంగా వారు స్థిరాస్తి రంగాలలో పెట్టుబడులకు మొగ్గు చూపుతారు.    రూపాయి పతనం ఎంత కొనసాగితే వారి ఆస్తులు అంట పెరుగుతాయి.   


మన దేశం నుండి విరివిగా ఎగుమతయ్యే సాఫ్టువేర్ ప్రోగ్రామ్స్ కు పంట పండినట్లే.  వీటితో పాటు  పొగాకు, సుగంధ ద్రవ్యాలు,  మెడికల్ ట్రాన్స్కీప్షన్ కంపెనీలు, ఉద్యోగులు లాభం పొందుతారు. 


తీవ్రంగా నష్టపోయే రంగాలలో పెట్రోల్, డీజిల్, విదేశాలలో చదువుతున్న విద్యార్ధులు, ట్రాన్స్పోర్టు రంగం, వాహన తయారీ దారులు, ఫార్మా, ఎరువులు, విదేశీ కొలాబరేషన్ వున్న కంపీనులు (రాయల్టీ చెల్లించాల్సినవి).    


నష్టపోయే రంగాలు ఏవీ తమ నష్టాలను లాభాల వాటాలో తగ్గించుకోవు.   ఇవన్నీ వినియోగదారుడి మీదకు అదనపు భారంగా మారనున్నాయి.   డీజిల్ కనీసం లీటర్కు 7 రూపాయలు వరకు పెరగవచ్చు.   క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదలవల్ల నిత్య వినియోగ వస్తువులు (FMCG GOODS) ధరలు పెరుగుతాయి.   అదనపు రవాణా భారం ఉప్పులు, పప్పులు, కూరగాయలు మరియు మిగిలిన అన్ని రంగాల మీద పడే అవకాశం వుంది.   ఒకసారి పెరిగిన ధరల ప్రకారం విధించే సర్ ఛార్జ్ మనకు అలవాటుగా మారి అది ధరలు తగ్గినా కూడా అలానే వుంటుంది.    పాపం ప్రధానికి నోరు లేదు, అమ్మగారికి నాలెడ్జ్ లేదు, మంత్రి గారికి మన బాధలతో సంబంధం లేదు.   రిలయన్స్ గోదాముల్లో మగ్గుతున్న ఉల్లిని బయటకు తీయించడానికి అన్ని పార్టీలకు మొహమాటాలు.   మనమే వీటన్నిటికీ అలవాటు పడాలి.       

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి