5, మార్చి 2014, బుధవారం

రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విలీనం


మేఘాలు చూసి ముంత ఒలకపోసిందిట వెనకటికి ఒకావిడ.   సోనియమ్మ కూడా తెరాసను చూసింది, యుద్ధ విమానంలో బిల్లు పంపించి ఒక ప్రాంత ప్రజలను శత్రువులుగా చూసింది.   నిన్న పండు గారు కొట్టిన దెబ్బకు  దిమ్మతిరిగి మైండు బ్లాంక్ అయింది.  ఫాం హౌస్లో పడుకుంటాడు అని ఎగతాళి చేసిన నాయకులకు ఆయన ఫాంలోకి వస్తే ఏం జరుగుతుందో సినిమా చూపించాడు.  తెలంగాణలో కచరాకు సరిసమానమైన జనాకర్షణ గల కాంగ్రెస్ నాయకుడు లేడు.    కేవలం వాళ్ళ పార్టీ వాళ్ళను మాత్రమే విమర్శించ గల వాళ్ళు, పత్రికలకు టి.వి లకు స్టేట్ మెంట్స్ ఇచ్చే ముసలి ముతక   మాత్రమే కాంగ్రెస్లో వున్నారు. కాస్తో కూస్తో పేరు, చడువు, తెలివితేటలున్న జైపాల్ రెడ్డి గారు తెలంగాణా మొత్తం తిరగడం కష్టం.  అలాగే తీర సీమాన్ధ్రలో కూడా కాంగ్రెస్ కు చెప్పుకోదగ్గ నాయకుడు మిగలలేదు.   చివరకు కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో తెరాసలో,  తీర సీమాంధ్రలో వైకాపాలో కలపాల్సిన పరిస్తితి.   తమిళ్ నాడు, ఆంద్ర, బెంగాల్, బీహార్, యు పి, ఎంపీ,  ధిల్లీ, ఒరిస్సా ---- హతవిధీ,  అన్నింటా మూడో స్థానంలోకి కాంగ్రెస్ దిగజారింది.  ఏ రాష్ట్రంలో కూడా సొంతంగా పోటీ చేసే పరిస్తితే లేదు.  కాంగ్రెస్ను ఆ దేవుడే కాపాడాలి.   

4 కామెంట్‌లు :


  1. కాంగ్రెస్ పోతే పోనీండి.నష్టం ఏమీ లేదు. కాని ఇతర పార్టీలు అధికారం లోకి వచ్చినా పెద్ద మార్పేమీ ఉంటుందనుకోను.

    రిప్లయితొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  3. దేవుళ్ళ లాంటి ప్రజల్ని దయ్యాలుగా మార్చి గుడిని లింగంతో సహా మింగి దేవుడ్నే ముంచడానికి సిధ్ధపడ్డ కాంగ్రెసుని రక్షించి దేవుడు తనకి తనే ముప్పు తెచ్చుకుంటాడా?ఒకసారి ఆల్రెడీ అప్పటి భస్మాసుర 'హస్తం' దెబ్బ తప్పుకున్నాడుగా!అది గుర్తుంటే చెయ్యడు. గుర్తు లేకపోతే మళ్ళీ నారాయణుడే దిక్కు. ఇప్పుడాయన పొజిషనూ సరిగ్గా లేదు. తన గుడికే ముప్పొచ్చేలా ఉంది. యే లాబీయిష్టుని పట్టుకోవాలో చూడమని నారద మహర్షిని పురమాయిస్తే ఆయన పాపం ఆ లాబీయిష్టుల గడపలన్నీ యెక్కీ దిగే పనిలో ఉన్నాడు.ఈయన వల్ల కాకపోతే మళ్ళీ ఆయనే పూనుకోవాలి.

    కాంగ్రెస్ అంటే దేవుళ్ళకే హడల్!ఇక మనమెంత?

    రిప్లయితొలగించండి
  4. ఈ బ్లాగు యజమానికీ వ్యాఖ్యాతలకీ చిన్న విన్నపం. విభజన అనంతరం రెండు ప్రాంతాల్లోనూ జరగాల్సిన పునర్నిర్మానం కోసం కొన్ని ప్రతిపాదనల్తో ఒక కొత్త రాజకీయ చట్రం గురించి కొన్ని వూహలు చేశాను. మీ అభిప్రాయాలు తెలిపేతందుకు ఆహ్వానిస్తున్నాను.
    ఇట్లు
    భవదీయుడు
    http://harikaalam.blogspot.in/2014/03/4.html

    రిప్లయితొలగించండి