28, జనవరి 2013, సోమవారం

రాష్ట్రాల వేర్పాటుపై ఉండవల్లి ఉటంకించిన అద్వాని గారి మాటలివే


ఉత్తర భారతంలోని మూడు రాష్ట్రాలు క్రొత్తగా వేర్పాటు చేసినపుడు, అప్పటి గృహశాఖామాత్యులు  అద్వాని గారిని పార్లమెంటులో విదర్భ వేర్పాటు గురించి అడిగిన ప్రశ్నకు  ఆయన ఇచ్చిన సమాధానం చూడండి --  

THE MINISTER OF HOME AFFAIRS (SHRI L.K. ADVANI)replying to the Debate, said: In 1953-54 a States Reorganization Commission was constituted and the Indian States were reorganized on linguistic basis. It will be in the fitness of things if another States Reorganization Commission is constituted today. There have been different demands from different States as well as from different regions. The people of Vidarbha raised a particular demand which is opposed by the people of rest of Maharashtra. We have taken the line that we can accede to a demand raised from a particular region only if due weight age is given to it by passing a resolutions to that effect in the State Legislative Assembly. It does not mean that we will concede everything passed by the State Assembly but with regard to the creation of a State the Assembly resolution signifies a general consensus.
 
"రాష్ట్రాల పునర్విభాజనాకై "రాష్ట్రాల పునర్విభజన కమిటీ వేయడం సమంజసం. చాలా ప్రాంతాల నుంచి ప్రత్యెక రాష్ట్రాలు కావాలని కోరికలు ఉన్నాయి. విదర్భ ప్రజలు అడిగిన ప్రత్యెక విదర్భ రాష్ట్రం విషయంలో మిగిలిన మహారాష్ట్రీయులు వ్యతిరేకిస్తున్నారు. ప్రత్యెక రాష్ట్రాల వేర్పాటు విషయంలో, రాష్ట్ర శాసన సభ తీర్మానం జరిగితే వాటి విషయంలో పరిశీలించడం జరుగుతుంది. దీని అర్ధం, ఆ రాష్ట్ర శాసన సభ చేసిన తీర్మానాన్ని మాత్రమె పరిగణిస్తామని కాదు"
 
ఇదీ అద్వానీ గారు కేంద్ర గృహ శాఖామాత్యులుగా ఉన్నపుడు పార్లమెంటులో గౌరవ సభ్యుడికి ఇచ్చిన సమాధానం. అంటే, శాసన సభలో తీర్మానం చేయడం తప్పనిసరి.(దానిని ఆమోదించినా ఆమోదించక పోయినా) ఆంధ్రప్రదేశ్ శాసన సభలో ప్రస్తుతమున్న పరిస్తితులలో అది సాధ్యమా?
 
 
పెద్దలు అద్వాని గారు, విదర్భ విషయంలో, తతిమా మహారాష్ట్ర ఒప్పుకోవడంలేదు కాబట్టి వేర్పాటు చెయ్యలేం అని శెలవిచ్చారు, కాంగ్రెస్ నాయకులు చెబుతున్న "కాన్సెన్సస్" అంటే అర్ధం అదే కదా! కాకపొతే, ప్రస్తుతం అద్వానీ గారు అధికారంలో లేరు అంతే  తేడా.
 
ఇదే విషయాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మొన్న రాజమండ్రి సభలో ప్రజలకు చెప్తూ, మమ్మల్ని దొంగలు, దోపిడీదారులు అని నోటికోచ్చినట్లూ మాట్లాడుతూ, తీర్మానానికి సహకరించమట్లే కుదరదు కదా అన్నారు.
 
ఈ విషయం తెలంగాణాలోని అన్ని రాజకీయ పక్షాలకు, నాయకులకు తెలుసు, కానీ, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.        

27, జనవరి 2013, ఆదివారం

ఉండవల్లి అంటే అంత ఉలుకెందుకు


పాపం ఉండవల్లిని తిట్టని తెలంగాణా నాయకుడు లేడు. ఒక పార్లమెంట్ సభ్యుడైతే ఆయనను వేశ్యతో పోల్చాడు. మన పిల్ల కాకి నోటికొచ్చినట్లు మాట్లాడాడు. మన ఆడ పడచు అఫ్జల్ గురు కన్నా ప్రమాద కారి అని సెలవిచ్చింది. ఎవరిని పడితే వారిని తిట్టి, కొట్టే మన మేనల్లుడు ఊసరవెల్లి అని వక్కాణించారు. అతను మాట్లాడిన మాటలను ఇష్టం వచ్చినట్లు వక్రీకరించారు. ఉండవల్లి గారు చెప్పిందేమిటి దానికి మన వాగ్గేయ"కారులు" పాడినదేమిటో చూద్దాము--
 
 
01) పోలవరం కడితే 10 లక్షల ఆయకట్టు స్థిరీకరణ చేస్తూ, కృష్ణా నదిలోకి నీరును మళ్ళించి సముద్రంలో వృధాగా పోతున్న 3000 టి ఎం సి నీటిలో కనీసం 80 టి ఎం సి ల నీటిని రిజర్వాయర్ ద్వారా నిలవవుంచవచ్చు.
ముంపుకు గురౌవుతున్న గిరిజనాలను ఇతోధికంగా ఆదుకోవచ్చు. చైనాలో త్రీ గార్జెస్ ఆనకట్ట కట్టడానికి కొన్ని లక్షల మందిని ఖాళీ చేయించారు, అక్కడ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి, అందుకే అభివృద్ధి సాధ్యం అవుతుంది అని చెప్పారు.
 
దీనికి చిలువలు పలువలు పుట్టించి - గిరిజనులను చంపేయమన్నాడు ఉండవల్లి అని వక్రీకరించారు మన కుటుంబ సభ్యులు. గిరిజనులు అడవుల్లోనే ఉండాలి. వాళ్ళు మన లాగా గుంటూర్ విజ్ఞాన్లో చదువుకో కూడదు.  మంచి బట్టలు వేసుకోకూడదు, నక్సల్స్ చెప్పేది ఇదే!
 
02) క చ రా గారు రోజువారీ మామూలుగా దుర్భాషలాడే ఒక క్లిప్పింగును చూపించి (తలలు తెగుతవి)  ఖాసిం రజ్వీ లాగా మాట్లాడుతున్నాడు, మంచిది కాదు అన్నాడు ఉండవల్లి.


దీన్ని మొత్తాన్ని తెలంగాణా సమాజానికి అంటగట్టే ప్రయత్నం చేసి, తెలంగాణా ప్రజలను ఖాసిం రిజ్వీతో పోల్చాడు ఉండవల్లి, ఆయన మీద దాడులు జరిగితే మేము కాపాడలేము అని పొన్నం గారు వక్కాణించారు.
 
03) "మా" పిల్లలు చచ్చిపోతున్నారు అని గగ్గోలు పెడుతున్నారు, వాళ్ళు మనందరి పిల్లలు, వాళ్ళని   ఆత్మహత్యలకు పురికొల్పే విధంగా నాయకులు
ఉపన్యసిస్తున్నారు. ఇంతవరకు నాయకుల పిల్లలకు జ్వరం కూడా రాలేదు, కానీ వందలమంది అమాయకులు భావోద్వేగాలకు గురి అయ్యి నిరాశ  చెందుతున్నారు ఇలా రేచ్చకోట్టడం మంచిది కాదు అని చెప్పారు.


దీనికి సమాధానంగా మన గుంటూరు రత్తయ్య గారి కాలేజీలో పేడ బిర్యానీ తింటూ చదువుకున్న పిల్లకాకి - మీ కుటుంబ సభ్యులు వెంకయ్య నాయుడు గారి కుటుంబ సభ్యులు ఎందుకు చచ్చిపోలేదు జై ఆంద్ర ఉద్యమంలో అని ప్రశ్నించాడు. పిల్ల కాకి గారూ - అప్పుడు చనిపోయింది పోలీసు ఫైరింగులో, ఇప్పుడు చనిపోతున్నది మీ నోటివెంట వస్తున్న నిరాశ నిస్పృహ కలగలిసిన మాటల తూటాలతో. రంగునీల్లు చల్లుకొని అగ్గిపెట్ట కోసం వెదుకుతున్నట్లు చేసిన నటనతో ప్రారంభం అయింది చివరికి అది మిమ్మల్నే అంటించే రోజు త్వరలో వుంది. జై ఆంద్ర ఉద్యమం చేసిన ఉండవల్లి, భాజపా వెంకయ్య ఇద్దరూ ఆంతరంగిక భద్రతా చట్టం కింద జైలు శిక్ష అనుభవించారు. నువ్వు, నీ తండ్రి, నీ సోదరి, నీ మేనమామ ఎన్ని సార్లు జైలుకు వెళ్ళారు. ముఖ్యమంత్రి మీద కాకతీయ విశ్వవిద్యాలం పిల్లలచేత రాళ్ళు, గుడ్లు వేయించిన నాయకులు బాగానే వున్నారు, ఉద్రేకంతో చేసిన పనికి ఆ పిల్లలు జీవితం బలి అయిపొయింది.
 
04) హరీష్ రావ్, క తా రా రా గారు విధి నిర్వహణలో వున్న ఉద్యోగస్తులను ఎలా కొట్టింది, పోలీస్ ఆఫీసర్లను ఎలా దుర్భాషలాడింది చూపించారు. ఇలా భయబ్రాన్తులనిచేస్తే ఉద్యమానికి, రాష్ట్రం విడిపోవడానికి మిగతాప్రాంతాలవారు
ఎలా సహాయం చేస్తారు అని ప్రశ్నించారు.

ఉండవల్లీ - నువ్వు ఓసరవెల్లివి, ఖబడ్దార్, నీ మీద దాడి జరిగితే మాది బాధ్యత కాదు. యిదీ సమాధానం.


05) చిదంబరం గారి ప్రకటనలో - తెలంగాణా ప్రక్రియ ప్రారంభం అయ్యింది, శాసన సభలో బిల్లు పెట్టి పంపండి అని ప్రకటన చేశారు, ఇలా తీర సీమంధ్ర ప్రాంత వాసులని దొంగలు, దోపిడీదార్లు అంటుంటే 175 మంది
శాసన సభ్యులు ఎలా మద్దతిస్తారు అని ప్రశ్నించాడు.


దీనికి బదులుగా, ఏయ్ ఉండవల్లీ నువ్వు వెశ్యవి, సోనియా గాంధి మీటింగు తర్జుమా చేసిన నువ్వు తెలంగాణా ఇస్తానని ఎందుకు చెప్పావు, నువ్వొక మూర్ఖుడివి అని తిట్టి పోశారు.
 
06) భా జ పా అధినేత అద్వానీ గారు పార్లమెంటులో విదర్భ రాష్ట్రం ఎందుకు ఇవ్వట్లేదు, నరేంద్ర గారి ఉత్తరంపై వారి పార్టీ స్టాండ్ ఏమి చెప్పారు, వారు ఇప్పుడు వోట్ల కోసం ఎలా మాట మార్చారో వివరించారు.


