26, మార్చి 2013, మంగళవారం

అంధకారంలో ఆంధ్ర ప్రదేశ్


రాష్ట్రం తీవ్ర విద్యుత్ సంక్షోభంలో వుందని ముఖ్యమంత్రి గారే స్వయంగా ఒప్పుకోవడాన్ని బట్టి చూస్తే పరిస్తితి తీవ్రత అర్ధమవుతుంది.   ఈ సంక్షోభానికి తెరాసా,   వైయసార్ వాళ్ళేమో తెదేపాను కిరణ్ కుమార్ గారిని తప్పుపట్టడం, తెదేపా వాళ్ళేమో కిరణ్ కుమార్ గారిని వైఎస్ ను తప్పు పట్టడం చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతున్ది.     


కరెంటు కష్టాలకు ప్రక్రుతి సహకరించక పోవడంతోపాటు, బాబు గారి హయాంలోనూ, రాజశేఖర రెడ్డి గారి పాలనా కాలంలోనూ సరిదిద్దలేని తప్పులు జరిగాయి.    గోదావరి బేసిన్ లో గాస్ గుజరాత్ ప్రభుత్వం తరలించుకు పోయినపుడు బాబు గారు ఎందుకు చేష్టలుడిగి కూర్చున్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం వుంది .   తరువాత వచ్చిన సబ్సిడీ ప్రభుత్వం విద్యుత్ ఉత్పాదనను పట్టించుకోకుండా కేవలం ఉచిత విద్యుత్ పంపిణీ మీద దృష్టి పెట్టి వోట్ల రాజకీయం చేసింది .    విద్యుత్ ఛార్జీలు కనిష్టంగా కూడా పెంచకుండా, ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పనిచేయడం వలన, ప్రస్తుత ప్రభుత్వం మీద మోయలేని భారం ఒక్క సారిగా పదుతున్నది.   


ప్రైవేటు రంగంలో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కోసం వచ్చే సంస్థలను మన నారాయణ గారు రానివ్వరు.  వచ్చే వాళ్ళల్లో 90 శాతం పచ్చటి పొలాలను ఏదో ఒక రకంగా కాజెయ్యాలనే దురుద్దేశంతో వచ్చే వాళ్ళే!   
విద్యుత్ కొరత, ఛార్జీల పెంపు మీద నిరంతరం పోరాడుతున్న వామ పక్షాలను మరియు ప్రతిపక్షాలను  ఎదుర్కోవడానికి కిరణ్ కుమార్ సర్కార్ ఇప్పటికిప్పుడు చెయ్యగలిగింది ఏమీ లెదు.   కనీసం భవిష్యత్ అవసారాలను దృష్టిలో పెట్టుకొని ఎన్ టి పి సి లాంటి సంస్థలతో కలిసి వారి ఆధ్వర్యంలో పనిచేసేలా మాత్రమె ప్రైవేటు రంగంలో విద్యుత్ ఉత్పాదనను ప్రోత్సహించాలి.   బొగ్గు ఆధారిత విద్యత్ ఉత్పాదన కేంద్రాల నుంచి వచ్చే కాలుష్యం (fly ash ) వల్ల ప్రజలు తీవ్రంగా నష్ట పొతారు.   కానీ ప్రస్తుతం వున్న కాలుష్య నియంత్రణ పరికరాల ద్వారా గరిష్టంగా  దీనిని అరికట్టవచ్చు .    అదే విధంగా బొగ్గు నుంచి వచ్చే బూడిదను నిర్జన ప్రదేశాలలో పెద్ద పెద్ద నీటి కుంటలు తవ్వి వాటిలోకి బూడిదను వదలడం ద్వారా, నాణ్యమైన బొగ్గును వినియోగించడం ద్వారా,  రోడ్ల నిర్మాణం లోనూ, సిమెంటు ఇటుకల తయారీలో, సిమెంటు పరిశ్రమలలో కూడా దీనిని ఉపయోగించి చాలా వరకు కాలుష్యాన్ని తగ్గించవచ్చు.   

6 కామెంట్‌లు :

  1. పనికి రాని సలహాలు,
    నిర్జన ప్రదేశం అంటే పంట పొలాలు కదా? వాటిని పనికి రాకుండా చెయ్యడమా?
    ఇక ఆ బూడిదను ఎవరు రవాణా చేస్తారు?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తమకు తెలుగు నేర్పిన వెధవ ఎవరో. నిర్జన అంటే జనం లేని ప్రాంతం, అంతేగాని అతిగా వూహించేసుకోక.

      తొలగించండి
    2. అజ్యాని గారు, నేను చెప్పింది కూడా అదే కదా! కేవలం మీ లాగా మాట తూల లేదు అంతే తేడా. నన్ను తిట్టండి ఫరవా లేదు. పాపం నాకు చదువు చెప్పిన వ్యక్తిని ఎందుకు తిడతారు. మీలాగా నేను అజ్యాని అనే ముసుగు వేసుకోలేదు. అందుకే, భరించ గలిగిన బూతులు మీరు ప్రయోగించిన ప్రతి సారి నేను ప్రచురిస్తున్నాను.

      తొలగించండి
  2. నిర్జన అంటే నాకు తెలిసినంతవరకు పొలాలు అని కాదు! జనం ఉండని చోట అని. నాది పనికి రాని సలహా. మరి మీ పనికొచ్చె సలహా ఏమితో సెలవివ్వ లేదు. అజ్యాత గారు - వందల కిలోమీతర్లు పెట్రోలు, గ్యాసు, ఇనుప ఖనిజం మన దేశంలో ప్రస్తుతం రవాణా జరుగుతోంది. బూదిదను రవాణా చెయ్యడం పెద్ద కష్తం కాదు. లేదా బూడిదను ఉపయోగించే పరిశ్రమలు అక్కడె స్థాపించవచ్చు.

    అణు విద్యుత్ వద్దు. జల విద్యుత్ తగినంతగా అందుబాటులో లేదు. బొగ్గు ఆధారిత విద్యుత్ మంచిదికాదు. కానీ కరెంటు 24 గంటలు కావాలి.

    రిప్లయితొలగించండి
  3. Agjaata kaadu aayana agnaanaa...very
    Good post..unndi unnattu chepparu..neutral gaa

    రిప్లయితొలగించండి
  4. Agjaata kaadu aayana agnaanaa...very
    Good post..unndi unnattu chepparu..neutral gaa

    రిప్లయితొలగించండి