4, జనవరి 2013, శుక్రవారం

తె రా స కు మింగుడుపడని తెలుగు దేశం నిర్ణయం 

గత నెల 28న గృహ శాఖామాత్యులు నిర్వహించిన అఖిల పక్షంలో జరిగిన కొన్ని పరిణామాలు తె రా సకు ఏ మాత్రం మింగుడు పడటం లేదు. దీనికి కారణం తే దే పా తీసుకున్న తెలంగాణా అనుకూల నిర్ణయం మాత్రమే. తె దే పా ప్రణబ్ కమిటీకి ఇచ్చిన లేఖ చాలా స్పష్టంగా ప్రత్యేక తెలంగాణాకి ఆమోదముద్ర వేస్తూ చేసిన తీర్మానం. ఇష్టం వున్నా లేకపోయినా, ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా వారు చేసిన తీర్మానం ఉపసంహరించుకోలేదు కాబట్టి తె దే పా ప్రత్యెక రాష్ట్రానికి అనుకూలంగా ఉన్నట్లే. తె దే పా నిర్ణయంతో సంబంధం లేకుండానే, తీర సీమాన్ధ్రలో దాదాపు ఓటర్లు వై కా పా కు అనుకూలంగా ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ ప్రాంతంలో వున్న 184 స్థానాలలో కనీసం 130 స్థానాలలో వైకాపాకి ఆధిక్యం వచ్చే అవకాశం వుంది. రెడ్డి, కమ్మ, కాపు ఆ కులం ఈ కులమని లేకుండా జగన్ పార్టీ లోకి పెరుగుతున్న వలసలే దీనికి తార్కాణం. స్వయంగా ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూర్ జిల్లాలో ఇప్పటికే ముగ్గురు పేరుగల్ల శాసన సభ్యులు, ముగ్గురు మాజీ సభ్యులు జై జగన్ అనేశారు. ఇహ కాంగ్రెస్ పరిస్తితి అంటారా, జగన్ పార్టీ ఎన్నికల తర్వాత కాంగ్రెసుతో కలవచ్చు లేదా కలిపేయవచ్చు. జగన్ విజయం, పరోక్షంగా కాంగ్రెస్ విజయమే!కొంతమంది తెలంగాణా నాయకులు కూడా జగన్ పక్షానికి చేరడానికి సమయం సందర్భం (సరైన సమయంలో సరైన నిర్ణయం - బాగా పాపులర్ అయిన డవిలాగు) కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నికలలోపు భారీ ఎత్తున తెలంగాణలో కూడా జగన్ పార్టీలోకి వలసలు పెరిగితే, మిగిలిన 110 స్థానాలలో 20 నుంచి 25 స్థానాలలో జగన్ పార్టీ జెండా పాతే అవకాశం తోసిపుచ్చలేము. ఏతా వాతా మిగిలిన 90 స్థానాలలో మజ్లిసు, తే దా పా, కాంగ్రెస్, మన నారాయణ పార్టీ, తె రా స, నాగం పార్టీ, భా జ పా, కొత్త ప్రజాస్వామ్యం (న్యూ డెమోక్రసీ) తదితరులు పంచు కోవాల్సి వుంది. 
 
అంతే కానీ తె రా స కి 110/110 వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే, తె దే పా బి సి, ఎస్ సి ఓట్లని గణనీయంగా చీల్చే అవకాశం వుంది. బహుశా ఈ కారణము వలన కూడా తె దే పా తెలంగాణాకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయం తె రా స కు మింగుడుపడడం లేదు. ఎం ఆర్ పి ఎస్ నుంచి తె దే పా కు తెలంగాణలో అందుతున్న సహకారం విస్మరించలేము. ఎన్నికలకు ఇంకా సమయం వున్నది కాబట్టి, చిన్న చిన్న మార్పులు చేర్పులు జరిగే అవకాశం లేకపోలేదు.


