గత రెండు వారాలుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే, ఆంద్ర ప్రదేశ్ విభజన దాదాపు ఖాయం అయినట్లే కనిపిస్తుంది. ఇప్పటి వరకు జాగో భాగో నినాదంతో రెచ్చిపోయిన నాయకులకు, తన ధన బలంతో దేశాన్నే శాసిద్దామనే దురుద్దేశంతో అత్యాశకు పోయిన మరొక నాయకునికి, ఒక చిన్న మంత్రి పదవి ఇవ్వకుండా తెరాసా ఆవిర్భావానికి పరోక్షంగా బీజం వేసిన ఇంకో నాయకునికి, కళ్ళెం వేసే ఎత్తుగడలోనుంచి పుట్టినదే ఈ "రాయల తెలంగాణా". హార్వర్డ్ యూనివర్సిటీలో చదివుకున్న కాంగ్రెస్ మేధావులు వేసిన ఈ పధకం వలన అనంతపురం, కర్నూల్ మరియు పూర్వ నిజాం రాష్ట్రంలో అసంఖ్యాకంగా వున్న ముస్లిం వోట్ బాంక్ ను కాపాడుకోవడమే కాకుండా, తెరాసా దూకుడుకు కళ్ళెం వేయగలుగుతుంది.
ఈ రకమైన విభజన వలన లక్షల సంఖ్యలో తెలంగాణా ప్రాంతంలో స్థిరపడిన తెలంగాణేతరులకు రక్షణ కల్పించినట్లవుతుంది. కోస్తాంధ్ర ప్రజలకు తెలంగాణా ప్రాంతంతో వున్న సంబంధాలకు ఎలాంటి ఇబ్బంది వుండదు కనుక నేలబారు తీర ఆంద్ర వాసికి నష్టం లేదు. సగటు తెలంగాణా ప్రజలకు, హైదరాబాదుతో కూడిన 10 జిల్లాలకు బదులు 12 జిల్లాలు వుండటం వలన ఎలాంటి అభ్యంతరం ఉండక పోవచ్చు.
పట్టుమని 10 మంది పంచాయతీ సమితి సభ్యులు కూడా లేని భాజపా ఇటీవలి కాలంలో తెలంగాణలో బలం పుంజుకుంటున్నది. పార్లమెంటులో రాయల తెలంగాణా బిల్లును అడ్డుకొనే ప్రయత్నం చెయ్యవచ్చు. ఇలా చేయడం ద్వారా, తెలంగాణలో ఆ పార్టీని ఎండగట్టే అవకాసం వుంది. దిమ్మ తిరిగే ఇలాంటి పరిష్కారాలు చూపించడం కేవలం కాంగ్రెస్కే సాధ్యం .
బహుళ ప్రయోజనాలున్న ఇలాంటి 'వేర్పాటు'ను కేవలం రాజకీయ నాయకులకు అభ్యంతరం ఉండచ్చు కానీ, ప్రజలకు ఎలాంటి అభ్యంతరం వుండదు.
బహుళ ప్రయోజనాలున్న ఇలాంటి 'వేర్పాటు'ను కేవలం రాజకీయ నాయకులకు అభ్యంతరం ఉండచ్చు కానీ, ప్రజలకు ఎలాంటి అభ్యంతరం వుండదు.
కాంగిరేసువారికే ప్రయోజనాలున్నాయీ ఈ పథకంలో అన్నది ముఖ్యం కాదు.
రిప్లయితొలగించండిఈ పథకం దేశప్రయోజనాలకు అనుగుణమేనా అన్నది ముఖ్యం.
ప్రజలకు తక్షణం అభ్యంతరం తోచనంత మాత్రాన దేశానికి యీ విభజన మేలు చేస్తుందని చెప్పలేమని గ్రహించగోర్తాను.
నేలబారు తీర ఆంద్ర వాసి అంటే యేమిటీ? వాళ్ళంతా లో-క్లాస్ పీపుల్ అని యెద్దేవా చేయటమా అలా అనటంలో అంతరార్థం?
ప్రజలకు యేమీ అభ్యంతరం ఉండదని టపా రచయిత యావత్తు తెలుగుప్రజానీకం తరుపునా యెలా వకాల్తా పుచ్చుకోగలరూ - అది పూర్తిగా అసంగతం.
ఈ రాజకీయజూదాలు వెగటు పుట్టిస్తున్నాయి.
