మన పత్రికలకు ఛానళ్ళకు ఒక జబ్బు వుంది. అదేమిటంటే, మానిన గాయాన్ని రేపడం. పాపం క చ రా గారు ఈ మధ్య అమాకయులైన పిల్లల్ని రెచ్చగొట్టే పనులేమి చేయకుండా తన మానాన తను అతిధి గృహంలో శీతల పానీయాలు సేవిస్తూ సేద తీరుతున్నారు. అంతే , వెంటనే మన చానళ్ళ వాళ్ళు గొట్టాలు పట్టుకెళ్ళి, ఏమండి మీరు ఎందుకు విశ్రాంతి తీసుకుంటున్నారు మళ్ళీ ప్రజల్ని ఎప్పుడు రెచ్చ కొడతారు అని గుచ్చి గుచ్చి అడుగుతారు. అప్పుడెప్పుడో ఇక్షావకులకాలంనాడు పాపం భా జ పా వారు గుడి కడతాం ఒట్లేయండి అని దేబిరిస్తే, వెర్రి బ్లాగుల్లాగా నమ్మి ఓట్లు వేసాము. ఆ విషయం భా జ పా తో సహా దేశం మొత్తం ఆ విషయం మర్చిపోయింది. కానీ చానలు వాళ్ళు మర్చిపోలా. ఏవండి ఈ సారి మీరు ఏమి పడగొట్టి ఏమి కట్టబోతున్నారు తొందరగా సమయం, తారీకు వేదిక చెప్పండి అని ప్రాణం తీస్తారు. ఏవండీ, వీరు గుడి కట్టి అందులో రాముడిని ప్రతిష్టించితేనే మనం రామున్ని పూజిస్తామా, ఏం భద్రాచలంలో రాముడు దేవుడు కాదా? ప్రజలు కట్టిన పన్నులతో భక్త రామదాసు (కంచర్ల గోపన్న)రాములోరి గుడి కట్టిచ్చి తానీష గారి ఆగ్రహానికి గురై జైలు కెళ్ళితే, మన భా జ పా వారి కారణంగా కట్టని గుడి కోసం ఎంతమంది అమాయకులు బలైపోయారో. రాముడు ఎవరి ప్రాణాలని ఫణంగా పెట్టి తనకు గుడి కట్ట మనలేదు. మళ్ళీ భా జ పా వారి నోళ్ళల్లో నోరు పెట్టి (మైకు పెట్టి అని చదువుకోండి) గుడి ఎందుకు కట్ట లేదు మళ్ళీ జనాలని ఎప్పుడు రెచ్చగొడతారు అని ప్రశ్నించవద్దు. ఈ మధ్యనే ఏంటో మౌనంగా ముని లాగా వున్నా మన లగడపాటిని ఒక ఛానల్ ఆయన "తెలంగాణా ఎప్పుడు వస్తుందంటారు" అని గోకాడు. ఇంకేముంది, ఆయన రెచ్చిపోయి ఇంకెక్కడి తెలంగాణా? అని అడిగాడు. అదే విలేఖరి, అదే గొట్టం పట్టుకొని హైదరాబాద్ వచ్చి ఇక్కడ తెలంగాణా ఆయన నోట్లో పెట్టాడు. అంటే ఒక రోజుకు సరిపడా వార్తలు దొరికినై. ఇది ఇట్లా వుంటే, మోహన్ బాబు గారికి వారి కుటుంబ సభ్యులకు పిండ ప్రదానం ఘనంగా జరిపించారు బ్రాహ్మణులు. ఆ వార్త చూపించక పోయినా కొంపలంటుకు పోయింది లేదు. కాని ఆ పిండాలు ఎంత సైజులో వున్నాయి వాటిని ఏ పదార్ధాలతో ఎంత వ్యాసార్ధంలో చేసారో చెప్పి అరంగ ఆరంగా రోజుకు 30 సార్లు చూపెట్టారు. అసలే కోతి , పైపెచ్చు కల్లు తాగింది. పర్యవసానం కేసులు, కోర్టులు, ఆసుపత్రులు, కావాల్సినంత ప్రచారం సినిమాకి.
ఇవన్నీ చూస్తుంటే అహనా పెళ్ళoటలో నూతన్ ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ మధ్య జరిగే సన్నివేశం గుర్తొస్తుంది. నువ్వోకటేసుకుంటే నీను రెండేసుకుంటానని , కోపంతో ఇంట్లో సామాన్లన్నీ పగల కొడతారు. గత కొంత కాలంనుంచి మన రాష్ట్రంలో జరుగుతున్నా తంతు కూడా సరిగ్గా ఇలానే వుంది.
ఈ చానళ్ళ వాళ్ళు ఎవరు కూడా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వున్న అనిశ్చితి వలన ఎంత మంది పిల్లలు మద్రాస్ వెళ్లి డొనేషన్ కట్టి మరీ (మెరిట్ వున్నా కూడా) ఇంజనీరింగ్ కాలేజీల్లో (మన రాష్ట్రంలో కాంపస్ ఎంపికలు తగ్గి) చేరారు? ఎంతమంది తెలంగాణాకి చెందిన ఇంటర్మీడియట్ చదివే పిల్లల్లు తీరాంధ్ర ప్రాంతంలో చదువులకోసం తల్లిదండ్రులకు దూరంగా వుంటున్నారు? ఎందుకు వుంటున్నారు అని ఒక సామాజిక ప్రయోజనాన్ని కలిగించే ఆలోచన రేకెత్తించే కార్యక్రమం చెయ్యరు. కారణం సంపాదనే ప్రధాన ధ్యేయంగా వున్న వార్తా మాధ్యమాలు వాటిని నడుపుతున్న రాజకీయ నాయకులు. త్వరలో కమునిస్తులకు కూడా ఒక చానల్ వస్తోంది. ఒక్క లోక్సత్తాకు టి వి వస్తే మన రాష్ట్రంలో కూడా తమిళుల లాగా ప్రతి పార్టీకి ఒక చానల్ వున్నట్లు అవుతుంది.
కానీ ఒక్క విషయం గమనించారా ? ఎప్పుడో మరుగున పడి పోయిన వివిధ భారతి, ఎఫ్ ఎం రేడియోలు ప్రస్తుతం ఒకింత ప్రజాదరణకి నోచుకుంటున్నై. కారణం టి వి లలో ప్రసారమౌతున్న చెత్త వార్తలు, సంవత్సరాల పాటు జీళ్ళ పాకం లాగా సాగే అత్తా కోడళ్ళ సీరియల్స్. 30 సంవత్సరాల క్రితంలాగా సంక్షిప్త శబ్ద చిత్రాలు, 6.45కి ప్రాంతాల వార్తలు (క్షమించాలి ప్రాంతీయ వార్తలు ) 7 గంటలకు ధిల్లీ నుంచి కంచు కంఠంతో వినిపించే వార్తలు, నాటికలు, హరికథలు ఇత్యాది కార్యక్రమాలు అన్ని రాష్ట్రాలలోని తెలుగువారికి కేవలం వినటానికి మాత్రమె అందుబాటులో వుండే విధంగా రావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ...
కానీ ఒక్క విషయం గమనించారా ? ఎప్పుడో మరుగున పడి పోయిన వివిధ భారతి, ఎఫ్ ఎం రేడియోలు ప్రస్తుతం ఒకింత ప్రజాదరణకి నోచుకుంటున్నై. కారణం టి వి లలో ప్రసారమౌతున్న చెత్త వార్తలు, సంవత్సరాల పాటు జీళ్ళ పాకం లాగా సాగే అత్తా కోడళ్ళ సీరియల్స్. 30 సంవత్సరాల క్రితంలాగా సంక్షిప్త శబ్ద చిత్రాలు, 6.45కి ప్రాంతాల వార్తలు (క్షమించాలి ప్రాంతీయ వార్తలు ) 7 గంటలకు ధిల్లీ నుంచి కంచు కంఠంతో వినిపించే వార్తలు, నాటికలు, హరికథలు ఇత్యాది కార్యక్రమాలు అన్ని రాష్ట్రాలలోని తెలుగువారికి కేవలం వినటానికి మాత్రమె అందుబాటులో వుండే విధంగా రావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ...
"కేవలం వినటానికి మాత్రమె అందుబాటులో వుండే విధంగా రావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ..."
రిప్లయితొలగించండిCorrect ga cheppaaru, drusya kaalushyam nundi oorata untundi.
సాంకేతికంగా దేశం అభివ్రుద్ధి చెందాల్సిందె కానీ దాని వలన వచ్చె దుష్పలితాలు మాత్రం ప్రక్రుతి వినాశనానికి దారితీస్తొంది.
తొలగించండిbaagundi mee maata. naluguroo TV lavEpu udaaSeenam gaa choosE rOju raavaalani kOrukundaaM !! " ati " chinna maaTa . vaartlni " ashyam " puTTe daSaki teesukuni veLtunnaaru eletronic media vaaLLu. raajakeeya naayakula kannaa media vaaLLu inkaa heenam gaa unnaaru.
రిప్లయితొలగించండిబాగా చెప్పారు. రాత్రి 10 గంతల తర్వాత వచ్చే క్రైం సీరియల్స్ చూసి ప్రభావితమై హత్యలు చేసిన వాళ్ళు బోలెడుమంది ఈ దేశంలొ జైళ్ళలో వున్నారు. ఏదైనా పండు పండితే కానీ పక్వానికి రాదు.
తొలగించండిThe last paragraph is quite good and optimistic for Radio Fans.
రిప్లయితొలగించండి