ఆయన వివరించిన గణాంకాల జోలికి ఎవరూ పోలేదు. వాటిని తప్పు అని చెప్పట్లేదు. ఉండవల్లి ఎక్కడ కూడా తెలంగాణాకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. క చ రా కుటుంబం ప్రజలను ఎలా మభ్యపెడుతున్నారో చెప్పి తెలంగాణా ప్రజలను చైతన్య పరచడానికి ప్రయత్నం చేశా సారు. ఇంత తీవ్రమైన భావోద్రేకాలను రేచ్చాకోడుతుంటే, రాష్ట్ర విభజన ఎలా సాధ్యమౌతుందో ఆలోచించుకోవాలి.
 
భర్త్రుహరి సుభాషితాలు ఈ నాటి నాయకులకు బలవంతంగా నేర్పడం అత్యవసరం, వాటిల్లీ మరీ ముఖ్యంగా ఈ రెండు పద్యాలు ----- కందుకమువోలె సుజనుడు, గ్రింది బడి మగుడ్ మీదికిన్నేగాయు జుమీ ..... ఇంకొకటి
తివిరి ఇసుమన తైలంబు తీయవచ్చు.....


26, జనవరి 2013, శనివారం

ఉండవల్లి గారి ఉపన్యాసం అంతరార్ధం ఏమిటి?

 
ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మంచి వక్త.   అవినీతి కంపు అంటని విలక్షణమైన  బహు కొద్ది మంది రాజకీయ నాయకులలో ఆయన ఒకరు.   
 
 
ఆయన ప్రసంగంలో చూపించిన క్లిప్పింగులలన్నీ ప్రజా బాహుళ్యంలో విస్తారంగా ఉన్నాయి.   అంతర్జాలం పుణ్యామా అని సంగణక యంత్రం(computer)తో పరిచయం ఉన్నవాళ్ళకి తెలిసినవే.   ఎవరికైతే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేదో వారికి విషయాలు తెలుసుకొనే అవకాశం  కలిగింది. 

 
బ్రాహ్మణ కులంలోని ఉప శాఖ  గురించి  ఆయన  చెప్పింది  అక్షర సత్యం.     వాస్తవానికి "తెలఘాణ్య" బ్రాహ్మణులే తీర ఆంద్ర ప్రదేశ్లో ఎక్కువ శాతం వున్నారు.   ముఖ్యంగా వీరు ఉభయ గోదావరి, గుంటూరు జిల్లాలో స్థిరపడినారు.   వీరంతా,  కొన్ని   దశాబ్దాల   క్రితం   తెలంగాణా నుంచి   వలస వచ్చిన వాళ్ళే.   వీళ్ళ ఇళ్ళ పేర్లన్నీ   తెలంగాణా ఊర్లపేరుతొఉంటాయి.    

 
ఆయన ప్రసంగం మొత్తం తె రా స ని, అది చేస్తున్న దౌర్జన్యాన్ని  తప్పుపట్టేడే  కానీ, అదే మాటలు వల్లెవేసే కాంగ్రెస్ వాళ్ళని ఏమీ అన  లేదు.   ఉండవల్లి గారిపై అధిష్టానానికి మంచి అభిప్రాయం ఉంది.   ఆయనని దూషించడం ద్వారా, పొన్నం, మందా, యాష్కీలు కాంగ్రెస్ కి దూరమయ్యే అవకాశం వుంది.     ప్రస్తుతం తెలంగాణలో తె  రా  స, తక్కిన ఆంద్ర ప్రదేశ్లో వై ఎస్ ఆర్ సి పి గాలి విస్తృతంగా వుంది.    తెలంగాణా ఇస్తే తె  రా సా కలుస్తుందో లేదో కానీ, దానిని ఆపడం ద్వారా, కేసులు ఎత్తివేయడం లేదా బలహీన పరచడం ద్వారా, జగన్ పార్టీ కాంగ్రెస్ కి  దగ్గర అవడం ఖాయం.  జగన్ ద్వారా కనీసం ఒకటో ఆరో సీటు తెలంగాణలో కూడా తెచ్చుకోవచ్చు కానీ, తే రా స తో కలవడం ద్వారా వున్నవి ఊడే  ప్రమాదం వుంది.      ఇవన్నీ కాంగ్రెస్కి తెలిసే, కాంగ్రెస్ నాయకులను (కనీసం తీర ఆంధ్రలో) ఒకే త్రాటి మీదకు తెచ్చే బల ప్రదర్సన జరిగింది.   దీనికి కాంగ్రెస్ పెద్దల సహకారం తప్పకుండా ఉండే ఉంటుంది.    అందుకే, ఆయన ప్రసంగంలో ఎక్కడ కూడా బాబు గారిని, తెలంగాణా కాంగ్రెస్ నాయకులని, జగన్ పార్టీని తప్పు పట్టలేదు.   ఇదంతా కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడలో భాగం మాత్రమె. 

 
ఈ బహిరంగ సమావేశం ద్వారా, కాంగ్రెస్ మస్తిష్కంలోని ఆలోచన తేటతెల్లమవ్తుతుంది .    కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర  విభజనని 2014 ఎన్నికల దాకా  పొడిగించి, అప్పుడు సమైక్యమే మా విధానం అని ప్రకటించి, తే దే పా ని తీర ఆంద్ర ప్రాంతంలో దెబ్బతీసి MP సీట్లు కాంగ్రెస్కి, MLA సీట్లు జగన్కి వదిలివేయచ్చు.    తెలంగాణలో, తే దే పా వోట్ల చీలిక వల్ల  తే రా స కు కొంత నష్టం జరగినా ఆశ్చర్యపోనవసరం లేదు.     తెలంగాణా కాంగ్రెస్ నాయకులు తే రా స లో చేరి వారి వారి శాసన సభా క్షేత్రాలలో సీట్లు డిమాండ్ చేస్తే, తే రా స నే నమ్ముకున్న నాయకులకు నష్టం జరిగి కొంత అసంతృప్తి ఏర్పడా వచ్చు.   కానీ తీర ఆంధ్రలో వున్న శాసన సభ్యుల్లో 90 శాతం మంది జగన్ గ్రూప్కి చెందినా వారే, కలహం ఉండక పోవచ్చు.  

 
తెలంగాణా విషయంలో ఇటు కాంగ్రెస్ కానీ, అటు తే ర స కానీ, పోరాడేది సీట్ల కోసమే, ప్రజల కోసం ఎంత మాత్రం కాదు.  సోనియా గాంధీ/కాంగ్రెస్ తెలంగాణాకి మద్దతు (గతంలో) ఇచ్చింది నిజం, బాబు గారు మాట మార్చింది నిజం, క చ రా గారు విద్వేషాలు రేచ్చాకోట్టింది నిజం, భాజపా రెండు నాలుకలు ఆరు కాళ్ళ నైజం నిజం, రాష్ట్ర విభజన వల్ల  ఉద్యోగాలు రావన్నది నిజం.    ఇదొక రాజకీయ క్రీడ, ఇప్పటి దాకా మనం చూసిన బూతులు, దౌర్జన్యాలు ఇంకొక సంవత్సరం భరించక తప్పదు.    

25, జనవరి 2013, శుక్రవారం

తెలంగాణా వాదుల నిర్ణయం సముచితం

 
సీమాంధ్ర పెట్టుబడిదారుల అవినీతిపై పరిశోధన చేసి న్యాయస్థానాలలో నిలబెట్టాలనుకోవడం అభినందించదగ్గ విషయం.    పెట్టుబడిదారులు విభజనకు అడ్డుకున్నా అడ్డుకొనకపొయినా ఈ విషయంలో భారతీయ పౌరులుగా వారి అవినీతిపై పోరాడాల్సిందే.     అదే విధంగా, తెలంగాణా ప్రాంతంలోని అవినీతి పరులు, పెట్టుబడిదారులు - వీరు తె రా స కు మద్దతు ఇస్తున్న వారైనా కాకపోయినా  కూడా (దాదాపు అన్ని పార్టీలలోనూ ఉన్నారు) ఇలాంటి ప్రయత్నం చేయాలని మనవి.   దీనితో సమాజంలోని అవినీతిపై కొంతవరకైనా పోరాడిన తృప్తి మిగులుతుంది. 

తెలంగాణాతో ముడిపెట్టిన గోర్ఖాలాండ్ ఉద్యమకారులు

 
తెలంగాణపై చర్చోప చర్చలు తీవ్రంగా జరుగుతుండగా గోర్ఖాలాండ్ విభజన వాదులు తమ స్వరాన్ని మరింత పెంచారు. హిందూస్తాన్ టైమ్స్ కధనం ప్రకారం కేంద్రం చిన్న రాష్ట్రాల వేర్పాటుపై సానుకూల నిర్ణయం తీసుకుంటే గోర్ఖలాండ్లో పరిస్తితి చేయ్యిదాటి పోయే ప్రమాదం వుంది. పత్రిక కథనం ప్రకారం గోర్ఖాలాండ్ ఉద్యమ పెద్ద రోషన్ గిరి ఇలా అన్నారు - "మాది 107 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఉద్యమం, తెలంగాణా ప్రత్యెక రాష్ట్రం వేర్పాటు చేసే పక్షంలో గోర్ఖాలాండ్ కూడా వేర్పాటు చెయ్యాలి".   లేని పక్షంలో వందాలాది మంది యువకులు ఆయుధాలతో పోరాటానికి  సిద్ధంగా ఉన్నారు.

 
తెలంగాణా నాయకులది "శాంతియుత మిలిటెంట్ పోరాటం" అయితే, గోర్ఖాలది "అశాంతియుత మిలిటెంట్ పోరాటం". గోర్ఖాలాండ్ విభజన చేస్తే దేశ భద్రతకే పెను ప్రమాదం. గోర్ఖాలు "కలకత్తా సహిత" ప్రత్యేక రాష్ట్రం అడగటం లేదు కానీ, వాళ్ళు విభజన కోరుకొనే ప్రాంతం దేశ సరిహద్దులకు దగ్గరగా వుంది.
ఇలాంటి పరిస్తితులలో  ఏ పార్టీ కానీ ప్రభుత్వం కానీ తేనెతుట్టె కదిపే ప్రయత్నం చేయకపోవచ్చు.


పూర్తి వివరాలకు ఈ క్రింది లింకు నొక్కండి


http://in.news.yahoo.com/gjm-unit-threatens-armed-agitation-gorkhaland-183000149.html
 

జర్నలిజం నైతిక విలువలు

జర్నలిస్టుల నైతిక ప్రవర్తన - నియమావళిని అనుసరించి సంపాదకునికి ఎవరైనా పాఠకుడు ఉత్తరం వ్రాసినపుడు దానిని యదా తధంగా ప్రచురించడం, దౌర్జన్యాలను ఘనకార్యాలుగా చిత్రించడం, రెచ్చగొట్టే శీర్షికలను ప్రచురించడం అనైతికం. అలాగే ప్రజల్లో భయాందోళనలు కలిగించే వార్తలను, ముఖ్యంగా అవి వాస్తవం కానప్పుడు, ప్రచురించరాదు.

 
 
మరి ముఖ్యంగా, తీవ్రవాదులు, టెర్రరిస్టులు ఇచ్చే పత్రికా ప్రకటనల ప్రచురణలో (according to 1992 PCI guidelines) సంపాదకుడు సెన్సార్ చేయవలసిన అవసరం వుంది.

