2, సెప్టెంబర్ 2013, సోమవారం

తెలుగు నేతలను ఎప్పుడూ లక్ష్య పెట్టని హై కమాండ్


స్వాతంత్ర్యం సిద్ధించక ముందు నుంచి కూడా తెలుగు నేతలు ఉత్తర భారతీయుల చేతిలో అలక్ష్యానికి గురైనవారే. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాడిన స్వర్గీయ టంగుటూరి ప్రకాశం పంతులు గురించి తెలుగు వాళ్ళకి తెలిసినంత,  ఉత్తర భారత దేశంలో చరిత్ర చదివిన వాళ్లకు తెలియదు.   మనకి సంఘ సంస్కర్తగా ఆంగ్లం ధారాళంగా మాట్లాడే రాజా రామ్ మోహన్ రాయ్ గురించి తెలుసు కానీ, ఆయనకన్నా గొప్ప వ్యక్తి లేదా సరి తూగగల స్థాయి వున్న వ్యక్తి కందుకూరి వీరేశలింగం గురించి బయట ప్రపంచానికి తెలియదు.       


రెండు సార్లు చెన్న పట్నం ప్రావిన్స్ కి ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రకాశం పంతులు గారు తన సొంత ఆస్తి ధారపోసి పలు మార్లు జైలుకు వెళ్ళిన నిస్వార్ధ పరుడు.   భారత దేశంలో ఆయన చూడని జైలు లేదు.   సైమన్ వ్యతిరేక పోరాటంలో తమిళ నాయకులు జైలు భయంతో మారుమూల ప్రదేశాలలో ఎవరి కంటా పడకుండా ఉద్యమాలు చేస్తే, ప్రకాశం పంతులు గారు మద్రాస్ నడిబొడ్డున ఉద్యమం చేసి దమ్ముంటే కాల్చుకొండిరా అని బ్రిటిష్ వారికి సవాలు విసిరి  జైలుకు వెళ్ళిన ధీశాలి .   ఈయన పేరిట ఇతర భాషలలో, ముఖ్యంగా హిందీలో ఎక్కడా కనిపించదు. 


1945 ఎన్నికలలో పంతులుగారికి మద్దతుగా 148 మంది,  రాజాజీకి అనుకూలంగా కేవలం 38 మంది శాసన సభ్యులు మాత్రమే మద్దతు ఇస్తూ శాసన సభ్యుల మనోగతాన్ని  హై కమాండుకు తీర్మానం రూపంలో పంపారు.   రెండవ రెండవ సారి ఎలాగైనా రాజాజీని  ముఖ్య మంత్రిగా చెయ్యాలని హై కమాన్డులోని వారి  వియ్యంకుల వారు విశ్వ ప్రయత్నం చేశారు.   నాయకుని ఎంపిక ఆలశ్యం అయితే గవర్నర్ జోక్యం చేసుకుంటారని తెలిసినా, తన స్థాయి నాయకుడైన ప్రకాశాన్ని మాత్రం ఎంపిక చెయ్యకూడదనే మొండి పట్టుదల. తనకున్న యావదాస్తినీ స్వతంత్రం కోసం ధారపోసి పాడి కుండ లాంటి బారిష్టర్ ప్రాక్టీసును తృణప్రాయంగా వదిలేసిన   ఆయన మీదే బురద జల్లే ప్రయత్నం చేశారు.   


