19, ఫిబ్రవరి 2014, బుధవారం

కొత్త రాష్ట్రంలో తెలుగుకు ప్రాధాన్యత కల్పించండి


రాష్ట్ర విభజన నేపధ్యంలో కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం తెలుగు భాషకు ప్రాముఖ్యం ఇవ్వాలి.   ద్వి భాషా సూత్రం అమలు చేసినా తప్పులేదు.    తీర సీమాన్ధ్ర ప్రాంతంలో, తెలంగాణా రాష్ట్రం లాగా ఉర్దూకు అంత ఆదరణ, ప్రాముఖ్యం లేదు.   కాబట్టి తెలుగును నిర్భందంగా ఏడవ తరగతి వరకు, ఆ తరువాత కనీసం ఒక పాఠ్యాంశంగా చేర్చాలి.   తెలుగు భాషకు ఆయువు పట్టైనా తెలంగాణలో ఉర్దూ భాషకు రాజకీయ పరమైన, భౌగోళిక పరమైన మద్దతు లభించి తెలుగు కొంత నష్టపోయే అవకాశం వుంది.     ఆ రాష్ట్ర జనాభాలో కనీసం 10-12 శాతం మాత్రు భాషగా మాట్లాడే ఉర్దూ భాషకు ప్రాధాన్యం ఇవ్వకపోతే ఆ వర్గం వారు సహించరు.   కాబట్టి, ఆంధ్ర రాష్ట్రంలోనైనా తెలుగు భాషను పరిరక్షించడం ద్వారా మాత్రు భాషకు మేలు చేసినట్లవుతుంది.  


7 కామెంట్‌లు :

  1. Congratulations... but Save Hyderabad.

    Keep below in mind and Save Hyderabad now.


    Modi - Rahul Bhai Bhai. Find my analysis below.

    I guess BJP and Congress(North India parties) want to grab Hyderabad into their hands.

    Reason:
    For past 10 years lot of funds from central govt were pumped into Hyderabad even after knowing that AP is going to be devided. This made me to think that following plot is made by Congress and BJP.

    Plot:
    1: First give Telangana.
    2: Later create a demand to make Hyderabad as second capital of country.
    3: Create Hyderabad as seperate state/UT.
    4: Take over state and dominate by North Indians.
    5: Get grip over south India.

    - A Hyderabadi

    రిప్లయితొలగించండి
  2. తెలంగాణాలోనే దేశంలో అన్ని రాష్ట్రాలలో ప్రతి భాషను గౌరవించాలి. నేను ఫలానా భాష మాట్లాడుతాను కాబట్టి ఫలానా రాష్ట్రంలో నాకు ప్రత్యెక హక్కులు ఉంటాయన్న భావజాలాన్ని సమాధి చేయాలి.

    రిప్లయితొలగించండి
  3. Who is this jihadi hyderabadi..... copy pasted same velom on many pages....... why this jihadi devideing India as North and South...... Telangana people always welcome all people from any corner of country... Andhra people know this very well........ so there is no need to think North and South..... Stop spreading silly thoughts MUlla jIhadee.

    Narsimha .

    రిప్లయితొలగించండి
  4. " తెలంగాణలో ఉర్దూ భాషకు రాజకీయ పరమైన, భౌగోళిక పరమైన మద్దతు లభించి తెలుగు కొంత నష్టపోయే అవకాశం వుంది. "

    మీ వాదన అర్థవంతమైనదే. అలాగే శ్రీగొట్టిముక్కలవారి అభిప్రాయమూ విలువైనదే. దేశంలోని అన్నిభాషలనూ, మనకు అనువుగా మారిన ఇంగ్లీషునూ కూడా చక్కగా గౌరవించవలసినదే.

    కాని తెలుగుభాషను పక్కనబెట్టి ఆలోచించవలసిన అగత్యం లేదు. తెలుగుకు కొత్తరాష్ట్రంలో నిస్సందేహంగా సింహాసనం ఇచ్చితీరాలి. కనీసం ఇక్కడైనా తెలుగుభాషను సరిగా గౌరవించి అభివృధ్ధి చేసుకోవాలి.

    అక్కడికి వచ్చి ఆంధ్రేతరభాషలు మాట్లాడుకోదలచిన వారికి, సందర్భానికి తగినట్లుగా సముచితమైన ప్రతిపత్తి ఉండాలి. దానీ అర్థం. అన్నిభాషలను ఒకే గాటకట్టి తెలుగుడొక్క మాడ్చాలని కాదు.

    తమిళదేశంలో తమిళమాధ్యమంలో చదివిన విద్యార్థులకు మాత్రమే ర్యాంకులు కేటాయిస్తారని చదివాను. ఐతే ర్యాంకు ఆశించకుండా ఇతర మాధ్యమాల్లో చదువుకునే అవకాశమూ వారు కాదనటం లేదు. తమిళభాషకు అగ్రతాంబూలం ఇవ్వటం విషయంలో వారు రాజీపడకపోవటమే ఇక్కడ ముఖ్య సూత్రం.

    మీరు తమిళనాడుకు వెడితే అక్కడ బస్సులమీద ఒక్క తమిళంలో తప్ప వేరే ఏ గుర్తూ కూడా ఉండదు. ఏదెక్కడికి పోతుందో బయటివారికి ఇబ్బందే. అలాగే తమిళంలో సంతకం చేయటంరాని వారికి ఆఫీసుల్లో ప్రవేశమే లేదు - ఇది నా స్వానుభవం అనేక సంవత్సరాల క్రిందటిది! కొంచెం ఇబ్బందే. కాని వారు తమిళాన్ని అద్భుతంగా అభివృధ్ధి చేసుకున్నారు. అది మనం గమనించి తీరాలి. వాళ్ళు చివరకు బస్సు అనేదానికి కూడా ఇంగ్లీషు ఎందుకని తమిళపదం ఒకటి తయారుచేసుకొని వాడుతున్నారు. మెచ్చుకోవాలి వారు తీక్షణమైన నిశ్చయాన్ని.

    సీమాంధ్రులు శషభిషలు వదిలి తెలుగుకు శిఖరాయమానమైన స్థానాన్ని కేటాయించి అమలు చేసి తీరాలి.

    సీమాంధ్రలో ఇంకా ఏదో సమాధిచేయాలి లాంటి మాటలు పట్టించుకోనవసరం లేదు. ఆ మాటలు మాట్లాడేవారికి సమాధానమూ ఇవ్వక్కర్లేదు.

    రిప్లయితొలగించండి
  5. తెలుగేంది భయ్! మనం మాట్లాడేది తెలంగాణం గాదు?

    రిప్లయితొలగించండి
  6. సార్, తెలంగాణము అంటేనే తెలుగు మాట్లాడే ప్రాంతము అని అర్ధం. తెలంగాణం అనే రాష్త్రానికి కూడా తెలుగే మాత్రు భాష

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మాతృభాష మనుషులకు ఉంటుంది. రాష్ట్రాలకు అధికారభాష ఉంటుంది. రెండూ వేరే. రాష్ట్రభాష అంటూ ఏమీ ఉండదు

      An official language has two functions: 1. Used in administration 2. Any individual can submit a representation in that language

      Today Telugu is the official language in all 23 districts while Urdu enjoys the status in 7/10 T-districts, all 4 Seema districts & 2/9 Andhra districts.

      తొలగించండి