మనం మన దేశ స్వాతంత్ర్యాన్ని అతి తేలిగ్గా తీసుకుంటున్నామా? ఎన్ని ముక్కలుగా చింపినా దేశపటాన్ని యే నష్టం లేదని అమాయకప్రజలూ అతితెలివి రాజకీయులూ అనుకోవటం బాధాకరం.
శ్యామలీయం గారు, శుభోదయం
రిప్లయితొలగించండి01) నేను వ్రాసిన నేలబారు పదం కేవలం సగటు మనిషి అన్న అర్ధంలో వాడాను. నేను కోస్తా ప్రాంతం నుంచి వచ్చిన వాడినే. కించపరచాలన్న వుద్దేశం ఈషణ్మాత్రం లేదు.
02) 10 జిల్లాల తెలంగాణ ఇస్తే, తెరాస రౌడీలు, తెలంగాణలో అసంఖ్యాకంగా స్థిరపడిన తెలంగాణేతరులను ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి రాయల తెలంగాణా మంచి మార్గం.
03) రాష్త్రం విడిపోకపోకపోతే సంతొషం, కానీ ఈ రావణ కాష్టం ఆపాలంటే, వేరే మార్గం లేదు. ముసలం ఇప్పటికే పుట్టింది.
04) తీర ఆంధ్ర ప్రాంత ప్రజలు శాంతి కాముకులు కాబట్టే, వెంకయ్య నాయుడు, నారాయణ లాంటి దుర్మార్గులని ఏమీ అనడం లేదు.
05) కె సి ఆర్ నాయకత్వంలో వెర్పడే రాష్ట్రం తెలంగాణాలో స్థిరపడిన ఆంధ్రులకు ముప్పు కలుగుతుంది కాబట్టి, రాయల తెలంగాణా మంచి పరిష్కారం.
శ్యామలీయం గారు, మరో విషయం
రిప్లయితొలగించండిఏ నిర్ణయమైనా, నాయకులకు మాత్రమే ప్రయోజనం, ప్రజలకు కాదు. మంచి ఉదాహరణ కావూరి గారే
రాష్ట్రవిభజన అంటూ జరిగితే (శాంతం పాపమ్) రాయలసీమను తెలంగాణాకే యివ్వనీయండి. మళ్ళీ తెలంగాణా దొరల స్ఫూర్తితో యీ రాయలసీమవారు ప్రత్యేకరాయలసీమరాష్ట్రం కోసం ఉద్యమాలు మొదలు పెట్టే దుష్పరిణామాన్ని మొదట్లోనే నివారించటం మంచిదే. తీరాంధ్రులు శాంతికాముకులు కాబట్టే అక్కడ అభివృధ్ధి నామమాత్రమే అయినా (ఉదా: కోనసీమ) మిగతా ప్రాంతాలవారు తామే వెనుకబడ్డామని చెప్పుకోవటం అల్లరి చేయటం తీరాంధ్రుల్ని దూషించటం జరుగుతున్నాయి.
రిప్లయితొలగించండివాస్తవానికి తెలంగాణా ప్రజలు అమాయకులు, నాయకులు మాయకులు . ప్రజలు అమాయకులు కాబట్టే, వారిని రెచ్చగొట్టి వాళ్ళ జీవితాలలో అశాంతిని నెలకొల్పారు. హరీష్ రావ్ లాంటి వారు కిరొసిన్ నెత్తిన పోసుకొని అగ్గిపెట్టె కోసం వెతుకుతుంటే, నిజమేనని నమ్మారు. నెలవారి జీతాన్ని వదులుకొని అమెరికా నుంచి వూడి పడితే, త్యాగం అనే బరువైన పేరు పెట్టారు. బందుల పేరుతో, విద్యా సంస్థలు మూసి వుంచి, కేవలం సారా అంగళ్ళు, సినిమా హాళ్ళు మాత్రమే మినహాఇస్తే ఏమీ మాట్లాడలేదు. రేపటి తెలంగాణాలో కోటి వుద్యొగాలొస్తాయని చెప్పిన స్వామి గౌడ్ గాంధి టోపీ పెట్టుకొని రజకీయ నాయకుడైతే సంతొషించారు. భూ దందాలు చేసి కోత్లకు పదగెత్తితే చూస్తూ వూరుకున్నారు. తెలంగాణా వస్తే డబల్ బెడ్ రూం ఫ్లాట్ కట్టిస్తానంటే నిజమని నమ్మారు. ఇలాంటి మాటలు నమ్మి మోసపోతున్న ప్రజలకు నా ప్రగాఢ సానుభూతి.