జాతీయ స్థాయిలో పిల్లలకు కావలసిన సిలబస్ తయారీ సంస్థలో వారే వుంటారు.    స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళలో దక్షిణ భారత దేశం నుండి ఎవరైనా అసలు వున్నారా అని ఉత్తర భారత దేశంలో చదువుకున్న వాడిని అడిగితే, వాళ్ళు ఒక్క పేరు చెప్పలేరు.   కానీ, మనకు మాత్రం నేతాజీ (అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఈయనపై పోటీ చేసి అత్యల్ప వోట్ల తేడాతో వోడిపోయింది భోగ రాజు పట్టాభి గారు- ఈయన గురించి కూడా పొరుగు వాళ్లకు తెలియదు)   అతి తక్కువ సార్లు జైలుకు వెళ్లిన  జవహర్ లాల్ నెహ్రూ గారు , ఆంగ్లాన్ని తెగ పొగిడే రా.రా.మొ.రా, గోవింద్ వల్లభ పంత్ మాత్రం బాగా తెలుసు.  పైన ఉదహరించిన వాళ్ళ దేశ భక్తిని శంకించాలనేది నా ఉద్దేశం కాదు గానీ, తెలుగు వాడికి రావలసిన గుర్తింపు రాలేదనే నా బాధ.     తెలంగాణా సాయుధ పోరాటంలో పాల్గొన్న వామ పక్షాల గురించి తెలుగు వారి చరిత్ర పుస్తకాలలో లేకుండా భాజపా వారు, కాంగ్రెస్ వారు  జాగ్రత్త పడతారు.   దేశముఖ్లు, దొరలు నైజాము రజాకర్లతో  కలిసి చేసిన దాష్టీకాలను విద్యార్ధులు తెలుసుకోకుండా కాంగ్రెస్ పార్టీ వారు కృషి చేస్తారు. ఎందుకంటే వారికి ఆ వర్గం వారి వోటు బ్యాంకుకు నష్టం వాటిల్లకుండా వుండాలని.     వామ పక్షాలు  నైజాం ప్రజలను చైతన్యం చేసి రజాకర్లను ఎదుర్కుంటే, దాని తాలూకా లబ్ధిని ఫినిషింగ్ టచ్ ఇచ్చిన పటేల్ ఖాతాలోకి భాజపా వారు జమ చేస్తారు (నా ఉద్దేశ్యం పటేల్ గారు అసలు ఏమీ చెయ్యలేదని కాదు, క్షమించాలి).  దక్షిణాదికి చెందిన పి వి గారు ప్రధాని అయితే వోర్వలేని ఉత్తర భారతానికి చెందిన కేసరి, అర్జున్ సింగ్, మరియు  తమిళ మానిల కాంగ్రెస్  నాయకులు  చేసిన విన్యాసాలు అంతా ఇంతా కాదు.   చివరికి హై కమాండు పి వి గారి పార్ధివ శరీరాన్ని కూడా  అగౌరవ పరచింది.   ఆనాటి ముఖ్యమంత్రి అంజయ్య గారు రాజీవ్ గాంధీని రిసీవ్ చేసుకోవడానికి బేగంపేట్ విమానాశ్రయానికి వెళితే ఆయనను ఘోరంగా అవమానించాడు . అప్పటికి రాజీవ్ ప్రధాని కూడా కాదు.       


ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుండీ హై కమాన్డులో పెత్తనం ఉత్తరాది వారిదే.   వారి మనసులో వున్నది మాత్రమే చేసే మనస్తత్వం వారిది.  శివుడ్ని ప్రత్యక్షం చేసుకోవడానికి కఠోర దీక్ష చేసి పేగులు తెంచి వీణ వాయించిన  రావణాసురుడు వీళ్ళ పట్టుదల ముందు దిగదుడుపే. ఒక్కటే తేడా - రావణా బ్రహ్మ తన పేగులు తెంచి వీణ వాయిస్తే, మన మంత్రసాని మాత్రం తెలుగు వాడి పేగులు చీల్చి ఫిడేలు వాయిస్తున్నది. 


ప్రస్తుతం మన రాష్ట్రంలో నడుస్తున్న గందరగోళానికి కూడా వారికి వారసత్వం వలన వచ్చిన  రాజకీయాలు, పిడి వాదనలు, తాబట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే మనస్తత్వం.   రాష్ట్రం విభజన జరిగినా, ఒకటిగా వున్నా అంతిమంగా తెలుగు వాడి కీర్తి మాత్రం నిస్సందేహంగా మసకబారింది.  42 మంది ఎంపీలతో, ఉత్తర ప్రదేశ్ తరువాత అతి పెద్ద సంఖ్య వున్న ఆంద్ర ప్రదేశ్ విభజన మనకెంత లాభమో తెలియదు కానీ, తమిళుల ఆధిపత్యం పెరిగే ప్రమాదం మాత్రం వుంది.   ఒకప్పుడు తెలుగు వాళ్ళని విభజించు పాలించు అనే రాజాజీ గారి సూత్రాన్ని ప్రస్తుత తమిళ నాయకులు కూడా హై కమాండు మద్దతుతో  కొనసాగిస్తున్నారు.   ఇదే హై కమాండు వారి 'చిదంబర' రహస్యం.     

14 కామెంట్‌లు :

  1. బాగా సెలవిచ్చారు ....

    తెలంగాణా ఆత్మ ఘోష కూడా ఇదే కదా.
    తెలంగాణా నేతలను ఆంధ్ర నేతలు ఎప్పుడూ లక్ష్య పెట్టలేదు.

    పి వి నరసింహారావు మైనారిటీ ప్రభుత్వ ప్రధాన మంత్రిగా యావత్ దేశాన్ని ఐదేళ్ళు నిరాటంకంగా ఏల గలిగాడు
    కానీ
    తెలుగు రాష్ట్రాన్ని ముఖ్య మంత్రి గా రెండేళ్ళు పరిపాలించలేకపోయాడు
    అంజయ్య దీ , చెన్నారెడ్డి దీ అదే పరిస్థ్తితి కదా.

