రాజకీయాలలో పూర్తి కాలం మిత్రులు లేదా శత్రువులు ఉండరనే నానుడిని నిజం చేస్తూ అనేక ప్రాంతీయ పక్షాలు చేస్తున్న విన్యాసాలు ఈ విషయాన్ని రుజువు చెస్తున్నాయి. 15 సంవత్సరాల నుండి నిరంతరాయంగా కేంద్రంలో అధికార పార్టీతో పాలు పంచుకున్న ద్రా ము క (dmk) కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి మరోసారి రాదేమోనన్న సందేహంతో ఆ పార్టీకి దూరమయ్యింది. గతంలోలాగా 18 పార్లమెంటు స్థానాలను వచ్చే ఎన్నికలలో ద్రా ము క నిలబెట్టుకో లేకపోయినా, పరిస్తితులు కలసి వస్తే, మరోసారి భాజపా తో జతకట్టడానికి కావలసిన ప్రణాళిక ముందుగానే సిద్దం చేసుకుంది. జయలలిత కళ్ళెర్ర చేస్తే, 14 రోజులలోనే అటల్జీ గద్దె దిగాల్సి వచ్చింది. జయ లలితతో సంకీర్ణ రాజకీయం చేయడం చాలా కష్టం. ఆ సంగతి భాజపాకు బాగా తెలుసు.
తమిళ్ నాడులో ఎలాగైతే రెండు పార్టీల పాలన వుందో, ఉత్తర ప్రదేశ్లో కూడా దాదాపు అదే పరిస్తితి. తమిళనాడులో ద్రావిడ రాజకీయాలు మూలమైతే, ఇక్కడ భాజపా వ్యతిరేక రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో ఈ పరిస్తితి కాంగ్రెస్కు లాభసాటి కానుంది. ఇది ఇలా వుండగా, బీహార్లో నితీష్ కుమార్ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం వుంది. మరో పెద్ద రాష్ట్రం బెంగాల్ లో మమతతో తల గోక్కొవడానికి ఎవరు సిద్ధపడతారో వేచి చూడాలి. ఒరిస్సాలో స్థానికంగా బిజు జనతా దళ్కు భాజపాతో వున్న శత్రుత్వం, కాంగ్రెస్కు అవకాశం కావచ్చు. మిగిలింది ఎన్సిపి, తెదేపా, జనతా దళ్ (సెక్యులర్), కజపా, తెరాస, వైఎసార్సిపి పార్టీలు. కేంద్రంలో ప్రస్తుతానికి కేవలం రెండు ప్రధాన కూటములు మాత్రమె ప్రముఖంగా వుండటం తెదేపా మనుగడకు పెద్ద ముప్పు. అటు కాంగ్రెస్కు మద్దతు ఇవ్వలేక, ఇటు భాజపాకు దగ్గర కాలేక తమ ఉనికిన్ కోల్పెయే ప్రమాదం వుంది. తెరాస, వైఎసార్ సిపిలు కేంద్రంలో కాంగ్రెస్ కూటమికి మద్దతునిచ్చినా ఆశ్చర్యపోనవసరం లెదు. భాజపా కూటమి, కాంగ్రెస్ కూటమిలలో ఎవరో ఒకరికి మద్దతు ఇవ్వాల్సి వస్తే, వామ పక్షాలు ఖచ్చితంగా కాంగ్రెస్కు మద్దతు ఇస్తాయనడంలో సందేహం లెదు.
సంకీర్ణ రాజకీయంలో సభ్యులను "మానేజ్" చేయడం కాంగ్రెస్ పార్టీకి తెలిసినంతగా భాజపాకు తెలియక పోవడం కాంగ్రెస్ పార్టీకి కలిసివచ్చే మరో పెద్ద అంశం. కేవలం 10 నెలల వ్యవధిలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలలు కొత్త ఎత్తులకు పొత్తులకు వేదికకానుంది.