రిప్లయితొలగించండితెలుగు ప్రజలను శాశ్వతంగా విడదీసిన పాపం ఇరు ప్రాంతాల నాయకులదే అనడంలో సండేహం లేదు. ఉ దా : ఒక సామాజిక వర్గం వారు వెంకయ్య నాయుడిని తమల పాకుతో కొడతారు. కిషన్ రెడ్డి గారిని ఇంకో సామాజిక వర్గం వారు పల్లెత్తి మాత అనరు.
మొత్తానికి ఆంధ్రా వారు మాత్రమె శాంతి కాముకులని తేల్చారా, శబాష్! తెలంగాణా & రాయలసీమ ప్రజలు శాంతిని కోరుకోరన్న గొప్ప సత్యాన్ని ఇప్పటిదాకా అర్ధం చేసుకోని మాలాంటి మూర్ఖులను మన్నించగలరు.
రిప్లయితొలగించండిదురర్థాలు లాగవద్దు దయచేసి. తీరాంధ్రులు శాంతికాముకులంటే వారు మాత్రమే శాంతికాముకులూ తెలంగాణావాసులు కారూ అని దురర్థం యెందుకు చేసుకుంటున్నారు? ఆవేశాలు రెచ్చగొట్టటానికేనా? తెలంగాణా & రాయలసీమ ప్రజలు శాంతిని కోరుకోరన్న గొప్ప కొత్త సత్యాన్ని మీరు మీ కుహనావాదంతో పెడర్థాలతో ఆవిష్కరిస్తే ఆ దోషం మీదే కాని యితరులది కాదు సుమా.
తొలగించండితెలుగు తల్లి పెద్ద కొడుకు శాంతి కాముకుడు అని ప్రత్యేకంగా సెలవిస్తే మిగిలిన ఇద్దరు కాదన్నట్టు కాదాండీ? మనను మనం కాదు, అవతలి వారు మేచ్చుకోవాలనుకుంటా :)
తొలగించండితెలంగాణా ప్రజలు మంచి వారు, అమాయకులు అని నేను రాసిన ప్రత్యుత్తరాన్ని మాత్రం వదిలేశారు మీరు.
రిప్లయితొలగించండిపది జిల్లాలకు తోడు ఇంకో రెండు జిల్లాలను జొడించే వుద్దేశ్యం వెనుకాల బహుశా - అప్పటి వరకు కల్వకుంట్ల కుటుంబం మాట్లాడిన మాటలు, తెలంగాణా నాలుగు పక్కల కట్టిన గోడలు, హైదరాబాదులో బిజినెస్ సంస్థలకు కట్టిన వలలు, పేడ బిర్యానీలు, భాగో, జాగో, సంక్రాంతికి వెళితే వాపస్ రానియ్యం, మా వూళ్ళో బుల్లిబాబు అంటే వేరె అర్ధం వుంది అని తాగిన మైకంలొ మాత్లాదదం మొ||
పొట్టకూటికోసం వచ్చినవాళ్ళని ఎవరూ కొట్టకుండా మేము చూసుకుంటాము - ఈ మాట చదువుకున్న వాళ్ళు, విడిపోదామనుకునే వాళ్ళు మాట్లాదవలసినదేనా, గొట్టిముక్కల గారు?
ఎక్కడ రాజధాని వుంటుందో అక్కడికి సహజంగానే ప్రజలు వలస వెళ్తారు. క చ రా గారి మెహర్బానీ అవసరం లేదు. తన కుటుంబం మాత్రం తీర సీమాంధ్ర వారితో వ్యాపార సంబంధాలు, సెటిల్మెంటులు చెయ్యవచ్చు. పేద వాళ్ళ పిల్లలు మాత్రం చచ్చిపోవాలి. వాళ్ళకు అగ్గిపెట్టె దొరకకపోతే, మన తెలంగాణా మేనల్లుడు వెతికిస్తాడు.
విడిపోయే శుభఘడియలు వస్తున్న తరుణంలో, తెరాస కుటుంబం ఆయనచే నియమించబడిన పాఠాలు చెప్పని ప్రొఫెసర్లు, ఉద్యోగ విధులు నిర్వర్తించకుండా జీతాలు తీసుకొని శాశన స్భ్యులవుదామని వువ్విళ్ళూరే ఎన్ జి వో లు సమ్యమనం పాటిస్తే, పది జిల్లాలేకాదు రెందు జిల్లాల బోనస్ కూడా దక్కే అవకాశం వుంది.