    ఆంధ్ర నేతల విగ్రహాలు తెలంగాణాలో విచ్చల విడిగా కనిపిస్తాయి
    కానీ తెలంగాణా నేతల విగ్రహాలు ఆంధ్రలో కనిపించవు.
    తెలంగాణా వాళ్ళు తెలంగాణా నేల మీదే
    ద్వితీయ శ్రేణి పౌరులు గా
    ఆంధ్ర పాలకుల దయా దాక్షిన్యాల మీద ఆధారపడి బతకాల్సి వచ్చింది.
    అందుకే వాళ్ళు డీ మెర్జర్ (విలీనం రద్దు) కోరుకుంటున్నారు.
    Jai Telangana !

    రిప్లయితొలగించండి
  2. మీరు పప్పులో కాలేసినందుకు చింతిస్తున్నాను. అంజయ్యను బేగంపేట విమాన్శ్రయంలో దూషించినది మన మంత్రసాని గారి భర్తే అన్న సంగతి మర్చిపోయారు. పి వి నరశిమ్హారావు గారి మీద మీకు ఇప్పుడు ప్రేమ వచ్చింది, ఆశ్చర్యం. హనుమకొండలో వోడించింది భాజపా అభ్యర్ధి. ఆ తరువాత ఎన్నికలలో నంద్యాల నుంచి మీరు చెప్పే "ఆంద్రొళ్ళు" భాజపా బంగారం మీద గెలిపించారు. పి వి నరశిమ్హారావు గారి మీద మీకు కారిపోతున్న ప్రేమలో సగం కూడా మన మంత్రసానికి లేదు. ఆయన శవాన్ని కూడా దర్శించదానికి ఇష్టపడని పగ ప్రతీకారాలకు ఆవిడ పెట్టింది పేరు. పి వి లాంటి రాజనీతుఙ్దుని, వరంగల్ గల్లీ స్థాయికి దిగజార్చకండి. పి వి తెలుగు వాళ్ళకే కాదు, యావద్దేశానికి ఆదర్శప్రాయుడు. ఆయన విగ్రహం పెట్టాల్సింది పార్లమెంటులో. హైదరాబాదు అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టాలి. విగ్రహాలెందుకులెండి, కోపంవచ్చినప్పుడు పదగొట్టడానికా? హరి భక్తుడు అన్నమయ్యనీ, పిరదౌసి గ్రంధకర్త జాషువానే మీరు మురికి నీళ్ళలో ముంచారు.

    రిప్లయితొలగించండి
  3. With due respect you are over reacting. You may not like Rajaji but you can't deny he was no language fanatic. His contribution to Hindi is commendable.

    Both Rajaji & Prakasam faced opposition from their own people. Rajaji teamed with Kala Venkatarao while Prakasam & Kamaraj formed the other group. This is normal Congress internal groupism, nothing to do with language.

    Kesari, Arjun Singh et al did not oppose PV Narasimharao because he is a Telugu. They did so because they wanted the throne for themselves.

    Chidambaram's role in T-formation is not decisive. Others also played the role.

    It is best to come out of the Tamil-Telugu conundrum.

    రిప్లయితొలగించండి
  4. there are many incidents in the history, how he has misused his relationship with gandhiji. of course he used kalaa venkat rao, sooryanaaraayana etc to settle score with prakasam. he was not bothered to keep a wreth on the body of sri potti sreeraamulu similar to how sonia did to sri p.v rajaaji was more generous and supportive than gandhiji for separation of pakistan even before we getting independenc. i do not know the basis for your certification that rajaji was not a language fanatic. yes, he has promoted hindi thru hindi prachar sabhas though no Tamilian was interested in it. this can be seen as his strategy to get political favours from North leaders who are controlling congress. chidambaram has written in his book about division of state,but it should not be applicable to his state - nip it in the bud. AP politicians has created so much differences amongst fellow telugu people across the country, which is highly condemnable. i appreciate some of your comments (it really appears to me that you have studied history well) but in the name of geographical separation, hurling abuses on fellow telugu people, should be condemned seriously.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Chandrashekhar, I think you are not interpreting "nip it in the bud" correctly. For instance Telangana movement could have been "nipped in the bud" by answering genuine concerns in jobs, revenues & waters.

      Hurling abuses at anyone is wrong, whether he is "fellow Telugu" or "fellow Telugu". The main problem with Andhras is that they think the latter is serious but indulge in the former themselves.

