31, జులై 2013, బుధవారం

ఆంద్ర ప్రజలు అప్రమత్తంగా వుండాలి


నష్టం జరిగిపోయింది.   దీనిని దిగమింగుకోవడానికి కనీసం రెండు దశాబ్దాలు పట్టవచ్చు.    ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు అన్ని పార్టీలు ఈ చారిత్రాత్మక తప్పిదంలో భాగస్వాములే.   ఈ నిర్ణయం వెనుకకు తీసుకోవడం అసాధ్యం.  


తెలంగాణా ప్రజలు నాయకులను ఆటాడిస్తే, ఆంధ్రా నాయకులు ప్రజలను మభ్య పెట్టారు.   విచిత్రమేమిటంటే, ఇప్పటికీ, లగడపాటి వారు రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని సెలవిస్తున్నారు.   రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి కిరణ్ కుమార్ రెడ్డి చాలా తీవ్ర ప్రయత్నం చేసినట్లు కనిపిస్తుంది.   ఇది అభినందించతగిన విషయం.  కేంద్రం నిర్ణయం తీసుకోదలచుకుంటే, ఆయన రాజీనామా చేసినా ఫలితం లేదు.     మోసపోయిన ప్రజలు, ఆవేశంలో ఆస్తులు ధ్వంసం చేసుకోవడం తగదు.   కనీసం కేంద్ర ప్రభుత్వానికి విధేయత చూపిస్తూ, నష్టపోయిన ప్రజలుగా ఎక్కువ మొత్తం నిధులకోసం, జల పంపిణీలో దిగువన వున్న రాష్ట్రాల హక్కుల  కోసం, కేంద్ర ప్రభుత్వ పరిశ్రమల కోసం, కేంద్ర ఉన్నత విద్యా సంస్థల కోసం శ్రమించాలి.    
  

హైదరాబాదుపై  దృష్టి సారించి  అభివృద్ధి కేంద్రీకరణ జరిపిన పాలకులలో చంద్ర బాబు ముఖ్యుడు.   ఒక పెద్ద స్టేడియం కట్టినా, సమావేశ మందిరం కట్టినా అది హైదరాబాద్ లోనే కట్టారు.     తీర సీమాంధ్ర ప్రాంతంలో కనీసం కబడ్డీ ఆడుకొనే మైదానం కూడా నిర్మించ లేదు.   ఇది పాలకుల అనాలోచిత చర్య.     రాబోయే రాష్ట్రంలో అలా జరగకూడదు.   పరిపాలన వికేంద్రీకరణ జరిగాలి.  ఉన్నత న్యాయ స్థానం ఒకచోట వుంటే, దాని బెంచ్ ఇంకొక జిల్లాలో వుండాలి.  ఈ రకమైన వికేంద్రీకరణ వలన మరో విభజనకు తావులేదు.   


రాయలసీమలోని ఒక వర్గం వారు తీర సీమంధ్ర వాసులని దూషించడం మొదలు పెట్టారు.   కారణం, వాళ్లకు కూడా ప్రత్యెక రాష్ట్రం వస్తే, ఒక ముఖ్యమంత్రి మరియు ఇతర మంత్రి పదవులు వస్తాయని.   కానీ 4 జిల్లాలతో కూడిన రాష్ట్రం ఏ రకంగా చూసినా నిలబడ లేదు.   ఈ విషయాన్ని నాయకులు తక్షణం చర్చించుకోవాలి.  లేదంటే మరో 610 జీ వో అని, మాది మాకు కావాలని అనవచ్చు.  లేదా   ఈ సారి రాహుల్ గాంధీ కొడుకో, కూతురో అధికారంలోకి రావడానికి లేదా వెంకయ్య నాయుడు మనమరాలు మంత్రి కావడానికో, నారాయణ లాంటి వారు ఒక గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు అయ్యేందుకో  మరో విభజనను ప్రోత్సహిస్తారు.   