 
 
ఈ రోజు నమస్తే తెలంగాణ లో చూడండి - నిషేదిత నక్సల్ నాయకుడు జగన్ గారి రిపబ్లిక్ దినోత్సవ బహిష్కరణ ప్రకటన చూడండి. ఒక నమస్తే తెలంగాణా పత్రికలలోనే కాదు జ్యోతిలో కూడా ఇలాంటి ప్రకటనలు వస్తుంటాయి. యాష్కీ గారు లగడపాటిని గుడ్డలిప్పి తన్నాలన్నాడు - ఇది ఒక వార్తా? ఒక అతున్నత దేశ పార్లమెంటు సభ్యుడైన వ్యక్తీ మాట్లాడిన అభ్యంతరకరమైన భాషను యధాతధంగా ప్రచురించి, సమాజానికి మంచి చేస్తున్నామా? ఇంకొక వ్యక్తీ - సీమాన్ద్రులన్దరినీ తెలంగాణా నుంచి వెళ్ళకొట్టాలి అన్న వార్త ప్రచురించారు. ఇలాంటి వార్తలు ప్రచురించడం ద్వారా తప్పు చేసిన వ్యక్తి పరపతి పెంచినట్లు కాదా? గతంలో పయ్యావుల ప్రకటన "సుయిసైడు బాంబు" ప్రచురించడం కూడా ఇదే కోవకు చెందుతుంది.
 
 


జర్నలిస్టుల నైతిక ప్రవర్తనా నియమావళి కోసం ఈ క్రింది లింకును నొక్కండి.
http://www.pressacademy.ap.gov.in/Journalistula_naitika_pravarthanaa_niyamavali.pdf

24, జనవరి 2013, గురువారం

దానం నాగేంద్ర "అదుర్స్"

జంట నగరాలలోని విలక్షణమైన వ్యక్తులలో దానం నాగేన్ద్రకు ఒక ప్రత్యెక స్థానం వుంది. 2004 లో ఆసిఫ్ నగర్ సీటు ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ మీద అలిగి తె దే పా ముద్రపై గెలుపొందాడు. ఆ తర్వాత వై ఎస్ అధికారంలోకి రావడంతో సీన్ మారిపోయింది. గెలుపొందిన స్థానానికి రాజీనామా చేసి మళ్ళీ అదే నియోజక వర్గం నుంచి పోటీ చేసి మజ్లిస్ చేతిలో ఓడిపోయారు. మళ్ళీ ఎట్టకేలకు 2009లో గెలిచి మంత్రి అయ్యారు. హైదరాబాదు లేని తెలంగాణా ఇచ్చేటట్లు ఉన్నారు అని "సంకేతాలు రాగానే" ఒక రకంగా కాదు హైదరాబాదుతో కూడిన తెలంగాణా ఇస్తున్నారని మరో సంకేతం రాగానే ఇంకో రకంగా స్పందించారు.
 
ఈ వార్త చూసినప్పుడల్లా నాకు అదుర్సు సినిమా కామెడీ సన్నివేశం గుర్తొస్తుంది. సరదాగా చూడండి.
 
http://www.youtube.com/watch?v=VUwsbNPE5EE


1)http://www.istream.com/news/watch/263566/We-dont-want-Hyderabad-as-Union-Territory


2)http://www.istream.com/news/watch/268611/Danam-blames-Seemandhra-leaders
 

సమస్య "ఒక నెలలో" పరిష్కరిస్తాం

మన గృహ శాఖ మంత్రి గారు "ఒక నెలలో తెలంగాణాకు పరిష్కారం చూపిస్తాం" అని చెప్పారు. జనవరి నెల అని మనం అర్ధం చేసుకున్నాం.   కానీ ఆయన ప్రకారం డిసెంబరు మంచి నెల. తెలంగాణా ప్రక్రియ ప్రారంభం అయినది డిసెంబరులో, రద్దు చేసింది డిసెంబరులో, అఖిల పక్షం జరిగింది డిసెంబరులో, హరీష్ రావు అగ్గిపెట్ట కోసం వెదికింది డిసెంబర్ లో, బాబ్రీ కూల్చింది డిసెంబరులో, క్రిస్టమస్ డిసెంబరులో, కృష్ణ కమిటీ ఏర్పడింది డిసెంబరులో, బస్సులు, కేబుళ్ళు తగలబెట్టింది డిసెంబరులో, నిరాహార దీక్షలు జరిగిన పవిత్ర మాసం డిసెంబరు.
ఇన్ని ప్రత్యేకతలున్న డిసెంబరును కాదనే హక్కు తెలుగు ప్రజలకూ లేదు, మరాఠీ మానుస్ షిండే గారికీ లేదు. కాబట్టి డిసెంబరు వరకు వేచి ఉందాం. ఈ లోగా ఇరు పక్షాల రాజకీయ నాయకులు కొట్టుకుంటారు, మనం లైవ్ లో చూద్దాం.

23, జనవరి 2013, బుధవారం

కె వి పి అసలు సిసలైన కాంగ్రెస్ వాది


వాయలార్ రవి గారు చాలా స్పష్టంగా తీర సీమాన్ద్రులకు చెప్పారు - రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితే జగన్ పార్టీ గెలుస్తుంది అదే తెలంగాణా ఇస్తే కనీసం 10 సీట్లు తెలంగాణా నుంచి వస్తాయి అని.    మన కె కె గారేమో మొత్తం 16 మనవే అని కామెడీ చేసారు.    చెన్నారెడ్డి గారి తెలంగాణా ప్రజా సమితి ఉద్యమం అప్పుడు పోలీసు ఫైరింగులోనే కొన్ని వందల మంది చచ్చిపోయారు, (ఫిగర్ కన్ఫర్మేషన్ కోసం కావాలంటే ఆడిట్ కూడా చేసుకోవచ్చు) అయినా సరే ఆయనకు 10/14 మాత్రమె వచ్చాయి.  ఇప్పుడు మరీ 17 కి 17 మనవే అంటే అతిశయోక్తే కదా!

వాయలార్ రవి గారు మలయాళీ ఐనా ఆయన చెప్పినదానికి అచ్చ తెలుగులో అర్ధం ఏమిటంటే, ప్రత్యెక తెలంగాణ ఇస్తే,  ఆదుకోవడానికి తే రా స వుంది, అదే, మీరు చంచల్ గూడ వెళ్లి కాళ్ళు గడ్డాలు పట్టుకొని  జగన్ సారుని ఒప్పిస్తే, తే రా సా కి తూచ్ అంటాము ఎందుకంటే అక్కడ 25 సీట్లు వున్నవి కాబట్టి అని అర్ధం.     అన్ని విషయాలు అచ్చ తెలుగులో చెప్పరు, కొన్ని మలయాళంలోనో, మరాఠీలోనో, ఇటాలియన్ భాషలోనో  చెప్తారు, అర్ధం చేసుకోవాలి మరి. 

దీని పర్యవసానమే, అసలు సిసలైన కాంగ్రెస్ వాది కె వి పి గారి చొరవకు కారణం.     ఆయన తలచుకుంటే, స్వామీ కార్యం, స్వకార్యం రెండూ నెరవేరగాలవు.   

రాష్ట్రాన్ని విభాజించాల్సిందే - హైదరాబాద్ తక్క


స్వాతంత్ర్యానంతరం ఎన్నో రాష్ట్రాలు విడిపోయినాయి.   మహారాష్ట్ర నుంచి గుజరాత్, తమిళ్ నాడు నుండి ఆంద్ర, మధ్య ప్రదేశ్ నుంచి ఛత్తీస్గడ్, ఉత్తర ప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్, బిహార్ నుండి జార్ఖండ్ ప్రముఖమైనవి.   

ఇందులో విడిపోయిన రాష్ట్రాలన్నీ కొత్తగా రాజధానిని చూసుకొని, కొత్తగా భవనాలు నిర్మించుకొని వెల్లిపోయినాయి.   ఆ మాటకొస్తే, ఆంధ్రా కూడా తెలంగాణతో కలిసి, కర్నూల్లో దుకాణాన్ని మూసివేసింది.  విడిపోదలచుకున్న ఏ రాష్ట్రానికైనా ఈ షరతు వర్తిస్తుంది.    తెలంగాణా విడిపోదలచుకుంటే, కొత్త రాజధానిని చూసుకొని కొత్త భవనాలు (టెంట్లు కాకుండా) కట్టుకొని విడిపోవచ్చు.    ఆపడానికి ఎవరికీ అధికారం లేదు. 

22, జనవరి 2013, మంగళవారం

వంచన చేస్తున్న రెండు జాతీయ పార్టీలు

 
దురదృష్ట వశాత్తు, ప్రస్తుతం దేశంలో రెండే రెండు జాతీయ పార్టీలు మిగిలినయ్, అవి కాంగ్రెస్ భాజపా లు. ఈ రెండు పార్టీలు అన్ని రాష్ట్రాలలో లేనప్పటికీ యు పి ఎ, ఎన్ డి ఎ పేర్లతో ప్రాంతీయ పార్టీల కూటములకు నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసినదే.
 
 
జగన్ విషయంలో కాంగ్రెస్, గాలి బ్రదర్స్ విషయంలో భా జ పా రాజీ పడటానికి సిద్ధంగా వున్నాయి. ఈ దిశగా సంప్రదింపులు కొనసాగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. నిద్ర లేచిన మొదలు టి వి మాధ్యమాల ద్వారా పరస్పరం వ్యతిరేకించుకుని సిద్ధాంత రాద్ధాంతాలు చేసి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న ఈ రెండు పార్టీలు అవినీతి విషయంలో రాజీ పడినట్లే. గడ్కరీ గారిని మలి దఫా పార్టీ అధ్యక్షుడ్ని చెయ్యడం ద్వారా అవినీతి విషయంలో వారి ద్వంద నీతిని వారే బయట పెట్టుకున్నట్లు అయింది.   ఈ పొత్తుల ప్రక్రియ కార్య రూపం దాలిస్తే,కేవలం గెలవడం కోసం డబ్బు కోసం మాత్రమే, కాంగ్రెస్ కాంగ్రెస్ జగన్తోను, భా జ పా గాలి బ్రదర్స్తోనూ  పొత్తు పెట్టుకున్నట్లుభావించాల్సి వస్తుంది.

21, జనవరి 2013, సోమవారం

వ్రతమూ చెడింది - ఫలితమూ దక్కేట్టు లేదు

 
పాపం చంద్ర బాబు గారి  కష్టాలు పాకిస్తాను అధ్యక్షుడికి కూడా రాకూడదు. ఒక పక్క కాళ్ళు పుళ్ళు పడుతున్నా పంటి బిగువన మూడు నెలలనుంచి నడుస్తున్న బహుదూరపు బాటసారి.