      I am not really concerned about Andhra people's prejudices. We should be out of it soon. Andhras need to learn from history in order to turn around. I am not convinced if this will actually happen.

      తొలగించండి
    2. జై గారు, మీరు చెప్పిన నీళ్ళు, ఉద్యొగాలు, అబివ్రుద్ధి అనే విషయంలొ వున్న నిజాల్ని జస్టిస్ శ్రీ క్రిష్ణ కమిటీ బట్ట బయలు చేసింది. అక్కడ నుంచి మొదలైంది ఆత్మ గౌరవ నినాదం. ఏది ఏమైనా, ఇంత పెద్ద సమస్య పరిష్కారంలో ఒక జాతీయ ధ్రుక్పధం కొరవడింది అన్నది నిర్వివాదాంశం. ఉత్తర ప్రదేష్ విభజనలో, ఇప్పటికే ఆమోదించబడిన విదర్భ శాసన సభ తీర్మానం విషయంలో భాజపా, కాంగ్రెస్ ల ద్వంద వైఖరి, జాతీయ విధానం పెద్ద పార్టీలకు లేక పోవడం విచారకరం.

      తొలగించండి
    3. I am running a series of blog posts on water matters. The truth will come out at the end of the series.

      Do you want UP should be divided? I agree: let us fight for it.

      తొలగించండి
    4. we donot need to fight for UP or AP. Both Congress and BJP should evolve a policy on creation of new states. if BJP supports creation of smaller states, why they do not support UP and vidarbha?? just wait and see how BJP will behave on Telangana in the next session of parliament.

      తొలగించండి
  5. శ్రీ పి.వి. నరసింహారావు గారి విగ్రహం మొట్టమొదటిగా పెట్టింది తెనాలి లో గమనించగలరు.

    రిప్లయితొలగించండి
  6. Now Telabans are very much in love with Rajaji , Chidambaram et al. They will soon erect their statues all over Telangana. Also, they will have Sonia telangana and sonia as their telangana talli.

    sreerama

    రిప్లయితొలగించండి
  7. జై గారూ,
    With due respect you are over reacting అని చాలా నైసుగా మొదలెట్టారు గానీ మీరు టచ్ చేసిన వీషయంలో మాత్రం గురికి నూరామడల దూరానికి వెళ్ళారు. ఆంధ్ర తెలంగాణా అని కాకుండా మొత్తం తెలుగు వాళ్ళకే ఢిల్లీలో ఫికరు లేదురా మొర్రోఎ అంటుంటే రాజాజీ వెంకట్రావు తో కల్సాడు, ప్రకాశం కామరాజ్ తో కల్సాడు అంటారేమిటండీ బాబూ?

    ఆంధ్ర ప్రాంతం వాళ్ళు దేని గురించి మాట్లాడినా - తెలంగాణా ఆత్మ ఘోష కూడా ఇదే కదా -అనే విధంగా సెటైర్లు ఇవ్వడం, అప్పుడు రాష్త్రాణ్ణి విడగొట్టటానికి వాడిన పాత కవితల్ని ఇప్పటి తెలంగాణా కి అన్వయించటం చూస్టుంటే చాలా తిక్కగా అనిపిస్తుంది.

    మీరు చెప్పిన నీళ్ళు, ఉద్యొగాలు, అబివ్రుద్ధి అనే విషయంలొ వున్న నిజాల్ని జస్టిస్ శ్రీ క్రిష్ణ కమిటీ బట్ట బయలు చేసింది. అక్కడ నుంచి మొదలైంది ఆత్మ గౌరవ నినాదం - అని వృత్తాంతి గారన్నారే ఆ ఆత్మగౌరం యేమీ లేని గర్వంగా చెప్పుకోదానికి వీల్లేని పధ్ధతి మీరు ఇప్పుడు తెలంగాణాని సాఢించుకోవటం.

