18, ఫిబ్రవరి 2013, సోమవారం

అఫ్జల్ గురు ఉరిపై అనవసర రాద్ధాంతం


దశాబ్ద కాలంపాటు సుదీర్ఘంగా నడిచిన ఈ కేసులో చివరికి బాధితులకు న్యాయం జరిగింది.    దేశ సార్వభౌమత్వానికే సవాలు విసిరిన ముష్కరుడు అఫ్జల్ గురుకి ఉరి శిక్ష సరైనదే.    విదేశీయుడైన కసాబ్ కేసులోనే తన తరఫున వాదించడానికి న్యాయవాదిని నియమించిన మన దేశ న్యాయ వ్యవస్థ ప్రపంచానికి తలమానికం.  


అఫ్జల్ గురును ఉరి తీస్తే బాధపడిన వాళ్ళు ఎక్కువమంది తీవ్రవాద మనస్తత్వం కలిగిన వాళ్ళే!     పాకిస్తాన్ ఆశ్రయం పొందిన తీవ్ర వాదులు, నిషేధిత ఎల్ ఇ టి, జె ఎం ఎం,  జె కె ఎల్ ఎఫ్ నేతలతో పాటు మన రాష్ట్రం నుంచి పౌర హక్కులు కాపాడే నేతలు ఉన్నారు.      దురదృష్టం కొద్దీ మన రాష్ట్రంలో జన్మించిన ఒకాయాన, ఏకంగా అఫ్జల్ గురును భగత్ సింగ్ తో పోల్చి తన తీవ్ర వాద భావజాలాన్ని మన మీద రుద్దే ప్రయత్నం చేశాడు.     వీళ్ళకు, ఆ దాడిలో చనిపోయిన అమాయక కుటుంబాల పట్ల కనీసం జాలికూడా లేదు.     


అఫ్జల్ ఉరి పట్ల కలత చెందిన వాళ్ళు కేవలం తీవ్రవాదులు, ఉగ్రవాదులు మరియు పౌర హక్కుల ముసుగులో వున్న కొద్దిమంది తీవ్ర వాద సానుభూతిపరులు మాత్రమే.    సగటు భారతీయ ముస్లిం సమాజం ఒక ఉగ్రవాది ఉరిని పట్టించుకోక పోవడం ఇక్కడ  గమనార్హం.     ఇంత కాలం తరువాత రాష్ట్రపతి భవన్లో ఒక నిఖార్సైన  అధ్యక్షుడుని భారత దేశం కలిగి వుంది అని గర్వంగా వుంది.  


ఈ ఉరి శిక్ష అమలు జరిగిన తరువాత  భాజపా వారు మిఠాయిలు పంచుకోవడం, నృత్యాలు గట్రా చేయడం చూస్తే అనవసరంగా గొడవలు సృష్టించడానికి చేసిన ప్రయత్నంలా కనిపిస్తుంది.       

4 కామెంట్‌లు :




  1. రాజకీయకారణాలవల్ల బాగా ఆలస్యంగానైనా న్యాయం జరిగింది.దీనికి నిరసన తెలపడం శోచనీయం.బాధితులకు,దేశభక్తులకు ఊరట కలిగించింది.అయితే మిఠాయిలు పంచిపెట్టడం వంటివి అనవసరం. Just take it in your stride.

    రిప్లయితొలగించండి
  2. ఇంత కాలం తరువాత రాష్ట్రపతి భవన్లో ఒక నిఖార్సైన అధ్యక్షుడుని భారత దేశం కలిగి వుంది అని గర్వంగా వుంది.

    మీరన్నదాంట్లో నిజం ఉంది .....ఇక్కడ నిఖార్సైన అధ్యక్షుడు కాంగ్రేసు చాణక్యుడు, ఆ పార్టీ కి పేద్ద గోడ,కర్తవ్య-కార్య దక్షత కలిగి, కాంగ్రేసు నుండి వచ్చిన అధ్యక్షుడు ఈ యనేనేనో (గతం లో కాంగ్రేసు అధ్యక్షులందరు రబ్బరు స్టాంపుకి న్యాయం చెసిన వాళ్ళే ఉదాహ్:ప్రతిభా పాటిల్.)మరో పార్టీ గనక అధికారం లోకి వస్తె చుక్కలే అని నా అనుమనం!!

    Narsimha

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మన దురద్రుష్టం ఆయన ఈ దేశానికి ప్రధాని కాకపోవడం

      తొలగించండి
    2. ఆర్థిక మంత్రిగా దశాబ్దాలుగా కేబినెట్ హోదా మంత్రిగా ఏం వుద్ధరించాడని, ప్రధాని కాలేదని చింతిస్తున్నారో అర్థం కాలేదు. రాష్ట్రపతి అయ్యి క్షమాభిక్ష రిజక్ట్ చేస్తూ సంతకం పెట్తమని హైకమాండ్ ఆదేశిస్తే నోరెత్తకుండా పెట్టినందుకు మహా కార్యదక్షుడైపోయాడా? హూ.. ఆ ప్లేసులో మీరు, నేనూ వున్నా అంతకన్నా బాగానే చేస్తాములేండి.

      తొలగించండి