విభజనను సాకుగా చూపించి జగన్ పార్టీని గెలిపిస్తే,  ఆంధ్రుల పరువు బజారున పడటం ఖాయం.   అసలే క్రైస్తవం అధికంగా వున్న తీర సీమాంధ్ర ప్రాంతంలో, జగన్ పార్టీ అధికారంలోకి వస్తే, బలవంతపు మత మార్పిడులు జరిగే ప్రమాదం వుంది. ఉప ఎన్నికలలో గంప గుత్తగా ఆ పార్టీ వాళ్ళను గెలిపించడం వలననే, రాజకీయ పరమైన విభజనకు కారణమైంది.  దీనిని సాకుగా తీసుకొని భాజపా బలపడే ప్రమాదం కూడా వుంది.    హిందువులు ముస్లింల మధ్య వున్న ప్రేమ కొనసాగాలి.   


ఆంధ్ర రాష్ట్రానికి రాబోయే ముఖ్యమంత్రిగా విద్యాధికుడు, అవసరమైతే సొంత ఆస్తిని కూడా దానం చేయగలిగి మరో ప్రకాశం పంతులు వారసుడు రావాలి.        




6 కామెంట్‌లు :

  1. tana sonta aastini koodaa daanam cheyagaligin maro prakaasham pantulu vaarasudu ee rojullo andhrakoo dorakadu telangaanaakoo dorakadu!

    రిప్లయితొలగించండి
  2. రాయలసీమ విదిపోదలచుకుంటే అదేదో‌తక్షణం తేల్చేయాలి.
    తరువాత ఏ‌షరతులూ అసంతృప్తులూ పరిగణించబడవు.
    మళ్ళా కర్లూలుని రాజధాని చేసి దాని నెత్తిన అరవైవేలకోట్లు పోసి పదేళ్ళో పాతికేళ్ళే అందరూ‌ మన రాజధాని అనుకున్నాక అది మరొక హైదరాబాదు కావటానికి చస్తే అంగీకరించరాదు. మళ్ళా సీమవాళ్ళ నిందాలాపాలు వినే ఓపికా ఎవరికీ‌ఉండదు కాక ఉండదు.
    ఈ సారి ఏ‌ పెద్దమనుషుల ఒప్పందమూ మొద్దుమనుషుల ఒప్పందమూ అంటూ‌ డ్రామాలు నడవనీయకూడదు.
    రాయలసీమ పోయేదే అయితే ఇప్పుడే పోవచ్చును నిరభ్యంతరంగా.
    అందరూ మీ‌మీ అభిప్రాయాలు రాయండి ఈ విషయమై.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవే మాటలు వారూ అనొచ్చు కదండీ. మచ్చుకు కొన్ని ఉదాహరణలు: "శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కృష్ణ, తుంగభద్రా & పెన్నా జలాల విషయంలో సీమకు ప్రేఫరెన్ ఇస్తామని ఒప్పుకున్నా అది జరగలేదు. కర్నూల్ రాజధానిగా ఉన్న కొద్ది పాటి సమయంలో కూడా రంగా/గౌతు గార్లు & కమ్యూనిస్టులు ఎంత సేపటికీ రాజధానిని బెజవాడకు మార్చాలని గొడవ పెట్టారు తప్ప కర్నూల్ అభివృద్ధి చేయలేదు".

      సీమ భావి తరాలు వారందరికీ ప్రజాస్వామ్య హక్కు ఉండకూదదనడం ఎంతవరకు సమంజసం?

      పెద్దమనషుల ఒప్పందాన్ని వెక్కిరించడం మీ తాహతుకు తగునా?

      తొలగించండి
    2. "జల పంపిణీలో దిగువన వున్న రాష్ట్రాల హక్కుల"

      అవేమిటో కాస్త విపులంగా చెప్పండి, థాంక్స్.

      తొలగించండి
  3. kaneesam ippatiki ayina telugu prajalu telivi techukuni swartha rajakeeyanayakulaki kakunda JP lanti nijayithi kaligina nayakulaki adhikaram kattabedithe baguntundi.

    రిప్లయితొలగించండి