నిజంగా తెలుగు రాష్ట్రాన్ని ఒక్కటిగా వుంచాలానే ప్రఘాడ వాంఛ వైఎసార్ పార్టీకి వుంటే, రాజీనామా డ్రామాలు కట్టిపెట్టి, విజయమ్మ గారు స్వయంగా సోనియాగాంధీ గారిని కలిసి తమ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు ప్రతిపాదించాలి. దీనివల్ల స్వామి కార్యం స్వకార్యం నెరవేరుతుంది. కేవలం సీట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ విభజనను ప్రతిపాదిస్తున్నది నిజమైతే, ఈ కలయిక వలన కాంగ్రెస్ పార్టీ లక్ష్యం నెరవేరుతుంది. విజయమ్మ గారికి, షర్మిల గారికి కాళ్ళు నెప్పులు కూడా తగ్గుతాయి. ఈ ప్రతిపాదన తక్షణం చెయ్యకపోతే, రాయల తెలంగాణా జైలులో జగన్ నానా కష్టాలు పడే ప్రమాదం వుంది. నిజంగా జగన్ బాబు మీద ప్రేమ వుంటే, విజయమ్మ గారు తక్షణం తమ శాసన సభ్యులతో ధిల్లీకి ప్రయాణం కావాలి. ఎలాగు కాంగ్రెస్లో చేరదామనుకుంటున్న ప్రముఖ తెలంగాణా నాయకులకు కూడా ఈ నిర్ణయం ఊరట కలిగించవచ్చు.
ఆప్షన్ 2
ఒకవేళ సోనియా గాంధీ కాదు, కూడదు అంటే, తక్షణం నరేంద్ర మోడీని కలిసి, మా మద్దతు మీకే అని చెప్తే చాలు, తక్షణం సీన్ రివర్స్ అయిపోతుంది.
ఆలస్యం అమృతం - ఆంధ్రా విభజనం
మీరు చెప్పిన మొదటి వ్యూహాన్ని అడ్డుకునే శక్తి కొండా సురేఖ లాంటి వారికి లేదా?
రిప్లయితొలగించండిఇక రెండో వ్యూహానికి వస్తే, భాజపా తెలంగాణ సమర్తిస్తుంది కాబట్టి దీని వల్ల తెలంగాణా ఆగదు. పైగా వైకాప తెలంగాణాలో తుడిచిపెట్టుకు పోవడమే కాక సీమ/గుంటూరు/నెల్లూరు ప్రాంత ముస్లిం వోట్లు కూడా పోగొట్టుకుంటుంది. దీనితో జగన్ ముఖ్యమంత్రి కల కల్ల అవుతుంది.