 
శాసన సభలో మీరు బిల్లు పెట్టండి, పొట్టిదో- పొడుగుదో సంతకం పెడతాం అని రెచ్చిపోయారు. ఆ... కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఇవ్వదులే అని ఒక నమ్మకం. పుట్టి మునిగింది, మీరందరూ సంతకం పెట్టారు కాబట్టి రాష్ట్ర వేర్పాటు ప్రక్రియను ప్రారంభించండి అని డిసెంబర్ 9న ప్రకటన వచ్చింది. తూచ్ రాత్రి పూట రాష్ట్రం ఎట్లా ఇస్తారు అన్నాడు. ఆ రోజు మొదలైన ఆయన కష్టాలు ఇంకా "నడుస్తూనే" వున్నాయి. డిసెంబర్ అంటేనే బాబుకు అచ్చొచినట్లు లేదు. తన తెలంగాణా పర్యటనలో భాగంగా, తెలంగాణపై తొందరగా పగటిపూట నిర్ణయం తీసుకోండి, మేము గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం అని అఖిల పక్షంలో వక్కాణించారు. అంతకముందు చేసిన తప్పులకు ఒక కన్నె పొడుచుకున్న బాబు గారు ఇప్పుడు రెండు కళ్ళు పొడుచుకున్నారు. అటు తెలంగాణా వాళ్ళు ఈయన గారిపై విశ్వాసం వుంచట్లేదు. ఇటుపక్క తీరాంధ్ర ప్రదేశ్లో కూడా బాబు గారి నిర్ణయంపై వ్యతిరేకత వచ్చింది. అసలు కాంగ్రెస్ పార్టీకి కావలిసిందే ఇలాంటి పరిస్తితి. గోచార రీత్యా బాబు గారి పరిస్తితి బొత్తిగా ఏమీ బాగా లేదు, హతవిధీ!

వాయలార్ రవి చెప్పింది యిదే

 
రాయలసీమ సింహం (బిరుదు ఎవరు ఇచ్చారో తెలీదు) టి జి వెంకటేష్ ప్రభ్రుతులు వాయలార్ రవిని ఇటీవల కలిసినప్పుడు, కేవలం తెలంగాణాలోనే ఉద్యమం జరుగుతోంది కదా అని సెలవిచ్చారట. అంటే దాని అర్ధం తెలంగాణా విభజిస్తున్నాము అనికాదు వాళ్ళు ఉద్యమాలు చేస్తుంటే, మీరు ఊరికే ఎందుకు కూర్చున్నారు అని. దాని పర్యవసానమే సమైక్యాంద్రలో రాజుకున్న అగ్గి.    పరుగు పందెంలో పదిమంది పాల్గొంటే ఎవరు గెలిచారు ఎవరు ఓడారో చెప్పవచ్చు.    అలా కాకుండా, కేవలం ఒక జట్టు మాత్రమె పరుగు పందెంలో పాల్గొని తీర్పు చెప్పమంటే కుదరదు కదా అదే వాయలార్ రవి గారి మాటల అంతరార్ధం.   
 
 
కాబట్టి, ఇరు  ప్రాంతాల   తెలుగు  వాళ్ళు  పోటీలు  పడి  తిట్టుకొని,  కొట్టుకొని  బస్సులు తగలేసి, రైళ్ళు  ఆపి  ఎవరి శక్తి మేరకు  వారు  ప్రయత్నించి  రాష్ట్రాన్ని సర్వ నాశనం  చేస్తారని  ఆశిస్తున్నాం.         ఈ కార్యక్రమాలన్నిటినీ ప్రత్యక్ష ప్రసారాలకై  23తెలుగు చానళ్ళు 24 గంటలు సిద్ధంగా వున్నాయని 
తెలియచేయడానికి గర్విస్తున్నాం.  

19, జనవరి 2013, శనివారం

ఖమ్మం జిల్లాలో కూడా రెఫరెండం పెట్టాలి

తె రా స అంటేనే తెలంగాణా - తెలంగాణా అంటేనే తె రా స అని ప్రఘాడంగా విశ్వసించే వాళ్ళలో నేను ముందువుంటాను.   అలాంటి తె రా స, పుట్టి బుద్ధి ఎరిగిన తరువాత ఒక్క  సారి కూడా ఖమ్మం జిల్లాలో గెలిచిన దాఖలాలు లేవు.   అక్కడ పార్లమెంటు స్థానానికి చరిత్రలో జరిగిన  ఏ ఎన్నికలో కూడా తెలంగాణా పార్టీ గెలవలేదు.   1971లో జరిగిన ఎన్నికలలో చెన్నారెడ్డి గారి తెలంగాణా ప్రజా సమితి తెలంగాణా మొత్తం గెలిచినా ఖమ్మంలో మాత్రం ఓడి పోయింది.   పోనీ గత దశాబ్ద కాలంలో జరిగిన స్థానిక ఎన్నికల ఫలితాలు చూద్దాం --

సంవత్సరం     సంస్థ        మొత్తం సభ్యుల సంఖ్య        తెరాస పోటీ చేసినది          గెలిచినవి          వోట్ల శాతం
2001            MPTC                 365                                 37                          సున్నా            0.28
2001            ZPTC                    28                                 10                          సున్నా            0.73

2006             MPTC                410                                 11                          ఒకటి               0.16
2006             Z PTC                   28                                   1                         సున్నా             0.03    


ఇప్పటి వరకూ ఖమ్మం ఎం పి సీటు నుండి గెలిచిన వారి వివరాలు పరిశీలిస్తే, నాదెండ్ల భాస్కర్ రావు గారి నుంచి నామా నాగేశ్వర రావు, రేణుకా చౌదరి గారు వరకు ఎవ్వరూ స్థానికులు కాదు.    అంతో ఇంతో నదికి ఆ వైపున వియ్యంకులో, బావమరుదులో ఉన్నవాళ్ళే.   



గత 2-3 సంవత్సరాలలో రాజీనామాలు-ఉపఎన్నికలు జరిగినా, అవి కేవలం  కరీంనగర్, వరంగల్, మెహబూబ్ నగర్ మరియు నిజామాబాద్ కి మాత్రమె పరిమితమైనాయి.   ఖమ్మం జిల్లాలో నక్సలైటు పార్టీ (సి పి  ఎం ఎల్) తెలంగాణానే  ఉఛ్వ్యానిశ్వాసాలుగా  జీవిస్తున్న  మన చిత్తూర్  జిల్లా సిపిఐ నారాయణ గారి పార్టీకి కలిపి ముగ్గురు శాసన సభ్యులు ఉన్నారు.  వీరు ముగ్గురు రాజీనామా చేసి మళ్ళీ గెలవటం ద్వారా, ఖమ్మం జిల్లాలో కూడా తెలంగాణా తీవ్రతను ప్రపంచానికి తెలియచేసినట్లవుతుంది.  
 
 
సి పి ఐ గెలిచినా నిఖార్సైన తెలంగాణా వాదం గెలిచినట్లే విస్వశించాలి.       

ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగిరిందిట

 
హిందూ మత పీఠాధిపతులందరూ చాతుర్మాస దీక్షలో ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రశాంత ప్రదేశానికి వెళ్లి మౌన వ్రతంతో పాటు కఠోర దీక్షలో వుంటారు. స్వామి వారు దీక్షలో వున్నప్పుడు రోజు వారీ వచ్చే భక్తులకు దర్శనం వుండదు. కానీ మన తెలంగాణా పీఠాధిపతికి ధనుర్మాసం లేదు, చాతుర్మాసం లేదు. అగ్గిపుల్ల గీసి, కొంచం రాజుకోగానే ఫాం హౌస్లో సేద తీరుతారు. కేవలం వి ఐ ఫై దర్శనాలు మాత్రమె వుంటాయి. ఈ మధ్యనే దూరవాణి ద్వారా క చార గారి గళం వినే అదృష్టం కలిగింది. జాగో భాగో మాటలకు కట్టుబడి ఉంటా అని నొక్కి వక్కాణించారు. దానితోపాటే, హైదరాబాదు మీద రెఫరెండం పెట్టండి హైదరాబాదులో తెలంగానం వుందో లేదో తేలుతుంది అని శలవిచ్చారు.

 
 
అంటే  హైదరాబాదుతో కూడిన  విభజనపై భిన్నాభిప్రాయం వుంది అని మీరు ఒప్పుకున్నట్లే కదా ! మీరు, మీ శిష్య బృందం ఎప్పుడు మైకుల ముందుకు వచ్చినా గతంలో జరిగిన 16 ఉప ఎన్నికలలో నూటికి నూరు  శాతం తె రా స గెలిచింది కాబట్టి తెలంగానం బలంగా ఉన్నట్లే అని అంటారు కదా! మరి బల్దియా ఎన్నికలలో ఎందుకు పోటీ య్యలేదు సారూ కొంచెం వివరిస్తారా?

 
 
రేఫరండం అనే పదం వాడి కాశ్మీర్లో నెహ్రు గారు చేసిన తప్పునుంచి ఇంకా బయటపడలేదు, దయచేసి ఆ పదాన్ని మన డిక్షనరీ నుంచి తొలగిద్దాము. హైదరాబాద్లో అభిప్రాయ సేకరణ జరిగి రెండు సంవత్సరాలే కదా అయింది. దాదాపు 25 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వున్న 150 కార్పోరటర్లు ఎన్నికలకు వచ్చిన ఫలితాలు చూడండి -- :

 
కాంగ్రెస్ : 53 కార్పోరటర్లు..... 50 : 50
తె దే పా : 45 కార్పోరటర్లు ... తె రా స ప్రకారం సమైక్య వాద ఆంద్రోల్ల పార్టీ
భాజపా : 5 గురు ......... హైదరాబాదుతో కూడిన విభజన
మజ్లిస్ : 43 గురు ......... ఇస్తే దేశం కూడా కావాలంటారు. రాయల తెలంగాణా
ఇతరులు : 4 గురు .......... తెలీదు.

 
ఈ ఎన్నికలు వై ఎస్ మరణం తరువాత జరిగినవి. అంటే ప్రత్యెక వాదం బాగా  రగులుకుని జాగో భాగో అన్నప్పుడు   జరిగినవి. తే రా స వారు నామినేషన్ వెయ్యడానికి కూడా భయపడినప్పుడు జరిగినవి.    ఏంటో మంది శాసన సభ్యలు కాంగ్రెస్, తె దె పా ను వదిలి తె రా స లో చేరారు.     కాంగ్రెస్ తె దే పా వారు ఎంతో  మంది కార్పోరటర్లు జగన్ గ్రూప్లో చేరారేకానీ తే రా సాలో ఎవ్వరూ చేరలేదు.

 
 
హైదరాబాద్తో కూడిన తెలంగాణా విభజన గురించి గొంతు చించుకొనే భాజపా వారికి వచ్చినవి 5 సీట్లు మాత్రమే? అందరు శాసన సభ్యులు రాజీనామా చేసి మళ్ళీ తెలంగాణా వాదం గెలిచినా భాజపా అధ్యక్షుల వారు అంబర్ పేట్  నుంచి రాజీనామా చెయ్యలేదు, ఎందుకంటే వారికి తెలుసు, ఏమి జరుగుతుందో. ఇన్ని సాక్షాలుండగా ఇంకా రెఫరెండం ఎందుకు, దండగ.
   

