5, ఫిబ్రవరి 2013, మంగళవారం

కర్ణాటకలో భాజపాకు త్వరలో ష(శే)ట్టర్

 
కొన్నిరాష్ట్రాలలో వ్యక్తులకున్న పలుకుబడి, ఆదరణ జాతీయ పార్టీలకు లేదు. నిజానికి దేశంలో ప్రస్తుతానికి చెప్పుకోదగ్గ జాతీయ పార్టీ ఏదైనా వుంది అంటే, కాస్తో కూస్తో కాంగ్రెస్ మాత్రమే. దక్షిణాది రాష్ట్రాలైన ఆంద్ర ప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుదుచేరి మరియు కర్నాటక రాష్ట్రాలలో మొత్తం వున్న శాసన సభ స్థానాలు 930 కాగా అందులో కాంగ్రెస్కి 285 మంది సభ్యులు, భాజపాకు ఉన్న సభ్యుల సంఖ్య 99 మాత్రమే. అంటే సగటున కాంగ్రెస్ బలం 30 శాతం కాగా భాజపా బలం కేవలం 9.6 శాతం మాత్రమె. అన్ని దక్షిణాది రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం ఉండగా, భాజపా కేవలం కర్నాటకలో మాత్రమే ఉంది. ఆంద్ర ప్రదేశ్లో భాజపా కేవలం ఒక ప్రాంతంలో కొన్ని పట్టణాలకు మాత్రమె పరిమితం.
 
భాజపాకు వున్న ఈ 10 శాతం కేవలం కర్నాటక రాష్ట్రం నుంచి దక్కినది. కర్ణాటకలో భాజపా పరిస్తితి అచ్చుగుద్దినట్లు ఆంద్ర ప్రదేశ్లో ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ పరిస్తితిని  తలపిస్తున్నది. కర్ణాటకలో ఈ సంవత్సరం ఏప్రిల్ తరువాత ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం వుంది. అదే జరిగితే, దక్షిణాదిన భాజపా ప్రాబల్యం పూర్తిగే కోలోపోయినట్లే.



2 కామెంట్‌లు :

  1. "కర్ణాటకలో భాజపా పరిస్తితి అచ్చుగుద్దినట్లు ఆంద్ర ప్రదేశ్లో ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ పరిస్తితిని తలపిస్తున్నది."

    కాంగీల పరిస్తితి భిన్నంగా ఎమి లేదు కదా దక్షినాదిన ఒకే ఒక రాష్ట్రం లొ పాలన లొ ఉంది!అది కూడా తుమ్మితె ఊడేలా.
    భాజాపా కూడా ఒకే రాష్ట్రం లో పాలనలో ఉంది! మరి ఒకే ఒక జాతీయ పార్టీ అని ఎలా అనగలరు?ఇక కాంగీ కి 285-అన్నారు భాజాపా కి కేవలం 99,అంటే 99 సీట్ల తో కర్నాటక లో నిలబడిందన్న మాట!!
    ఈ చిన్న రాష్ట్రాల లో ఎం చూస్తాం కాని ఒక సారి ఉత్తరప్రదెష్ లో చూస్తె మరి కాంగీ అసలు జాతీయ పార్టీ కాదు గానీ లోకల్ పార్టీ అవుతుందెమో?అక్కడ భాజాపా బాగానే (చాలా లొకల్ బాడీస్ గెలిచి)ఉంది మరి!
    ఒక సిద్ధాంతం అనేది ఉన్నది రెండె రెండింటికి 1 భాజాపా,2ఎర్ర పార్టీలు,మన కాంగీదంతా రాద్దాంతమే గదా!!

    Narsimha K
    Hyderabad(Currently:Banglore)

    రిప్లయితొలగించండి
  2. ఉత్తర ప్రదెష్ విషయంలొ మీ అభిప్రాయంతో పాక్షికంగా ఏకీభవిస్తాను. కేవలం రామ జన్మ భూమిని అడ్డం పెట్టుకొని ఒక్క సారి మాత్రమే ఈ దేశంలో (ఉత్తర ప్రదేష్) ద్వారా భా జ పా గెలిచింది. ప్రస్తుతం భాజపా అక్కద గెలిచే పర్స్తితి ఇప్పట్లో లేదు. కంగ్రెస్ పరిస్తితీ అక్కడ అంతే.

    కానీ, రామ జన్మ భూమి విషయంలో, భాజపా అధికారినికి వచ్చిన తరువాత నుంచి ఈ రోజు వరకు ఎప్పుడైనా ప్రస్తావించిందా? ఎందుకంటే, అది ఏ మాత్రం ఎన్నికల విషయం కాదు, ఓట్లు తేలేదు కాబట్టి. ఇదే ద్వంద వైఖరి ఒక ఓటు రెండు రాష్త్రాలు సందర్భంగా అవలంబించింది. విదర్భ విషయంలో ఒక రకంగా, ఎ పి విషయంలో మరో రకంగా వ్యవహరించ లేదా? కంగ్రెస్ కన్నా ఏ విధంగా భాజపా నమ్మదగినది.

    కర్నతకలో ప్రస్తుతం వారి సభ్యుల సంఖ్య కేవలం 96 మాత్రమే.

    రిప్లయితొలగించండి