1, ఆగస్టు 2013, గురువారం

అట్టుడుకుతున్న రాయలసీమ


విభజన కొందరికి ఖేదాన్ని మిగిలిస్తే, కొదరికి తీవ్ర మోదాన్ని మిగిల్చింది.   అత్యంత వెనుకబడిన రాయలసీమ లోని కొన్ని ప్రాంతాలు తీవ్రంగా నష్టపోతున్నాయి.    రాజస్థాన్ ఎడారి తరువాత అత్యల్ప వర్షాభావ ప్రాంతంగా అనంతపురం గుర్తింపబడింది.    కనీసం రెండు జిల్లాలతో కూడిన రాయల తెలంగాణాగా విభాజించినట్లయితే,  కొంత మేర వారికి మేలు జరిగి వుండేది. అదనంగా నీళ్ళు రాకపోయినా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికేవి.  


కర్నూల్ రాజధానికి తీర ప్రాంత వాసులు ఒప్పుకోరు.   కారణం, శ్రీకాకుళం నుంచి వున్న తీర ప్రాంతానికి పాలనా పరంగా అనుకూలత వుండదు.   రాయలసీమ వాసులు అడుగుతున్న నెల్లూరు, ప్రకాశం (3 రెవిన్యూ డివిజన్లు) తో కూడిన రాష్ట్రానికి నెల్లూరు వాసులు అంగీకరించరు.   కేవలం నాలుగు జిల్లాలతో కూడిన రాయలసీమ మనుగడ సాగించడం కష్టం.    ఇలాంటి నాలుగు జిల్లాల రాయలసీమ డిమాండ్కు కాదనే హక్కు తీర ప్రాంత వాసులకు కూడా లేదు.     ఏదో రకంగా సర్దిచెప్పుకొని 13 జిల్లాల ఆంద్ర ప్రదేశ్ ఆవిర్భవించినా, భావిష్యతులో రాయలసీమ డిమాండ్ తెరమీదకు రాదన్న నమ్మకం లేదు.  


చట్టబద్ధమైన విభజనకు (పార్లమెంటులో బిల్లు పెట్టే ముందరే) ముందే ఈ విషయాన్ని మదింపు చేయకుంటే, భవిష్యతులో తమ రాజకీయ అవసరాల కోసమో, పదవి కోసమో ఉద్రేకాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయవచ్చు.   నిన్న ఆంద్ర జ్యోతి వ్యాసంలో గౌరవ పార్లమెంటు సభ్యుడు రాసినట్లు, మీ పుల్లట్లు మాకు రుచి చూపించ లేదు, మా బోనాలు మీరు ఎత్తుకోలేదు. కాబట్టే రాష్ట్రం కావాలన్నామని చెప్పారు. రాబోయే రోజులలో రాయలసీమ నాయకులు నిందించవచ్చు - మా ప్రాంతంతో మీరు మమైకం కాలేక పోయారు.    మా ప్రాంతంలోని దేవర కద్రలో పెద్ద పండుగ జరుగుతుంది, దేవుళ్ళని ఒక వూరి నుండి ఇంకొక వూరికి తీసుకొనే ప్రయత్నంలో రక్తం చిన్దిస్తాము, తీర ప్రాంత వాసులు ఎన్నిసార్లు ఇందులో పాల్గొని రక్తం చిందిచారు? అని అడగవచ్చు.   లేదా మేము రాగి ముద్ద, ఉల్లిపాయ ఖారం తింటాము, మీరు ఎప్పుడైనా తిన్నారా, మీ జల పుష్పాలు మాకు ఎప్పుడూ పెట్ట లేదు,   కాబట్టి మాది మాకు కావాలి, అవసరమైతే మా బిడ్డలు (సొంత పిల్లలు కాదని మనవి) ఆత్మబలిదానాలకు సిద్ధంగా వున్నారు అని రెచ్చగొట్టే ప్రమాదం వుంది.  


సమైక్యం కాని పక్షంలో, రాయల తెలంగాణా ప్రతిపాదన బహుశా తెలంగాణా, తీర, సీమంధ్రులలో మెజారిటీ ప్రజలు ఒప్పుకొని వుండే వారు.   విభజన ప్రకటనకు ముందు,  రాజకీయేతర క్షాలకు చెందిన అన్ని ప్రాంత  మేధావులతో  కేంద్రం చర్చించి వుంటే, భవిష్యత్ తరాల తెలుగు వాడికి ఇబ్బంది వుండేది కాదు.   తెలుగు జాతిలో పుట్టిన ఈ ముసలానికి శాశ్వత పరిష్కారం కష్టమే!

2 కామెంట్‌లు :

  1. అన్ని జిల్లాలను రాష్ట్రాలుగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకోవటమే తగిన పరిష్కారం!

    రిప్లయితొలగించండి
  2. "కర్నూల్ రాజధానికి తీర ప్రాంత వాసులు ఒప్పుకోరు"

    శ్రీబాగ్ ఒడంబడిక మర్చిపోయారా చంద్రశేఖర్ గారూ?

    "తెలుగు జాతిలో పుట్టిన ఈ ముసలానికి శాశ్వత పరిష్కారం కష్టమే!"

    మాకు అనవసరం, అప్రస్తుతం కూడా. భాష పేరుతొ జరిగిన రాజకీయ కుతంత్రాల మానుకోవడం అందరికీ శ్రేయస్కరం.

    సీమ అల్లుడిగా నాకు వారి బాధ అర్ధం అవుతుంది. ఎప్పటికయినా భాషా దురహంకారాన్ని విడిచిపెట్టి సీమ తన ప్రయోజనాలను సాదించుకోగలదని నా ప్రగాడ విశ్వాసం.

    రిప్లయితొలగించండి