17, జనవరి 2013, గురువారం

మూడు ముక్కలాట కన్నా 4 ముక్కలాట మంచిది

 
బాబు, నేను చెప్పదలచుకుంది పేకాట గురించి ఎంతమాత్రం కాదు.    రాష్ట్ర గీతం, రాష్ట్ర పక్షి, రాష్ట్ర అది, రాష్ట్ర ఇది లాగే, ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ఆట ఏది అని అడిగితె, పాపం నిజంగా చదువుకొనే విద్యార్ధులు  తిక మక పడకుండా పూర్తి క్లారిటీ  కోసం  రాస్తున్నాను.    
 
 
ఎంచక్కా తెలంగాణాని రెండు రాష్ట్రాలు (అంటే వరంగల్లో, కరీం నగరో రాజధానిగా తెలంగాణా  రాష్ట్రం ఒకటి, మరొకటి హైదరాబాద్ రాజధానిగా చుట్టు  పక్కల వున్న మహబూబ్ నగర్, రంగ రెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాల్లోని  కొన్ని మండలాలు తీసుకొని మరొక రాష్ట్రం) తీర సీమంద్రని  ఆంధ్రాగా, రాయల సీమగా రెండు ప్రత్యేక రాజధానులతోటి రెండు రాష్ట్రాలు చేస్తే మన సమస్యకు పరిష్కారం దొరకచ్చు.     
 
 
హైదరాబాదు ప్రత్యేక  రాష్ట్రం విషయంలో తెలంగాణా వారికి కూడా ఎలాంటి అభ్యంతరం వుండకూడదు.    ఎందుకంటే, క చ రా గారి లెక్కల ప్రకారం 4 నుంచి 5 లక్షల మంది మాత్రమె హైదరాబాద్ల ఆంద్రోళ్ళు వలస వచ్చి వుంటారు.   అంటే దాదాపు 2.0 నుంచి  2.2 కోట్ల (ఊహాజనిత) హైదరాబాద్ రాష్ట్రంలో కేవలం 4 శాతం మంది మాత్రమె ఆంద్రోళ్ళు కదా?   ఈ విషయంలో తెలంగాణా వాది  వెంకయ్య నాయుడు గారికి కూడా అభ్యంతరం వుండదు. ఎందుకంటే, హిందీ మాట్లాడే వాళ్లకి డజను రాష్ట్రాలు ఉండగా తెలుగు మాట్లాడే వాళ్లకి 4 రాష్ట్రాలు ఉంటె తప్పేంటి, అధికస్య అధికం  ఫలం అన్నారు కదా పెద్దలు.   దీనివలన తెలంగాణా నాయకత్వానికి స్వయం పాలనతో పాటు, కేవలం 4-5 లక్షల మంది ఆంధ్రా వలస వాదులపై పెత్తనం చెలాయించే అవకాశం కూడా దొరుకుతుంది.

16, జనవరి 2013, బుధవారం

చెప్పేవి శ్రీరంగ నీతులు - దూరేవి --- ----


తెలంగాణా మనో'బావా'లకు దర్పణం పట్టే నమస్తే తెలంగాణా దిన పత్రికను చూడండి.  ఎంచక్కా, సీమాంధ్ర దోపిడీ దారు సిమెంటు ప్రకటన మొదటి పేజీలో ముద్రించారు.   విశ్వ విద్యాలయానికి వెళ్ళకుండానే పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించే మన  ప్రోఫెసరు గారేమో, సీమాంధ్ర వస్తువులు వాడకండి, బహిష్కరణ చెయ్యండి అని పాపం కాలేజీ విద్యార్ధులను రెచ్చగొడతారు.  సీమాంధ్ర వాళ్ళ పాలు, కూరగాయలు, దుర్గ గుళ్ళో ప్రసాదం మాత్రం (అపుడెపుడో ఒక వస్తువుల పట్టిక ఇస్తానన్నారు, ఇంకా ఇవ్వలా)  బహిష్కరించాలి, కానీ, జైలు జీవితం గడుపుతున్న వారి అక్రమ సంపాదన  ద్వారా వచ్చిన ప్రకటనల డబ్బులు కావాలి, ఎంత మోసం?  నమ్మకపోతే ఈ లింకును నొక్కండి http://epaper.namasthetelangaana.com/#
 
 
 
ఎ బి ఎన్ చానల్ వారిది మరొక రకమైన మోసం.   దొంగ బాబాలు, స్వామీజీలు, పత్రీజీలను ఎండగట్టాలంటారు.   కానీ, నిన్ననే, మన అపర బాబా "బాల సాయి బాబా" పుట్టిన రోజు వేడుకలు, ఆయనగారు వేవిళ్ళు వచ్చిన స్త్రీ లా వాంతులు చేస్తుకున్నట్లు శివలింగాలు బుడుంగ్ బుడుంగ్ మని కక్కే సీన్లని ప్రత్యక్ష ప్రసారాలు చేస్తారు.   తప్పుకదండీ?
 
 
ఎంతైనా సంభావన గట్టిగానే ముట్టివుండాలి మరి?
 

ఎవడి గోల వాడిది

 
చలి కాలమైనప్పటికి ఈ సారి మన రాష్ట్రంలో పెద్ద చలిగా అనిపించలేదు. అప్పుడే ఎండాకాలంలో లాగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీనికితోడు, ఈ జనవరి 28 "చావు గీత" (dead line) ఒకటి పులిమీద పుట్రలా దాపురించింది. చివరికి ఆంద్ర ప్రదేశ్ చరిత్ర చదువుకొనే పిల్లల్లు ఎన్ని తేదీలు గుర్తుపెట్టుకోవాలో మరి.
 
 
విధి ఎంత బలీయమైనది. నిర్భయ అత్యాచారం మన మస్తిష్కం నుంచి జారుకుంది, బాబు గారు కాళ్ళు పుళ్ళు పడేటట్లు చేస్తున్న యాత్ర సంగతి మర్చిపోయినాము, జగన్ గారు జైలు జీవితం అందుకు గల కారణాలు వదిలేశాము, క చ రా గారు ఉద్యాన వనంలో సేద తీరుతున్నారని గుర్తు లేదు, అక్బరుద్దీన్ అరెస్టు మర్చిపొయాము, స్వామీజీ అక్రమ అరెస్టును విస్మరించాము.     దేశ సరిహద్దులలో ఉద్రిక్త వాతావరణం నెలకొని వుంది. వీటన్నిటికి మించి ఒకే ఒక్క తెలుగు దిన పత్రికలో వచ్చిన వార్త (అది నిజామో కాదో ఎవ్వరికీ తెలియదు) - రాష్ట్రాన్ని విడదీస్తున్నారని - అంతే , ఎవరి ప్రాంత మనో'బావా'లను వారు 23 చానళ్ళ ముందు రక రకాల విన్యాసాలతో వ్యక్తపరచారు. ఇందులో సహజంగానే గత 2 సంవత్సరాలుగా పేటంట్ పొందిన పదాలు అగ్నిగుండం, కల్లోలం, నాలుకలు కోస్తా, అడ్డుకుంటా, వీడెబ్బ సొత్తు అవును/కాదు, బచ్చ, లుచ్చ, బద్మాష్, పెట్టుబడిదారు, రాజీనామాలు, దోపిడిదారు ఇత్యాది పద ప్రయోగాలు.
 
 
రేపు సమైక్య వాదులు తలపెట్టిన సభ అడ్డుకుంటామని మన కవిత గారు అప్పుడే వార్నింగు ఇచ్చారు. మరోపక్క గుంటూరులో భా జ పా ఆఫీసు తగలేశారు. రేపు కవితమ్మగారు అడ్డుకుంటే, తలకాయలు పగిలేది పాపం పోలీసులకు, ఇరుపక్షాల అమాయక చక్రవర్తులకు మాత్రమే. ఎందుకంటే, ముందుగా నాయకులని అదుపులోకి తీసుకొని వాళ్లకి లైవ్ ప్రసారాల ద్వారా తలకాయలు ఎట్లా పగిలేది ఒళ్ళు ఎంత బాగా హూనంఅయ్యేది చూపించాలి కదా! నాయకులకు కనీసం చొక్కా గుండీ కూడా వూడదు. లాభం మాత్రం రాజకీయ పార్టీలకు, టి వి ఛానళ్ళకు. దెబ్బలు మాత్రము అమాయకంగా రెచ్చిపోయిన వాళ్లకు.

 
 
ఒక పక్క మార్చ్ మాసం ముంచుకొస్తోంది, 10 వ తరగతి, ఇంటర్, వ్రుత్తి విద్య ప్రవేశ పరీక్షలు కేవలం 100 రోజులలోపునే వున్నాయి. కఠిన నిర్ణయాల ద్వారా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ, అవసరమొస్తే, ఆందోళనలకు నాయకత్వం వహించేవాళ్ళపై ఉక్కు పాదం మోపాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఎంతైనా వుంది.

15, జనవరి 2013, మంగళవారం

సంకేతాలు, సంబురాలు, సమరాలు


ఈ మధ్య రాష్ట్రంలో "సంకేతాలు" బలంగా వస్తున్నాయి.   బహుశా  టవర్లు ఎక్కువగా వుండడం వలాననే కావచ్చు.   మొన్నటికి మొన్న కేవలం క చ రా గారి చరవాణికి మాత్రమె సంకేతాలు వచ్చాయి.   నిన్న మాత్రం సాక్షి దిన పత్రికకు మాత్రమె సంకేతాలు వచ్చాయి.     ఆ సంకేతాలనే వారు పతాక ఈర్శికలో ప్రకటించారు.     పెద్ద పెద్ద బూస్టర్లు పెట్టుకొని, కేవలం సంకేతాల కోసమే ఎదురు చూసే నమస్తే తెలంగాణాకు కూడా ఈ సంకేతాలు అందలేదు, కానీ సాక్షికి మాత్రమె అందాయి.  ఈ సంకేతాల సారాంశం ఏమిటంటే, త్వరలోనే రాష్ట్రం విడిపోతుంది, ఒక దశాబ్ద కాలం పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది అని.    
 
ప్రత్యేకించి సాక్షికి వచ్చిన సంకేతాలవల్ల నాకు రెండు విషయాలు బోధ పడుతున్నాయి -
 
అ) సమైక్య వాడుల్లారా, మీరు చాడీ చప్పుడు లేకుండా వున్నారు, జరగా కూడనిది జరగవచ్చు కొంచం మెలకువగా  ఉండండి అని, 
 
ఆ)ఇప్పటి దాకా గోడ మీద పిల్లుల్లాగా వున్న కాంగ్రెస్, తే దే పా MLA/MP 
ల్లారా తొందరగా చంచల్ గూడ వెళ్లి  ఆశీర్వాదం తీసుకోండి అనే ఒక సంకేతం.
 
ఈ శీర్షికకు కేవలం దానం నాగేంద్ర,ఎప్పుడూ ప్రత్యక్ష ఎన్నికలలో గెలవని
పాల్వాయి,మలయాళం మాతృభాషగా కలిగిన ఆమోస్  లాంటి వారు మాత్రమె
స్పందించారు,   లోగుట్టు పెరుమాళ్ళ కెరుక.



