23 సంవత్సరాల ఆనంద్ హిందూస్తాన్ ఏరో నాటిక్స్ లో గత 7 నెలల నుండి ట్రైనీ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. అతని సోదరుడు హంపన్నతో కలిసి బెంగళూరులో నివాసముంటున్నాడు. ఆఫీసుకు వెళ్లి వచ్చేప్పుడు బస్ కోసం నిలబడి వున్న ఆనంద్ తలమీద కాకి ఒక్క క్షణం కాలు పెట్టి ఎగిరింది. ఇలా రెండు సార్లు జరిగింది. మూఢ నమ్మకాలపై విశ్వాసం వున్న ఆనంద్ తన తల్లికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని కంగారుగా చెప్పాడు. జ్యోతిష్యుడ్ని కలిసిన ఆ తల్లి, దగ్గరలో వున్న హనుమంతరాయ స్వామీ ఆలయంలో దీపారాధన చెయ్యాల్సిందిగా సూచించింది. ఆ సమాధానంతో సంతృప్తి చెందని ఆనంద్, తనకు ఏదో కీడు జరగబోతోందని ఊహించుకొని, విషం సేవించి తన గదిలో వుండి పోయాడు. దురదృష్ట వశాత్తు, సంఘటన జరిగిన రోజు తన సోదరుడు వేరే వూర్లో వుండటం వలన ఈ విషయం ఆలస్యంగా తెలిసింది. ఆనంద్ కోసం సోదరుడు ఫోనులో ఎంతగా ప్రయత్నించినా సమాధానం లేకపోవడంతో, అనుమానంతో బెంగళూరు వచ్చి తలుపు తెరిచి చూడగా, నోటిలో నురగతో అచేతనంగా పడివున్న ఆనంద్ కనిపించాడు. మూఢ నమ్మకానికి ఆనంద్ బలైపోయాడు.
బెంగళూరు మిర్రర్ కధనం ఆధారంగా
ఈ విషయాన్ని మీకు ఎవరు ధృవీకరించారండీ ? అంటే అతను ఇలా మూఢనమ్మకంతోనే ఆత్మహత్యచెసుకున్నాడు ఇంకే కారణం లేదు అని.
రిప్లయితొలగించండిఇది నేను సొంతంగా వూహించించి రాసింది కాదు. పత్రికలొ వచ్చిన అంశం మాత్రమే. నేననుకొవడం, అతనిలొ మొడతినుండి ఒక మానసికి రుగ్మత వుండి వుండచ్చు. కాకి ఘటన అతనిపై తీవ్ర ప్రభావం చూపించింది.
రిప్లయితొలగించండి