దురదృష్టవశాత్తు నాయకుల నీతి అవినీతిల గురించి ఆలోచించడానికి సగటు ఓటరు అంత ఆసక్తి చూపించడంలేదు. బహుశా దేశంలో ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్తితులలో ప్రకాశం పంతులు, లక్ష్మణ్ బాపూజీ వంటి నిజాయితీ పరులొచ్చినా గెలిచే అవకాశాలు తక్కువ. భా జ పా లాంటి కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు తె దే పా లాంటి పార్టీల మద్దతు కేంద్రంలో అవసరం అవుతుంది. ప్రస్తుతం యు పి ఎ లో 2-3 పార్లమెంటు స్థానాలున్న చిన్న చితక పార్టీలకు కూడా మంత్రి వర్గంలో ప్రాధాన్యత వుంది. ప్రస్తుత సంకీర్ణ యుగంలో శాశ్వత మిత్రుడు, శత్రువుని ఊహించడం కష్టం.
 
 
 

3 కామెంట్‌లు :

  1. "రోగి చచ్చినా నేనిచ్చిన మందు ఇంకా పనిచేస్తూనే వుంది -
    కావాలంటే చూడండి విరోచనాలు ఇంకా ఎలా అవుతున్నాయో ..."
    అన్నట్టుంది మీ యవ్వారం.

    ప్రణబ్ ముఖర్జీ కమిటీ .పనిచేసిందే లేదు
    కెసీఆర్ భాషలో దిక్కుమాలిన కాల యాపన కమిటీలలో అదొకటి
    ప్రభుత్వమే దానిని ఉపసంహరించుకుంది
    దానికి ఇచ్చిన లేఖను మాత్రం మేం ఇంకా ఉపసంహరిమ్చుకోలేదంటే ఏమన్నట్టు?
    ఉపసంహరిమ్చుకోనొల్లు డిసెంబర్ 9 ప్రకటన వచ్చినాక ఎందుకు రాజీనామా నాటకాలు ఆడిండ్లు
    ఎందుకు సమైక్యాంధ్ర ఉద్యమం చేసిండ్లు
    ముక్కేక్కడుంది అంటే avaఅష్ట వంకరలు తిరిగి చూపించుదు ఎందుకు
    ఎవర్ని మోసం చేయనీకి ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బందగీ గారు, మీరు మొత్తం విషయం చదవకుండా మధ్యలో ఈ విరొచనాల జోకు చెప్పారు. తె దే పా నాయకత్వానికి సుతరాము రాష్త్రం విడిపోవడం ఇష్టం లేదు. కానీ, తప్పని సరి పరిస్తితులలో ఆ సమావేశానికి హాజరై అంతకుముందు స్పష్టంగా రాసి ఇచ్చిన లేఖ కాపీని జత చేసి ఇచ్చారు. నిజంగా మళ్ళీ కేంద్రం ఇంకోసారి విభజన ప్రకటన చేస్తే, ఏమి చేస్తారు అనేది ఊహా జనితమైన ప్రశ్న. అసలే తీర సీమాంధ్రాలో అంతంత మాత్రంగా వున్న తె దే పా ఈ నిర్ణయంతో పూర్తిగా అంతమైంది. ఇది జగన్ పార్టీకి అయాచితంగా అందివచ్చిన వరం. తెలంగాణా నిజంగా కోరుకొనేవారు, ఈ విషయంలో బాబు ధైర్యాన్ని, తెగువను మెచ్చుకోవాలి. జగన్ పార్టీ ఎంత బలపడితే, తెలంగాణా అంత వెనుకకు పోయినత్లు లెఖ్ఖ.

      సిగ్నల్స్ కేవలం తోట బంగళాల వరకే పరిమితమైతే ఇట్లానే వుంటుంది "యవ్వారం". నాయకులందరూ, ఆ పార్టీ లేదు ఈ పర్టీ లేదు, తెలంగాణా పేరు చెప్పి తమ రాజకీయ పబ్బ్బం గడుపుకుంటున్నారు.


      తొలగించండి
    2. దిక్కుమాలిన వుద్యమాలకు దిక్కుమాలిన లేఖలు, దిక్కుమాలిన కమిటీలు, దిక్కుమాలిన ప్రగల్భాలు, దిక్కుమాలిన డేట్లు. జనవరి 31కంతా వచ్చేస్తుంది, విరోచనాలతో పాటు తెలంగాణ వచ్చేస్తుంది. దిక్కుమాలిన ఏడుపులు మాని వెయిటింగ్ చేయండి. కాకపోతే 2014 జనవరి, తొందరేముంది? దిక్కుమాలిన సెంటిమెంటు డిమాండే కదా.

      తొలగించండి