 

ప్రజలను సోమరిపోతులని చేస్తున్న రాజకీయులు


తమిళనాడు వాసులకి "పొంగల్" శుభాకాంక్షలు.     ఇప్పుడు కేవలం రు|| 25 జేబులో వుంటే చాలు, చెన్న పట్నంలో ఎంచక్కా ఒక రోజు బతికేయవచ్చు.  


ముఖ్య మంత్రి కుమారి జయలలిత గారు ఒక కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టారు.   దాని ప్రకారం చౌక ధరల అంగళ్ళలో ధర వరలు ఇలా వుంటాయి :


ఇడ్లీ ఒక్కింటికి - రు|| 1-00 (సాంబారు, జాతీయ జెండాలో వుండే 3 రంగుల్లా వుండే 3 రకాల పచ్చళ్ళుతో సహా)
సంబారు అన్నం - రు|| 5-00 (మాంచి ములక్కాడలు, చిన్న సైజులో వుండే ఉల్లిపాయలతో సహా వాళ్ళే మొత్తం సమ పాళ్ళలో  కలిపి/పిసికి ఇస్తారు
పెరుగన్నం - రు 3-00 (నంజుడికి ఆవకాయ ముక్కతో సహా)


పొద్దున్నే లేచి ఎంచక్కా నోరు కడుక్కొని 4/- జేబులో వేసుకొని పొతే, ఫలహారం వేడిగా దొరుకుతుంది.    వెంటనే ఇంటికొచ్చేసి, ప్రభుత్వం వారు ఉచితంగా ఇచ్చిన టెలివిజన్ ముందు కూర్చొని, పురుచ్చి తలైవి (విప్లవ వనిత) గారు ఉచితంగా ఇచ్చిన కేబుల్లో  (అరసుకేబుల్) సినిమాలు గట్రా చూసేసి కొంచెంసేపు నడుమువాలిస్తే 
మధ్యాహ్నం అవుతుంది.    ఎంచక్కా,మళ్ళీ ఒక్క 8/తీసుకొని కొంచం కష్టపడి 
నడిస్తే, సాంబారు అన్నం,పెరుగన్నం తిని త్రేన్పుతూ ఇంటికొచ్చి మళ్ళీ టి వి చూడొచ్చు.  
 
 
మళ్ళీ రాత్రికీ ఇదే వరస.   మొదట్లో మహారాష్ట్రలో కూడా "ఝుంకా భాకర్" అని దుకాణాలు ఉండేవి.  అక్కడ ఇడ్లీ బదులు వడా-పావ్ అంతే తేడా!
 
 
అనాధ శరణాలయాల్లోనో, చదువుకొనే పిల్లల్ని ప్రోత్సహించడానికో ఈ పధకం బాగానే వుంటుంది, కానీ కేవలం వోట్ల కోసం, సీట్ల కోసం ప్రజలని సోమరిపోతుల్లాగా తీర్చి దిద్దుతున్న ఇలాంటి రాజకీయ నాయకుల పాపం పండేదేప్పుడో  కాలమే నిర్ణయించాలి.    

12, జనవరి 2013, శనివారం

రేప్ మరియు క్రిమినల్ కేసుల్లో రాజకీయ నాయకులు

 
ప్రజల మేలు కోసం, మనం ఎన్నుకోబడిన మన  ప్రతినుదులు ప్రజాహితం  కోరుతూ చట్ట సభలలో చట్టాలు చెయ్యాలి  అలాంటి చట్ట సభలలో ఎలాంటి వారు వున్నారో చూద్దాం :
 
 
రేప్ కేసులలో ఉన్నవారు : 12 మంది 
స్త్రీ లను దూషించడం, క్రూరంగా హింసించడం  వంటి కేసులున్నవారు : 36 మంది 
 
 
మొత్తం మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల శాసన సభ సభ్యులు మరియు పార్లమెంటు సభ్యుల సంఖ్య : 4835
వారిలో నేర చరిత వున్నా వారి సంఖ్య : 1448 మంది 
అంటే దాదాపు 30 శాతం మంది ఈ కోవలోకి వస్తారు 
 
 
ఇలాంటి వారు దాదాపు అన్ని పార్టీల లోను వున్నారు.  వీళ్ళందరూ ఎన్నికలప్పుడు దాఖలు చేసే తమ వయసు, విద్యార్హతలతో పాటు నేర చరిత్రను కూడా బహిర్గతం చేస్తారు.    అయినా సరే, ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం వారు ఎన్నికలలో నిలబడడానికి,  గెలవడానికి అర్హులే.   ఒక సాధారణ గుమాస్తా ఉద్యోగం చేసే వ్యక్తీ 24 గంటల కన్నాఎక్కువ సమయం  ఖైదు చేయ బడితే అతన్ని ఉద్యోగంనుంచి తాత్కాలికంగా తొలగిస్తారు.     కానీ ఒక రాజకీయ నాయకుడు నేరం చేసి రెండు వేళ్ళు టెలివిషన్ ద్వారా (విజయ చిహ్నం) ప్రజలకు చూపిస్తూ నవ్వుకుంటూ జైలుకు వెళ్తాడు.   అతని సభ్యత్వానికి వచ్చిన ధోకా ఏమీ లేదు.    అలాంటి వ్యక్తీ మన దేశ  అధ్యక్షుడని కూడా ఎన్నుకోవచ్చు.   
 
 
 
ఇలాంటి వారిని ఎన్నికలలో నిలబడకుండా చెయ్యాలంటే ప్రజా ప్రాతినిధ్య చట్టంలో మార్పులు రావాలి.   మరి ఆ చట్టాలను సవరించేదెవరు?  అందులో ఈ క్రిమినల్ కేసుల్లో జైల్లో వున్న వాళ్ళు, కేసులు నమోదు కాబడి దర్జాగా తిరుగుతున్నా వాళ్ళు.     మరి అలాంటి సభ్యలు చట్ట సవరణ చేస్తారా??   చెయ్యరు - ప్రభుత్వాలు కూలి పోతాయి.   ఇలాంటి చట్ట సవరణ చెయ్యాలి అని ప్రతి పార్టీ గొంతు చించుకొని మైకుల ముందు అరుస్తుంది, టికెట్ల పంపకాని కొచ్చేప్పటికి కండ  బలం, అర్థబలం, గెలుపు సామర్ధ్యం మొ| | ప్రాతిపదికలుగా ఆ నేరగాళ్ళకే టిక్కట్లు పందేరం చేస్తాయి.   ఇలాంటి వాళ్లకి ఓటర్లే బుద్ధి చెప్పాలి  

11, జనవరి 2013, శుక్రవారం

గమ్యం లేని నరహంతక నక్సలైట్లు


జార్ఖండ్లో ఇటీవల్  జరిగిన నక్సల్ కాల్పుల్లో ఎందఱో జవానులు వీర మరణం దారు.  మృతుడి పొట్టలో పేగులు తీసి, విస్పోటకాలు కూరి  వదిలారు.   గమ్యం లేని నక్సల్స్  తమ ఉనికిని చాటుకోవడానికి చేసిన పిచ్చిపని యిది. బూజుపట్టిన మావో సిద్ధాంతాలను కేవలం చదువు రాని, చదువు కోని గిరిజనులపై  ప్రయోగిస్తూ వారి జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారు.    ఎదురు కాల్పుల్లో ఎవడైనా తీవ్రవాది చస్తే,  కాకుల్లాగా అరిచే, వర వర రావు, గజ్జ కట్టి పాట  పాడే గద్దర్, పద్మక్కలు,  విధి నిర్వహణలో అసువులు బాసిన జవానుల మృతికి కనీసం   తమ బాధని వ్యక్తపరచరు.  
 
 
మానవ హక్కుల పేరిట గొంతు చించుకొనే వారు, సాయుధ పోరాటం ద్వారా గత 50 సంవత్సరాలలో వీరు కోరుకుంటున్న విప్లవం ఏమి రాలేదని, ఇహ ముందు కూడా తుపాకి బుజాన వేసుకొని అడవుల్లో తిరిగితే బుజం నొప్పి మోకాళ్ళు నొప్పి తప్ప మావో రాజ్యం రాదనీ నచ్చచెప్పవలసిన  అవసరం వుంది.
 
 
మావో భావాల ద్వారా సమాజానికి నిజంగా మేలు చేద్దామనుకొనే వారు, వారి "గురు పీఠం" చైనాకు వెళ్లి (అడవి మార్గం ద్వారా) వారిని  పాకిస్తాన్ అనే ఉగ్రవాద దేశానికి ఆయుధాలు సరఫరా చేయద్దనీ, మన దేశ బోర్డర్లో వారు సాగిస్తున్న దుందుడుకు చర్యలు ఆపి వేయాలని కోరవలసినడిగా ప్రార్ధన.  

10, జనవరి 2013, గురువారం

"నడుస్తున్న" చరిత్ర - శతదినోత్సవ వేడుకలు

 
నారా చంద్ర బాబు నాయుడు గారు యాత్ర మొదలుపెట్టి నిన్నటికి నూరు  రోజులు పూర్తి అయింది.    నామా గారి ఆధ్వర్యంలో శత దినోత్సవ  వేడుకలు కూడా ఖమ్మం జిల్లాలో భారీ  ఎత్తున జరిగాయి.  
 

రావణా బ్రహ్మకు ఎంత మొండి పట్టుదల వుందో బాబు గారికి అంతకన్నా ఎక్కువే వుందని చెప్పాలి.   అరవై సంవత్సరాల వయసులో గమ్యం కోసం నడుస్తున్న బాబు గారికి శుభాకాంక్షలు.  ఆయన కురిపిస్తున్న హామీలు చూస్తుంటే ఆర్ధిక రంగ మేధావులకు కళ్ళు తిరుగుతున్నాయి.   ముందు అధికారంలోకి వస్తే, తరవాత సంగతి తరవాత అన్నట్లు అనిపిస్తున్నది.
 
 
బాబు గారి వ్యతిరేకులు కూడా ఆయన పరిపాలన దక్షతను ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా మెచ్చుకుంటారు.   ఆయన రాజకీయ జీవితంలో రెండు పెద్ద తప్పులు చేసారు.     ఒకటి కేవలం సాఫ్ట్ వేర్ మీద, హైదరాబాదు మీద మాత్రమె ద్రుష్టి పెట్టడం, రెండవది తే రా సతో  పొత్తు పెట్టుకొని రెంటికిని చెడ్డ రేవడి అవడం  తప్ప సాధించినది ఏమీ లేదు.   ఈ సారి ఎన్నికలలో కూడా ఆయన పరిస్తితి  అంతతమాత్రమే అనిపిస్తుంది.   వచ్చే సార్వత్రిక  ఎన్నికలలో కూడా ఆయన గెలవక పొతే తె దె పా తెరమరుగయ్యే అవకాశాలు చాలా ఎక్కువ.
 
 
బాబు గారు అల్ ది బెస్ట్!

