ఎప్పుడెప్పుడు ప్రధాని పదవి చేపడదామా అని ఆశల పల్లకిలో ఊరేగుతున్న మోడీ గారు, ఉత్తరాఖండ్ వరదలోచ్చేప్పటికి, కేవలం తన రాష్ట్ర యాత్రీకులు మాత్రమే మనుషుల్లా కనిపించారు. గుజరాతీలను మాత్రమే గుట్టు చప్పుడు కాకుండా వరద ప్రాంతాలనుంచి తరలించారు. తనను తాన అత్యంత సమర్దునిగా వర్ణించుకునే వ్యక్తీ, తన రాష్ట్రానికి చెందిన కార్పోరెట్ల నుంచి సహాయం సేకరించి బాధితులకు అందించాల్సింది.
సువిశాల భారత దేశ ప్రధానిగా తనను తాను అభివర్ణించుకుంటున్న మోడీ సారు, నిత్య ప్రచార పటాటోపానికి కొన్ని విదేశీ కంసల్టింగ్ సంస్థలను కూడా ఏర్పరచుకున్నారట. దేశ ప్రధాని అంటే కేవలం డిజైనర్ డ్రెస్, మత ఛాందస వాదం, నిత్య ప్రచార కార్యక్రమాలు కాదు కావలసింది. అన్ని కులాలను, అన్ని మతాలను కలుపుకుపోయే జాతీయ సెక్యులర్ దృక్పధం అవసరం. అలాంటి గొప్ప వారిలో పూర్వ ప్రధాని, కాశ్మీరీ పండిత కుటుంబం నుంచి వచ్చి, ఆదర్శ వివాహం చేసుకున్న మన ఇందిరా గాంధీ . ఒక సారి చిక్క మగళూరు నుంచి, ఇంకో సారి మెదక్, మరోసారి రాయ్ బరేలి నుంచి గెలిచి దేశ రాజకీయాలకు దిశా దశ నిర్దేశం చేసింది. ఇదే కోవలోకి వస్తాడు మన పి వి. బహు భాషా కోవిదుడు, నిరాడంబరుడు, విద్యాధికుడు. వాజపేయి కూడా ఇదే కోవకు చెందుతారు. ఇంత గొప్ప వారి సరసన మోడీని ప్రధానిగా ఊహించుకోవడం కష్టం.
కాశ్మీరీ పండిత కుటుంబం నుంచి వచ్చి, ఆదర్శ వివాహం చేసుకున్న మన ఇందిరా గాంధీ
రిప్లయితొలగించండి------------
యేమిటా ఆదర్శ వివాహం? ముస్లిమ్ని చెసుకున్నానని గొప్పగా చెప్పుకోవటానికి వీల్లేకుందా అతనికే ఇంటి పేరు మార్చటమా?
@hari,
రిప్లయితొలగించండిFeroze Gandhi is not Muslim, he is Parsi.
Gandhi in Feroze Gandhi is not derived from Mohanlal Karam chand Gandhi. Feroze family name is Gandhi itself. Gandhi's are there in all religions, infact Gandhi means " Scent Merchant". Usually Gujarathi family/surnames are derived from their occupation, so it is quite common to have same surname for people from different religions.
తార గారూ, ఆ ఫిరోజ్ గాంధి అనే పార్సి యొక్క తలిదండ్రుల పేర్లు చెప్పగలరా? ఇప్పటి వరకు నేను చదివిన ప్రతిచోటా వేరే గా చదివాను ఫిరోజ్ ఖాన్ అని.యేది యేమైనప్పటికీ ఒక పార్సి కుర్రాడు జవహర్ లాల్ నెహ్రు అనే కష్మిరీ ఇంటికి తన సొంత ఎంటిటీ తో అల్లుడు అవలేకపొయ్యాడు. గాంది గారు దత్తత లాంతి ఒక్ యవ్వారం నదిపితే తప్ప అది కూడా అదర్సమే అనాలా?
