ఆమ్ ఆద్మీ అధినేత కేజ్రీవాల్ నిన్న గుజరాత్ ముఖ్యమంత్రి మరియు ప్రధాని అబ్యర్ధి నరేంద్ర మోదీని కలవాలని ప్రయత్నించారు. అపాయింట్మెంట్ దొరక్క వెనకకు వచ్చాడు. ఆయన మోడీని కొన్ని ప్రశ్నలు అడగాలని తలంచారు. ఆ అడిగేదేదో ప్రజల సమక్షంలో ఒక వేదిక మీద ప్రసార మాధ్యమాల నడుమ జరిపితే ప్రజలకు కూడా వాస్తవాలు తెలుస్తాయి కదా. ఆయన అడగాలనుకున్న ప్రశ్నలలో కొన్ని మీ కోసం --
1)450 కోట్ల మత్య శాఖ కుంభకోణంలో శిక్షించబడిన పురుషోత్తం సోలంకిని మీ మంత్రివర్గంలో ఇంకా కాబినెట్ మంత్రిగా ఎందుకు కొనసాగిస్తున్నారు
2)గనుల కుంభకోణానికి సంబంధించి 3 సంవత్సరాల శిక్ష విధింపబడిన బాబు బోఖడియాను (ప్రస్తుతం బెయిలులో వున్నాడు) ఇంకా మీ మంత్రివర్గం నుండి ఎందుకు తొలగించలేదు
3)సౌర శక్తిని ప్రైవేటు వ్యక్తుల నుండి యూనిట్కు 15 రూపాయలు చొప్పున మీ ప్రభుత్వం కొనుగోలు చేస్తుండగా మిగతా రాష్ట్రాల్లో యూనిట్ 8/- కు కొంటున్నారు. దీని వెనుక వున్న రహస్యం ఏమిటి
4)పరిశ్రమల కోసం మీరు చేసిన భూ స్వాధీనంలో రైతులకు నష్ట పరిహారం ఎందుకు తక్కువగా ఇచ్చారు.
5)భూతల స్వర్గంగా మీరు ప్రచారం చేసుకుంటున్నగుజరాతులో 1500 ఖాళీలు గల చిన్న గుమాస్తా ఉద్యోగానికి 13 లక్షల మంది దరఖాస్తు చేసుకున్న మాట వాస్తవం కాదా
7) ఉన్నత విద్యావంతులను మీ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా నియమించి 5,300/- నెల జీతం ఇస్తున్నారు. ఈ జీతంతో కుటుంబం పోషణ వీలవుతుందా.
8) అభివృద్ధి అంటే గుజరాత్ - గుజరాత్ అంటే అభివృద్ధి అనిచేప్పే మీ గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలు దయనీయ స్థితిలో వున్నాయి. గ్రామాల్లో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు లేవు
ప్రశ్నలైతే బాగున్నాయి కానీ జవాబులు దొరుకుతాయా!
Politicians don't answer. They just pose questions to others and make problem to people. They only look at votes and voters are just cash cows for them. The country is a just play gound for them.
రిప్లయితొలగించండికేజ్రీవాల్ అడిగారో లేదో కానీ ఈ ప్రశ్న కూడా అతి ముఖ్యం: ఇతర రాష్ట్రాలతో పోలిస్తే గుజరాతులో విద్యుచ్చక్తి ధర ఎందుకు ఎక్కువ?
రిప్లయితొలగించండిadigaaru anukuntaaa
తొలగించండిhttp://forcenamo.com/gujarati-replies-16-questions-asked-arvind-kejriwal-narendra-modi/
రిప్లయితొలగించండిSamadhaanalu saripoyayemo chudandi.
Janam kanna media Valle ekkuva unde arupula sabha lo kejri chese yaagam soniya ni.... Ingress ni....pappu ni...swiss bank dabbu ni kaapaadatam kosam.
Samaadhaanalu chadavatam marava Mandi.