8, జనవరి 2013, మంగళవారం

కల్వకుంట్ల తుపాకీ రాముడు (KTR)

 
రాను రాను బొత్తిగా భయం లేకుండా పోతున్నది మన క తా రా రాకి. మొన్నటికి మొన్న ఉద్యమం అన్నాడు, సరే చేసుకోవచ్చు తప్పులేదు. కానీ ACP స్థాయి అధికారిని నోటికి వచ్చినట్లు దూషించాడు. అది చాలదన్నట్లు ఇప్పుడేమో సమైక్య ఆంద్ర నాయకులే ఒవైసీ చేత ఈ దారుణం చేయిస్తున్నారు అంటాడు. ఈయన మాటలు అచ్చం  తుపాకి రాముడి మాటలు పోలివుంటాయి. మజ్లిస్, హిందువులకు వ్యతిరేకంగా చేసే ఏ కార్యక్రమమైనా అది భా జ పా కు లాభం. (కావాలంటే కరీంనగర్ నుంచి కేంద్ర గృహ మంత్రి అయి ఆ తర్వాత టాంక్ బండ్ మీద విగ్రహాలు కూల్చడానికి తోడ్పడిన పెద్ద మనిషిని అడుగు. వివరంగా చెప్తాడు). భా జ పా వాళ్ళు అసలే ఆంధ్రాలో తెలంగానం తప్ప వేరే విషయం లేక చస్తుంటే, ఈ అక్బర్ గాడు వాళ్ళ చేతికి ఆయుధం ఇచ్చాడు. భా జ పా తెలంగాణలో బలపడితే, తే రా సా నోట్లో మట్టే. ఎందుకంటే, మీ నాన్న ప్రజలను ఎప్పుడు ఎలా రేచ్చగొడతారో ఎప్పుడు హటాత్తుగా నీళ్ళు చల్లి ఫాం హౌస్లో తేనీరు సేవించి నిద్ర పోతారో తెలియదు. కొంత కాలానికి ప్రజలు భా జ పా ని మీకు ప్రత్యామ్నాయంగా ఆలోచించే అవకాశం వుంది. మీరు బాధ పడాల్సింది భా జ పా తెలంగాణలో ఎదుగుదల గురించి కానీ మజ్లిస్ గురించి కాదు.


మొన్నటి దాకా కేంద్ర మంత్రికి ఉత్తరం ఇస్తే చాలు అని తే దే పా వెంట పడ్డారు. నష్టమో కష్టమో పాపం బాబు గారు ఆ ముచ్చట కాస్తా తీర్చిన తర్వాత, కనీసం ఒక్క సారైనా "జై తెలంగాణా" అని అనిపియ్యండి అని ఒకడంటే, ఇంకొకడు, బాబు గారు తెలంగాణా అని రాసి వున్నా "బోనం" ఎత్తుకోలేదంటాడు. వీటివల్ల తెలంగాణా వస్తుందా?ఆయన ఈ రెండు పనులూ చేస్తే సీమంధ్రలో వైసీపీ ఇంకాస్త బలపడుతుంది. జగన్ ఎంత బలపడితే, తే రా సాకి అంత నష్టం.
 
 
ఇదిగో తుపాకి రాముడూ, వచ్చే ఎన్నికల తర్వాత, భా జ పా వారు తే దే పాతో చేతులు కలపవచ్చు, మీరు, వై సి పి, ఎం ఐ ఎం వారు కాంగ్రెస్తో జత కలవ వచ్చు. ఎన్ని సంకరాలు జరుగుతాయో ఎన్ని కండువాలు మారుతాయో తొందర పడొద్దు.

 
ప్రతిదానికి సమైక్యాంద్ర బూచిని చూపించి ఎంతకాలం జనాన్ని మోసం చేస్తారు. ఇప్పటికైనా గెస్ట్ హౌస్ లలో రెస్టులు తగ్గించి, ఇరువర్గాల పెద్దలతో, మేధావులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి కేవలం సమస్యాత్మక విషయాలైన, నీళ్ళు, రాజధాని, భాగో - జాగో, పేడ బిర్యానీ మొ|| విషయాలపై చర్చించి పరిష్కరించుకుంటే చరిత్రలో మిగిలిపోతారు. లక్ష్యం సాధించిన వారౌతారు.

అక్బరుద్దీన్ అనారోగ్య వివరాలు


ఈ రోజు అక్బరుద్దీన్ను నిశితంగా పరిశీలించిన 'నిజాం'  వైద్యులు ఈ క్రింది వివరాలు తెలియచేసారు:

అ) కొవ్వు - ప్రమాద స్థాయిలో వుంది.   ఇది వంశపారంపర్యంగా వచ్చే సమస్య.   పుట్టుకతో వచ్చి ఉంటుందనీ ఇది పుడకలతో మాత్రమె పోతుందనీ వైద్యులు వివరించారు

ఆ ) మూత్ర పరీక్ష - అప్పటికే బట్టలు తడిపేసుకున్నందున పరీక్ష చెయ్యడానికి కొంత సమయం పడుతుందని తెలియవచ్చింది

ఇ ) గుండె :ఈ గుండె రజాకర్ల గుండెను పోలివుందనీ, దీనిని కొంచం సేపు ఆపితే నయం అవుతుందనీ   తెలియవచ్చింది.

ఈ) లాలా జాలం: ఇతను నిత్యం అమేధ్య భక్షణ వలన  లాలాజలం  బదులు ఇంకేదో వస్తున్నదనిన్నీ, దీనిని మునిసిపల్ అధికారులకు అప్పగించగా   వారు నిశితంగా పరిశీలించి "ఇది" "అదే" అని తేల్చారు

ఉ) మూత్ర పిండాలు : వీడికి పిండాలు మూత్రంలో కలిపి పెట్టడానికి సరిపోయేలాగా గుండ్రంగా వున్నాయి.

ఊ ) కళ్ళు : పూర్తిగా పొరలు కమ్మాయి.  వీటిని పీకటం అత్యంత అవసరం

ఋ ) నోరు : పూర్తిగా కాన్సర్ మయం

ఋ) రక్తం : ఎర్ర రక్త కణాలన్నీ ఆకుపచ్చ రంగులోకి మారిపోయాయని వైద్యులు  విస్తుపోయారు.

ఇతన్ని హైదరాబాదు నగరానికి దూరంగా ప్రశాంతమైన జైలులో ఒక జీవిత కాలం ఉంచితే  అన్నీ సర్దుకుంటాయని వైద్యులు రక్షకభటులకు తెలియచేసారు.

7, జనవరి 2013, సోమవారం

పండంటి కాపురానికి రెండే రెండు సూత్రాలు

పండంటి కాపురానికి రెండే రెండు గొప్ప సూత్రాలు (మంగళ సూత్రాలు కావు) మోహన్ భగత్ గారు హైందవ స్త్రీలకు సెలవిచ్చారు. ఒకటి - భర్తను సుఖ పెట్టడం. రెండు - భర్త గారు ఆమెకు కావలసిన అవసరాలు తీర్చడం.
నిన్న ఇండోర్ సభలో బహిరంగంగా ఆర్ ఎస్ ఎస్ చీప్ మోహన్ భగత్ గారు దాంపత్యం యొక్క సూత్రాన్ని ప్రజలకు విపులీకరించారు. ఆయన గారి ప్రకారం భార్య అంటే భర్త మనసు తెలుసుకొని అతనికి కావలసిన రుచికరమైన శాక పాకాలు వండి పెడుతూ, భర్త గారి పాద పూజ చేస్తూ, పిల్లల్నికనీపెంచే యంత్రంగా వుండాలి అని ఈ ఆజన్మ బ్రహ్మచారి గారి భావన.
ఇలాంటి నియమ నిబంధలను ఉల్లంఘిస్తే, భర్త గారు భార్యని విడిచిపెట్టచ్చు అని కూడా ఆయన వాక్రుచ్చారు.
ఈ విషయంలో ఆర్ ఎస్ ఎస్ భక్తులైన భా జ పా వారు వాళ్ళ కుటుంబాలలో సత్వరం చర్చించి, భగత్ గారి గీతా బోధని తు.చ తప్పక పాటిస్తారని
మనస్పూర్తిగా ఆశిస్తున్నాను.

6, జనవరి 2013, ఆదివారం

విద్వేషాలను రెచ్చగొట్టే ప్రజా ప్రతినిధులను అనర్హులుగా ప్రకటించాలి

అన్ని పార్టీలు ముక్త కంఠంతో ఒవైసీ అసందర్భ ప్రేలాపన ఖండించడంతో మజ్లిస్ పార్టీ ఆత్మ రక్షణలో పడింది. ఇవ్వాళో, రేపో అక్బర్ గాడి లొంగు బాటు దిశగా అడుగులు పడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి మూర్ఖులను కనీసం 10 సంవత్సరాలపాటు ఎలాంటి ఎన్నికలలో పాల్గొనకుండా ప్రజా ప్రాతినిధ్య చట్టంలో మార్పులు తేవాలి.


ఇది ఇలావుండగా మహారాష్ట్ర ఒవైసీ శ్రీమాన్ రాజ థాకరే ధిల్లీ మానభంగం కేసులో ముద్దాయిలపై వివాదాస్పద వ్యాఖలు చేసారు. ఆయన ప్రకారం వీరంతా బీహారు నుంచి ధిల్లీ వలస వచ్చారనీ వాక్రుచ్చారు. ఆయన ప్రకారం ఇలాంటి ఘాతుకాలు బిహారీలే చేస్తారని విషం కక్కాడు. ఒక పక్క స్త్రీలపై జరుగుతున్న వరస అత్యాచారాలతో దేశం అట్టుడికి పోతుంటే, ఇలాంటి ప్రాంతీయ దురభిమానులు అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. మంచి, చెడు అనేవి ప్రాంతాలను బట్టి, రాష్ట్రాలను బట్టి ఉండవని ఈ మూర్ఖుడికి తెలియదు.


ఒకే న్యాయం ఒకే చట్టం ఒకే ప్రజా అని గొంతు చించుకునే భా జ పా వారు ఈ ప్రాంతీయ దురభిమాని వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


ఒవైసీ సోదరాలు మతం ముసుగున రాజకీయాలు చేస్తుంటే, థాకరెలు ఉత్తరాది వారిపై, ముంబై వలస వచ్చిన వారిపై విషం కక్కుతున్నారు. స్థానికంగా ఉన్న ప్రజలు కష్ట పడి పనిచేయడానికి సిద్ధపడనప్పుడు ఆ ప్రాంతాలకు ఉద్యోగ ఉపాధి కోసం వేరే ప్రాంతాల వాళ్ళు, వేరే రాష్ట్రాల వాళ్ళు వలస వెళ్ళడం సహజం. ముంబై కానీ అమెరికా కానీ ఈ విషయంలో రుజువైనదదే.


నా దృష్టిలో ఒవైసీ, థాకరే లిద్దరిదీ సమానమైన నేరమే! మతం పేరుతొ, కులం పేరుతొ ప్రాంతీయ దురభిమానంతో విద్వేషాలు రెచ్చగొట్టే ఎవరినైనా ఉపేక్షించ కూడదు. ఎన్నికలలో నిలబడే అర్హతను రద్దుచేయాలి. ఈ మేరకు ప్రజా ప్రాతినిధ్య చట్టంలో సవరణలు తేవాల్సిన సమయం ఆసన్నమైనది .