తొలగించండిహరిగారు,
తొలగించండిగాంధీ దత్తత జరుగలేదు, గాంధీ వీళ్ళ పెళ్ళిని ఆమోదించలేదు, అసలు పెళ్ళికే వెళ్ళలేదు, ఈ దత్తత అనేది ఒక కల్పిత కధ, ఎలా వచ్చిందో నాకు తెలియదు. అప్పట్లో వీరిద్దరి పెళ్ళికి చట్టబద్దత లేదు, దానికోసం కొత్తగా ఆదర్శ వివాహ తంతు కనిపెట్టరు ఒక సుప్రీం కోర్టు జడ్జి అనుకుంటాను, అదే కొద్దిమార్పులతో ఇప్పటి ఆర్య సమాజ్ పెళ్ళి తంతు(?). మీరు కావలిసి వస్తే అప్పటి పేపర్లు రిఫర్ చేయొచ్చు, అవి అన్నీ ఇప్పటికీ అర్కైవ్స్ లో అందుబాటులోనే ఉన్నాయి, ఎదైన పెద్ద లైబ్రరీలలో దొరుకుతాయి లేదా డిల్లీలో తీన్ మూర్తీ భవన్లో కుడా అందుబాటులోనే ఉన్నాయి.
ఫిరోజ్ గాంధీ తల్లిదండ్రులు ఎవరు అన్నది (ఒక హిందూ తండి, పార్సీ డాక్టర్ తల్లి - ఆవిడ దగ్గిరే పెరిగాడు, అవీడే తల్లి అన్నది ఎక్కువమంది విశ్వాసం, కానీ చట్ట రిత్యా ఆవిడ మేనత్త అని, దత్తతు తీసుకున్నది అని రికార్డుల్లో ఉన్నది). ఒక స్పష్టత లేదు.
ఇక ఫిరోజ్ గాంధిని అల్లుడుగా నెహ్రూ అంగీకరించని కారణం అతని వ్యసనాలు, చివరకి అది భరించలేనంతగా అయ్యి విడిపోయారు తప్ప, వేరే కారణం కాదు, ఫిరోజ్ తగవు పెట్టుకోని నాయకుడు అంటూ లేదు అప్పట్లో.
మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం, తల్లి రతిమయి, తండ్రి జహంగీర్ గాంధి.
తార గారూ, నాకు మీరు చెప్పే వరకూ అతను పార్సి అనేది తెలియదు. నేను ఇదివరకు చదివిన ప్రతి చోటా ఫెరోజ్ గాంధి పెల్లికి ముందు ముస్లిం అని అతని తండ్రి ఒక్ గ్రోసర్ అనీ నెహ్రు కి స్నెహితుడు అనీ అతని పెరు నవాబ్ ఖాన్ అనీ చదివి ఉన్నాను. మీ జవాబు నన్ను మరింత కంఫ్యూస్ చేస్తున్నది.
తొలగించండిమీరు ఒక విషయాన్ని ఖండించతానికి జవాబు చెప్తూ కూడా - "ఎలా వచ్చిందో నాకు తెలియదు", "అనుకుంటాను", "ఒక స్పష్టత లేదు" - అని అంటున్నారు. వస్తుత - ఇందిరా గాంధి పట్ల నాకు వ్యతిరెకత యేమీ లేదు. నా కామెంటు అబద్దమైతే సారీ చెప్పతానికి మొహమాత పదను. కాబట్టి అలా అసందిగ్ఢమైన జవాబు కాకుండా ఖచ్చితమైన జవాబు చెప్పండి. పైగా రెందో వెర్షన్ చెబుతున్న వాళ్ళు మాత్రం ఇలా కాకుండా ఖచ్చితమైన్ ఆధారలు ఉన్నాయని అంతున్నారు. మీరు కొంచెం విస్తృతంగా నిబధంగా జవాబిస్తారని ఆశిస్తున్నాను.
http://www.indianexpress.com/oldStory/82389/
తొలగించండిhttp://www.nytimes.com/1984/05/02/world/around-the-world-mrs-gandhi-not-hindu-daughter-in-law-says.html
తొలగించండి