ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పుడు ధిల్లీ వెళ్ళినా పత్రికలు, వార్తా ప్రసార మాధ్యమాలన్నీ, మంత్రివర్గ విస్తరణ అనుమతి కోసం అంటూ ఊదరకోట్టేస్తాయి. కానీ జరిగిన పరిణామం ఇంకోలా వుంది. మంత్రి వర్గంలో చేరింది మొదలు డి ఎల్ రవీంద్రా రెడ్డి పార్టీకి ఏదో ఒక రకంగా నష్టం చేస్తూనే వున్నారు. ఇటీవల ప్రవేశ పెట్టిన "బంగారు తల్లి" పధకంపై రెచ్చిపోయి మాట్లాడిన రవీంద్రా రెడ్డిని మంత్రి వర్గం నుంచి బర్త్రఫ్ చెయ్యడం ఆహ్వానించతగ్గ పరిణామం. ఈ పరిణామంతో అసమ్మతిపై కఠిన వైఖరి అవలంబించిన కాంగ్రెస్ పార్టీ, అదే కడప జిల్లాకు చెందిన మరో మంత్రి రామచంద్రయ్య, మెదక్ జిల్లాకు చెందిన ఉప ముఖ్య మంత్రికి కూడా ఒక హెచ్చరిక జారీ చేసినట్లైంది.
పార్టీకి తీవ్ర నష్టం చేస్తున్న రవీంద్రా రెడ్డి లాంటి వ్యక్తులపై చర్యలు కొంత ఆలస్యమైనా, సముచిత నిర్ణయం తీసుకోవడం ద్వారా, కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో తన పట్టు బిగించారని చెప్పక తప్పదు.
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి