26, డిసెంబర్ 2012, బుధవారం

రాష్ట్రంలో అసమర్ధ పాలన

రౌతు మెత్తనైతే గుర్రం మూడు కాళ్ళ మీద నడుస్తున్దనేది సామెత. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత (ఈయన నిజాయితీ పరుడు ఔనో కాదో అన్న చర్చ వదిలేసి - కేవలం ఆయన సమర్ధత మీద మాత్రమె వ్యాఖ్యానిద్దాము) చిన్న- చితక ; ముసలి-ముతక లీడర్లు తెరమీదకు వచ్చి రెచ్చిపోతున్నారు. ఒక ప్రాంతం వాడు రైలు పట్టాలు పీకి మెళ్ళో వేసుకుంటా అంటాడు, ఇంకొకడు భాగో జాగో , పేడ -పెంట అని అంటాడు.  రాజశేఖర రెడ్డి జీవించి వుండగా కలుగులో  దూరిన వాళ్ళు ఇప్పుడు
హీరోలుగా  వెలుగొందుతున్నారు.      భావ స్వాతంత్ర్యం
హద్దులు దాటుతున్నది.  ప్రాంతాలని విడదీయటం ఒకింత సులభం కానీ మనుషులను విడదీసి తద్వారా  ప్రాంతాలని విడదీయాలి అని అనుకోవడం జరగని పని.
 
 
సి పి ఐ నారాయణ గారిని ఆంద్ర ప్రదేశ్ లో ఎవ్వరు అడ్డుకోరు, అలాగే మన వెంకయ్య నాయుడిని, దత్తన్న ని, కిషన్ రెడ్డి గారిని కూడా. అదే రకమైన భావ ప్రకటనా స్వేచ్చ తెలంగాణలో ఎందుకు లేదు. ఉదాహరణకి జయ ప్రకాష్ రెడ్డి, కొండా సురేఖ, పరకాల ప్రభాకర్ మొదలైన వారు సమైక్య వాదాన్ని వినిపిస్తుంటే వాళ్ళని వ్యతిరేకించవలసిన అవసరం ఏమిటి? దాడులు ప్రతి దాడులతో నష్టం ఎవరికీ? రాజకీయ నాయకులకా? వాళ్ళచే రెచ్చకొట్టబడిన అమాయకులకా? జగన్ వరంగల్లు వస్తే యువకులను రెచ్చగొట్టి రాళ్ళు వేయించారు. జగన్ కు కనీసం జ్వరం కూడా రాలేదు. కానీ ఆ సంఘటనలో దెబ్బలు తిన్న అమాయకులు ఎందఱో వున్నారు. క చ రా కుటుంబానికి కూడా జ్వరం రాలేదు. నిజంగా విడిపోదలచుకుంటే, క చ రా గారు మిగిలిన కుటుంబ సభ్యులు కనీసం 3 నెలల పాటు తీర సీమంధ్రలో పర్యటించి, ప్రజలను సమాయత్తం చెయ్యాలి. ఎవ్వరు ఆయన్ని అడ్డుకోరు.
విడిపోదాము అనుకున్న సముదాయం మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తిగా ఆయన తన అభిప్రాయం కుండ బద్దలు కొట్టినట్లు చెప్పి అక్కడి ప్రజల మద్దతు కోరవచ్చు. తద్వారా ఆయన అనుకున్న లక్ష్యం చేరడానికి ఏంతో కాలం పట్టదు. అవసరం అనుకుంటే, ఒక మెట్టు దిగి ఏకాభిప్రాయం లేని విషయాల మీద మేధో మధనం జరిపి పరిష్కారం కనుగొనడం ద్వారా విజయం సాధించవచ్చు. అంతే గానీ రైలు పట్టాల క్లిప్పులు తీయడం ద్వారా, జాషువా, అన్నమయ్య మొదలైన వారి విగ్రహాలను పడగొట్టడం ద్వారా, కేబుళ్ళు తగల పెట్టడం ద్వారా, ఒకర్ని ఒకరు తిట్టడం ద్వారా ప్రయోజనం శూన్యం.

 
 
నిత్య అశాంతితో కొంత కాలానికి ప్రజలు అలవాటు పడి, రాజకీయ నాయకులను పట్టించుకోని రోజు వస్తుంది. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని లేదు అన్ని ప్రాంతాల వారు, నిజాయితీ పరుడు కాకపోయినా ఫరవా లేదు, సమర్ధుడైన నాయకుడి కోసం చూస్తున్నారు. ఇది ప్రమాదకరమైన పరిస్తితి. అయినా తప్పేటట్లు లేదు.
 

 

7 కామెంట్‌లు :

  1. /**సి పి ఐ నారాయణ గారిని ఆంద్ర ప్రదేశ్ లో ఎవ్వరు అడ్డుకోరు, అలాగే మన వెంకయ్య నాయుడిని, దత్తన్న ని, కిషన్ రెడ్డి గారిని కూడా. అదే రకమైన భావ ప్రకటనా స్వేచ్చ తెలంగాణలో ఎందుకు లేదు. ఉదాహరణకి జయ ప్రకాష్ రెడ్డి, కొండా సురేఖ, పరకాల ప్రభాకర్ మొదలైన వారు సమైక్య వాదాన్ని వినిపిస్తుంటే వాళ్ళని వ్యతిరేకించవలసిన అవసరం ఏమిటి?**/

    ఎందుకంటే అక్కడ ఉద్యమం లేదు కనుక. అదే 71లో జై ఆంధ్రా ఉద్యమం జోరుగా ఉన్నప్పుడు జైఆంధ్రా వ్యతితిరేకులమీద పెద్దయెత్తున దాడులు జరిగయి. అడ్డుకోవడం కాదు, ఇల్లమీదికి వెల్లి మరీ కొట్టారు.

    రిప్లయితొలగించండి
  2. రెండు తప్పులు ఒక రైటు కావు కదా! మీరే, ఇంతకు ముందు చర్చలో జై ఆంధ్ర ఉద్యమం బోగస్ అన్నారు. ఇప్పుదేమో "జొరుగా జరిగిన జై ఆంధ్రా ఉద్యమం" అని అంతున్నారు. వెంకయ్య నాయుడు ఆ ఉద్యమంలో జైలుకు వెళ్ళాడు. అంటే అతను చెప్పేవి బోగస్ విషయాలే కదా! అప్పుడు ఇళ్ళమీదికి జై ఆంధ్ర వాళ్ళు దాడులు చేసారు అన్నారు కాబట్టే విభజన జరగలేదు. ఇప్పుడుకూడా అలాంటి తెలివి తక్కువ కార్యక్రమాలు చేస్తే విభజన జరగదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జై ఆంధ్రా ఉద్యమం బోగస్ ఉద్యమం అన్నది ఆఉద్యమ ఆశయంలో నిజాయితీ లేదు కాబట్టి, అదికేవలం తెలంగాణవాదులకు సుప్రీంకోర్టు చేసిన న్యాయాన్ని అడ్డుకోవడానికి( + భూసంస్కరణలను ఆపడానికి) చేసింది కాబట్టి. ఉద్యమంలో నిజాయితీలేకపోవడం, ఉద్యమం జోరుగా జరగడం రెండు వేర్వేరు అంశాలు. నిజాయితీ లేనివాడికి కూడా మందబలం ఉండొచ్చు.

      తెలంగాణ ఉద్యమంలో నాయకులను అడ్డుకోవడానికి కారణం వారంతా గతంలో తెలంగాణకు అనుకూలంగా మాట్లాడి, ఆబలంతో వోట్లేయించుకుని గెలిచి ఇప్పుడు మాట మారుస్తున్నారు కనుక. జగ్గారెడ్డికి నిజంగా సమైక్యాంధ్ర కావాలంటే రాజీనామా చేసి గెలవమనడి, ఇప్పుడు ఎవడో కుక్కబిస్కెట్లేస్తే మాట మారుస్తే ప్రజలకు అడ్డుకోవడం తప్ప మరో మార్గం లేదు. మాటతప్పిన నాయకులను రికాల్ చేసే అవకాశం ప్రజలకు ఉంటే ఆ అవసరం ఉండదు.

      పరకాల ప్రభాకర్ ఒక జోకర్, నలుగురు మీటింగుకు రాకపోయినా తెలంగాణలో లక్షలమంది మద్దతు ఉందంటడు. పరకాల మీటింగును అడ్డుకోవడానికి కారణం ఆజోకర్ వాదం కాదు, అతగాడి రెచ్చగొట్టుడు మాటలు. మీదగ్గర నారాయణను ఎలా అడ్డుకోరో మాదగ్గర రాఘవులును కూడా అలాగే అడ్డూకోరన్న విషయం మీరు గమనించాలి. కారణం వారు మిగతా టీడీపీ, వైకాప, కాంగ్రేస్ లాగా కాకుండా సమైక్యాంధ్రకు స్పష్టమయిన వైఖరి ప్రకటించారు గనుక.

      మీవ్యాసాలు అన్నీ అర్ధసత్యాలతో, పిక్ అండ్ చూస్ లాజిక్లతో ఉంటున్నాయి. ఉదాహరణకు మీదగ్గర నారాయణను మీదగ్గర నారాయణను అడ్డూకోకపోతే తెలంగాణలో రాఘవులు కూడా అడ్డుకోరన్నది వదిలేశారు. మాదగ్గర పరకాలను అడ్డుకుంటే మీదగ్గర వసంత మీటింగును అడ్డుకున్నారన్నది వదిలేశారు. ఇలా పక్షపాత రాతలు రాయడం వలన లాభం ఏమిటో!!

      తొలగించండి
    2. వెంకయ్య నాయుడు చెప్పేవి నిజాలయితేనేం, అబద్దాలయితేనేం దానితో చర్చకు ఏం సంబంధం? వెంకయ్య నాయుడు చెయ్యబట్టి ఇప్పుడు తెలంగాణ ఉద్యమం నడుస్తుందా? ఆయనేమన్నా నడిపిస్తుండా? ఇలాంటి సంబంధం లేని విషయాలను జొప్పించడం ఎందుకు?

      తొలగించండి
    3. విభజన జరగదు కాని ప్రక్రియ కొనసాగుతుంది. కొనసాగాలి, ఏకాభిప్రాయం వచ్చేదాకా మడమ తిప్పే ప్రసక్తే లేదు.

      "షూర్య చ్చంద్రులు నిలిచ్చే ద్దాకా,
      విరులూ తరులూ నిలిచే ద్దాకా
      మన అనురాగం నిల్లిచ్చేను క్కాదా" అని మహమ్మద్ రఫీ పాడినట్టు. :)

      తొలగించండి
  3. ఏ రాజకీయ పార్టీ ఐనా, తమ లాభ నస్టాలను బేరీజు వేసుకొనే నిర్ణయం తీసుకుంటాయి. గతంలో జరిగిన జై ఆంధ్రా ఉద్యమం బోగస్ అని సర్టిఫై చేసారు. ఆ బోగస్ ఉద్యమంలో జైలుకు వెళ్ళిన వెంకయ్య నాయుడు కూడా బోగస్ మనిషే కదా?

    నేను రాష్ట్రం విడిపొవాలని కొరుకుంటున్నాను. 1964 లోనే విడిపోతె బాగుందేది కదా అని అనుకుంతాను. కానీ భాగొ జాగో అనే వాళ్ళకి ఇష్టం లేదు.

    ఇంకొక సంవత్సరం ఓపిక పట్టండి. సాధారణ ఎన్నికలు వస్తున్నాయి. అప్పుడే మోదీ గారు బాబు గారిని మంచి చేసుకుంటున్నారు. చివరకు మోసపోయెది ప్రజలే, రాజకీయులు కాదు అనే సత్యాన్ని గ్రహించండి. బెదిరింపులతో, అసత్యాలతో విభజన జరగదు. కేవలం జాతి విచ్చిన్నం తప్ప. నా మాటలు మీకు రుచించక పోవచ్చు. కానీ, నిజం నిలకడ మీద తెలుస్తుంది.

    రిప్లయితొలగించండి
  4. "ఉదాహరణకి జయ ప్రకాష్ రెడ్డి, కొండా సురేఖ, పరకాల ప్రభాకర్ మొదలైన వారు సమైక్య వాదాన్ని వినిపిస్తుంటే వాళ్ళని వ్యతిరేకించవలసిన అవసరం ఏమిటి?"

    కొండా సురేఖ ఇడుపులపాయలో జై తెలంగాణా నినాదం చేసింది, ఆమె సమైక్యవాది కాదు.

    ఇటీవలి ఒక్క ప్రకటన మినహాయిస్తే, జగ్గారెడ్డి కూడా సమైక్యవాది కాదు.

    పరకాల ఎన్నికలలో ఎం సి పీ, అనేక సార్లు సీపీఎమ్ సమైక్యవాద నినాదం పై పోటీ చేసారు. వారిని అడ్డుకున్న దాఖలాలు లేవు.

    నిన్నటికి నిన్న కోడెల కాసుల వర్గాలు కొట్టుకోలేదా? ఇదీ అట్లాంటిదే.

    రిప్లయితొలగించండి