సుదీర్ఘమైన నా ప్రత్యుత్తరాన్ని చదివినందుకు ధన్యవాదాలు. జై రాయల తెలంగాణా. జై జై రాయల తెలంగాణా \.
With due respect, I will answer in English.
తొలగించండిMost of your comment is unrelated to my own comment. I think you missed my meaning. I have no problems with anyone supporting or opposing any party/idea. My only objection is to stereotyping entire peoples.
No region/group has a patent over "peace loving nature". Why single out only Andhras for praise?
I can also write in rhetoric but it serves little purpose.
Anyway, thanks but no thanks for the "buy 10, get 2" offer.
బహుళ ప్రయోజనాలున్న ఇలాంటి 'వేర్పాటు'ను కేవలం రాజకీయ నాయకులకు అభ్యంతరం ఉండచ్చు కానీ, ప్రజలకు ఎలాంటి అభ్యంతరం వుండదు.
రిప్లయితొలగించండిపూర్తిగా వ్యతిరెకంగా చెప్పారు..... ప్రజలకె ఇబ్బంది కానీ నాయకులకు కాదు.
తెలంగాణా ఉద్యమ విషయం యేకోణంలో స్పృశించినా ఆవేశాలు రేగటం హర్షణీయం కాదు.
రిప్లయితొలగించండికాని దురదృష్టవశాత్తు ఇరుపక్షాలూ సులభంగా సంయమనం కోల్పూతున్నాయి. ఇది చాలా బాధాకరం.
ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనిలేకుండా స్వతంత్రభారతదేశంలో నాయకుల అవినీతి, అసమర్థత, అత్యుత్సాహాల పుణ్యమా అని అన్ని ప్రాంతాల ప్రజలకూ గత ఆరున్నరదశాబ్దాలుగా అన్యాయం జరుగుతూనే ఉంది.
బాగుపడిందీ, బాగుపడుతున్నదీ కేవలం రాజకీయనాయకులూ, బడాపారిశ్రామిక వేత్తలూ, వారి అండదండలున్న సంఘవ్యతిరేకశక్తులూ మాత్రమే!
ఈ దేశంలో ప్రజలపేరిట జరిగిన, జరుగుతున్న నిర్ణయాలూ ప్రణాళికలూ, కార్యక్రమాలూ అన్నీ పైన చెప్పిన వారి బాగుకోసమే కాని ప్రజలకోసం కాదని అందరికీ తెలిసీ యేమీ చేయలేని పరిస్థితి.
ఈ దేశంలో జరుగుతున్న ఉద్యమాలు చాలావరకూ నాయకుల సృష్టి అంటే అతిశయోక్తి కాదు. చైతన్యవంతులున్న ప్రజలదేశంలో పై బడాబాబులు ఇన్ని దశాబ్దులుగా జనాన్ని నంచుకుతినటం సాధ్యమయ్యేది కానే కాదు.
ఆంద్రప్రదేశ్ యేర్పాటు చేసినప్పుడే కొన్ని తెలుగుప్రాంతాలను పొరుగురాష్ట్రాలకు ధారపోసారు మన చేతకాని రాజకీయులు. ఇప్పుడు మనలో మనం కొట్టుకు చస్తుంటే, డిల్లీ పెద్దలు మనమంచి కోసం ఉన్న తెలుగురాష్ట్రాన్ని చించి ముక్కలు చేసే అందరికీ సంతోషం అభివృధ్ధీ కలిగే విధంగా యేర్పాటుచేస్తారట. అదిమనం నమ్మాలట. శుభం.
ఎన్నిముక్కలు చేయాలీ అంటే అది యెలా చించితే అధికారపార్టీరాజకీయులకు హెచ్చు లాభమో అలాగ చేస్తారని వేరే చెప్పాలా? ప్రజలకూ యేమీ లాభం ఉండదనీ వేరే చెప్పాలా?
మా ముక్క మాకు వచ్చాక యెవరెలా పోతే మాకేం అనుకునే నాయకులకు రొట్టె బాగానే పంచే కేంద్రం మేలే చేస్తుందని నమ్మచ్చునేమో!
మనవాళ్ళు వట్టి వెధవాయలోయ్ అని గిరీశం చేత గురజాడవారు అనిపించింది యెంత నిజం!
అసలు తెలుగు వాళ్ళ గడ్దని బోలెడు ముక్కలు చేసి పొరుగురాష్ట్రాలలో కలిపేస్తే బాగుంటుందేమో - నిత్యం తన్నుకు చచ్చే వాళ్ళకు రాష్ట్రమో రాష్ట్రాలో కావాలా అసలు?