    యెలాగో చెప్పనా, మీతో చేసుకున్న పెద్దమనుషుల ఒపందాన్ని బుట్ట దాఖలా చేసిందీ అన్నేళ్ళు మీకు నీళ్ళో ఉద్యొగాలూ లేకుందా చేసిందె అవిచ్చిన్నంగా యాభయ్యేళ్ళు రాష్త్రాన్ని యేలేసిన కాంగ్రెసే.మొన్నటికి మొన్న మీకు నయా పైసా కూడా విదల్చమన్నదీ ఆ కాంగ్రెసు పార్టీ వాడే. అయినా కాంగ్రెసుని తప్ప మిగతా అందర్నీ బండ బూతులు తిట్టారు. "ఆంధ్రొళ్ళు" అని గుండుగుత్తంగా అనకుందా "కాంగ్రెసోళ్ళు" అని ఉబ్తే యదార్ధంగా ఉండేది. డైరెచ్టుగా తిట్టటానికి నోరు రాకపోవతానికి కారణం చెప్పనా? కాంగ్రెసు సాయం తోనే అదీ అసెంబీలో బిల్లు పెట్టటం ద్వరా కాకుండా పార్లమెంటులో బిల్లు పెట్టటం ద్వారానే రాష్ట్రాన్ని సాధించుకోవాలనె మొదటి నుంచీ కచరా దగ్గర్నించీ మీ వరకూ ప్లానేసుకుని ఉన్నారు గనక. ఇంతకీ ఆహా ఒహో బలం పెరిగి పోతుందనుకున్నప్పుడే తెలంగాణా ఓటర్లు యెన్ని సార్లు టెంకి జెల్లలు తినిపించారో లెక్కలతో సహా సాక్ష్యాలు ఉన్నాయి గదా! లెక్కలు ఉటంకిస్తూ రెచ్చిపోవటం మీ స్పెషాలిటీ గదా.

    ఫైనల్గా మీకు దారుణమైన అన్యాయం చెసిన చెస్తూ ఉన్న వాడితో రహస్య ఒప్పందాలతో ప్రకటన వరకూ డేకగలిగారు. ఆ ప పెద్దమైనిషి రాష్త్రం విదగొట్టి రాష్త్రం విదగొట్టి ఇస్తే తెరాస ని కాంగ్రెసు లో కలిపేస్తానని కచరా మాట ఇవ్వదం వల్లనే నని బాహాటంగానే చెప్పాడు గదా. బయటకి చెప్పుకోలేని మతలబులు ఇంకెన్ని ఉన్నాయో?
    అంతగా శత్రువుని బతిమలాడుకుని సాధించిన దానిలో గర్వించేందుకేమి ఉంది?



    రిప్లయితొలగించండి
  8. జై గారూ,
    మీతో చేసుకున్న పెద్దమనుషుల ఒపందాన్ని బుట్ట దాఖలా చేసిందీ అన్నేళ్ళు మీకు నీళ్ళో ఉద్యొగాలూ లేకుందా చేసిందె అవిచ్చిన్నంగా యాభయ్యేళ్ళు రాష్త్రాన్ని యేలేసిన కాంగ్రెసే.మొన్నటికి మొన్న మీకు నయా పైసా కూడా విదల్చమన్నదీ ఆ కాంగ్రెసు పార్టీ వాడే. అయినా కాంగ్రెసుని తప్ప మిగతా అందర్నీ బండ బూతులు తిట్టారు. "ఆంధ్రొళ్ళు" అని గుండుగుత్తంగా అనకుందా "కాంగ్రెసోళ్ళు" అని ఉబ్తే యదార్ధంగా ఉండేది. డైరెచ్టుగా తిట్టటానికి నోరు రాకపోవతానికి కారణం చెప్పనా? కాంగ్రెసు సాయం తోనే అదీ అసెంబీలో బిల్లు పెట్టటం ద్వరా కాకుండా పార్లమెంటులో బిల్లు పెట్టటం ద్వారానే రాష్ట్రాన్ని సాధించుకోవాలనె మొదటి నుంచీ కచరా దగ్గర్నించీ మీ వరకూ ప్లానేసుకుని ఉన్నారు గనక. ఇంతకీ ఆహా ఒహో బలం పెరిగి పోతుందనుకున్నప్పుడే తెలంగాణా ఓటర్లు యెన్ని సార్లు టెంకి జెల్లలు తినిపించారో లెక్కలతో సహా సాక్ష్యాలు ఉన్నాయి గదా! లెక్కలు ఉటంకిస్తూ రెచ్చిపోవటం మీ స్పెషాలిటీ గదా.

    ఫైనల్గా మీకు దారుణమైన అన్యాయం చెసిన చెస్తూ ఉన్న వాడితో రహస్య ఒప్పందాలతో ప్రకటన వరకూ డేకగలిగారు. ఆ ప పెద్దమైనిషి రాష్త్రం విదగొట్టి రాష్త్రం విదగొట్టి ఇస్తే తెరాస ని కాంగ్రెసు లో కలిపేస్తానని కచరా మాట ఇవ్వదం వల్లనే నని బాహాటంగానే చెప్పాడు గదా. బయటకి చెప్పుకోలేని మతలబులు ఇంకెన్ని ఉన్నాయో?
    అంతగా శత్రువుని బతిమలాడుకుని సాధించిన దానిలో గర్వించేందుకేమి ఉంది?

    రిప్లయితొలగించండి