 

5, జనవరి 2013, శనివారం

ధ్యాస శ్వాస మీద కాదు డబ్బు మీద

 
అమ్మ భగవాన్, పత్రీ'జీ', స్వామీ నిత్యానంద, బాల సాయిబాబా - ఒకరిని మించి ఒకరు, అమాయకులను దోచుకోవటానికి ఈ భూమి మీద ఉద్భవించారు. ఈ మధ్య వస్తున్న ప్రతి తెలుగు సినిమాకి ఏదో ఒక అర్ధం పర్ధం లేని ఉప శీర్షిక (శేషు - ది బుస్స్; జీనియస్ -ఒట్టి దద్దమ్మ) లాగా అమ్మా భగవాన్ - కల్కి అవతారం ; పత్రీజీ - శ్వాస మీద ధ్యాస; నిత్యానంద - రాసలీల మొ|| ఆకర్షనీయమైన నినాదాలతో వీళ్ళు అమాయకులని వంచన చేస్తున్నారు. పాపం ప్రసార మాధ్యమాల వాళ్ళు కూడా మొదటి రెండు రోజులు ప్రసారం చేసిన దృశ్యాన్నే మళ్ళీ మళ్ళీ చేసి మాటర్ సెటిల్ అయిన తర్వాత వదిలేస్తారు. ఉదాహరణకి అమ్మా భగవాన్ దారుణాల గురించి మాదక ద్రవ్యాల గురించి పుంఖాను పుంఖాలుగా కధనాలు ప్రసారం చేసిన మాధ్యమాలు ఒక్క సారిగా ఏమయిందో ప్రసారాన్ని ఆపి వేసి ఆ సంగతి పట్టించుకోవడం మానివేసాయి. పోలీసులు కూడా ష్ గప్ చుప్ అన్నారు. అమ్మ భగవాన్ ఈ సారి జాగర్త పడి, గుట్టు చప్పుడు కాకుండా తమ కార్యక్రమాలు నిరాటంకంగా సాగిస్తున్నాయి. బాల సాయి బాబా గాడి గారడీ విద్యలు చూడాలి - నోట్లోనుండి నిజాలు తప్పితే అన్నీ బయటకు కక్కుతాడు.
 
పత్రీజీ విషయం కూడా అంతే! ధ్యానానికి 200 ఎకరాలు ఎందుకండీ, భూమి లేని వాళ్లకు ఇవ్వాలంటే ప్రభుత్వ పెద్దలు ఏడ్చి చస్తారు గాని వీడికి భగావాను గాడికి మాత్రం దోచి పెడతారు.
 
ఈ బాబాలన్దరిని స్పెషల్ డ్రైవ్ పెట్టి కేసులు నమోదు చేసి రౌడీ షీట్ తెరవాల్సిన అవసరం ఎంతైనా వుంది.

రాష్ట్రాన్ని విభజిస్తే కాంగ్రేసుకి దక్కేది ఏమిటి

 
1960వ దశకంలో కాంగ్రెస్ వృద్ధ నాయకుడు శ్రీ మెట్ల సత్యనారాయణ రావు గారు ఒక సినిమా తీశారు, దాని పేరు "చివరకు మిగిలేది". ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్తితి అదే! నిర్మాతగా ఆయనకూ ఏమీ మిగలలేదు, ప్రస్తుతం ఆయన పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీకి కూడా తమ రాజకీయ విన్యాసాల వాళ్ళ ఏమీ మిగిలేట్లు లేదు.
 
 
లాభ నష్టాలు బేరీజు వేసుకోకుండా ఏ రాజకీయ పార్టీ క్లిష్ట సమస్యలపై నిర్ణయం తీసుకోదు. దశాబ్దం పై చిలుకు చరిత్ర కలిగిన కాంగ్రేసు పార్టీ గురించి, వారి ధోరణి గురించి చెప్పనవసరం లేదు. సంకీర్ణాల యుగంలో ఏ ఒక్క జాతీయ పార్టీ కూడా తమ నిర్ణయాలను ఇతర భాగస్వామ్య పార్టీల మీద రుద్ద లేదు. ఎన్నికలప్పుడు మాత్రమె అయోధ్యలోని రాములోరిని బయటకు తీసుకువచ్చే భా జ పా వారికి కూడా ఈ విషయం గురించి బాగా తెలుసు. కానీ సగటు వోటరు జ్ఞాపక శక్తి చాలా తక్కువ. ఆ సంగతి అన్ని రాజకీయ పార్టీలకు తెలుసు.
 
 
రాష్ట్రాన్ని విభజించినప్పటికి, తెలంగాణలో వున్నా 110 సీట్లలో కనీసం 20 సీట్లు కూడా కాంగ్రెస్కు దక్కవు కారణం అక్కడ ఉద్యమ పార్టీ తె రా స, బిల్లుకు మద్దతు ఇస్తామనే భాజపా ఏ సంగతీ తేల్చని వై క పా, తేల్చి తెల్చనట్లున్న తె దే పా ఆ క్రెడిట్ అంతా కొట్టేస్తారు సరికదా, పదో పరకో సీట్లు వచ్చే అవకాశమున్న తీర సీమాన్ధ్రలో కూడా కాంగ్రెస్ పని హుళక్కే అవుతుంది. ఏతా వాతా తేలింది ఏమిటంటే-- విభాజనైనా, సమైక్యమైనా కాంగ్రెస్, తే దే పాలకు మిగిలేది శూన్యం. కనీసం వై కా పా అధికారంలోకి వస్తే, నయానో, భయానో వాళ్ళని మంచి చేసుకొవచ్చు. అన్ని నదులు వచ్చీ సముద్రంలో కలిసినట్లు, జగన్ పార్టీని కూడా తమలో కలిపపేసుకోవచ్చు. తే దే పాని దెబ్బకొట్టి జగన్ పార్టీ బల పడేలా చెయ్యాలంటే, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితే సరి.
 
 
లేదా కాంగ్రెస్ నిజంగా బతికి బట్ట కట్టాలంటే, హైదరాబాదుని కేంద్ర పాలిత ప్రాంతం చెయ్యడం ఒక్కటే మార్గం.

4, జనవరి 2013, శుక్రవారం

రాష్ట్ర పోలీసు పెద్ద గారికి హృదయపూర్వక అభినందనలు


ఈ మధ్య వివిధ సభలలో బహిరంగంగా నోరు పారేసుకున్న అక్బరుద్దీన్ గాడి (గారు అని సంబోధించి నన్ను నేను కించ పరచుకోవటం ఇష్టం లేక గాడు అని ధైర్యంగా చెప్పా) పీచం అణచడానికి శ్రీ దినేష్ రెడ్డి గారు పూనుకోవడం బహుదా ప్రసంశనీయం. చట్ట ప్రకారం నడచుకుంటారనే పేరున్న రక్షక భట అధిపతిగా మీరు అక్బరుద్దీన్ గాడిని ఎక్కడ దాక్కున్నా లాక్కొచ్చి చట్టం ముందు నిలబెడతారని ఆశిస్తున్నాను. కొత్తగా పుట్టుకొచ్చిన ఒక పార్టీ తప్ప (కేవలం సన్నాయి నొక్కులు మినహా) మిగిలిన అన్ని పార్టీలు ముక్త కంఠంతో ఈ దుష్టుడి ప్రేలాపనలను తీవ్రంగా ఖండించాయి.
  

రైళ్ళు తిరగనీయమ్, బస్సులు కదలనీయం, దంచుతాం మొ|| పరుష పదాల ద్వారా వాక్ స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేస్తున్న కొన్ని శక్తులు ఈ మధ్య టెలివిజన్ కెమెరాల ముందు నిలబడి, దిన పత్రికల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తూ వ్యక్తి స్వాతంత్రయాన్ని హరించాలని చూస్తున్నాయి. ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అని చూడకుండా,  అదిరించి  బెదిరించే అల్లరి మూకలని ఉక్కు పాదంతో అణచివేయాలని పోలీస్ బాసుకి విజ్ఞప్తి.


తె రా స కు మింగుడుపడని తెలుగు దేశం నిర్ణయం 

గత నెల 28న గృహ శాఖామాత్యులు నిర్వహించిన అఖిల పక్షంలో జరిగిన కొన్ని పరిణామాలు తె రా సకు ఏ మాత్రం మింగుడు పడటం లేదు. దీనికి కారణం తే దే పా తీసుకున్న తెలంగాణా అనుకూల నిర్ణయం మాత్రమే. తె దే పా ప్రణబ్ కమిటీకి ఇచ్చిన లేఖ చాలా స్పష్టంగా ప్రత్యేక తెలంగాణాకి ఆమోదముద్ర వేస్తూ చేసిన తీర్మానం. ఇష్టం వున్నా లేకపోయినా, ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా వారు చేసిన తీర్మానం ఉపసంహరించుకోలేదు కాబట్టి తె దే పా ప్రత్యెక రాష్ట్రానికి అనుకూలంగా ఉన్నట్లే. తె దే పా నిర్ణయంతో సంబంధం లేకుండానే, తీర సీమాన్ధ్రలో దాదాపు ఓటర్లు వై కా పా కు అనుకూలంగా ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ ప్రాంతంలో వున్న 184 స్థానాలలో కనీసం 130 స్థానాలలో వైకాపాకి ఆధిక్యం వచ్చే అవకాశం వుంది. రెడ్డి, కమ్మ, కాపు ఆ కులం ఈ కులమని లేకుండా జగన్ పార్టీ లోకి పెరుగుతున్న వలసలే దీనికి తార్కాణం. స్వయంగా ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూర్ జిల్లాలో ఇప్పటికే ముగ్గురు పేరుగల్ల శాసన సభ్యులు, ముగ్గురు మాజీ సభ్యులు జై జగన్ అనేశారు. ఇహ కాంగ్రెస్ పరిస్తితి అంటారా, జగన్ పార్టీ ఎన్నికల తర్వాత కాంగ్రెసుతో కలవచ్చు లేదా కలిపేయవచ్చు. జగన్ విజయం, పరోక్షంగా కాంగ్రెస్ విజయమే!కొంతమంది తెలంగాణా నాయకులు కూడా జగన్ పక్షానికి చేరడానికి సమయం సందర్భం (సరైన సమయంలో సరైన నిర్ణయం - బాగా పాపులర్ అయిన డవిలాగు) కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నికలలోపు భారీ ఎత్తున తెలంగాణలో కూడా జగన్ పార్టీలోకి వలసలు పెరిగితే, మిగిలిన 110 స్థానాలలో 20 నుంచి 25 స్థానాలలో జగన్ పార్టీ జెండా పాతే అవకాశం తోసిపుచ్చలేము. ఏతా వాతా మిగిలిన 90 స్థానాలలో మజ్లిసు, తే దా పా, కాంగ్రెస్, మన నారాయణ పార్టీ, తె రా స, నాగం పార్టీ, భా జ పా, కొత్త ప్రజాస్వామ్యం (న్యూ డెమోక్రసీ) తదితరులు పంచు కోవాల్సి వుంది. 
 
అంతే కానీ తె రా స కి 110/110 వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే, తె దే పా బి సి, ఎస్ సి ఓట్లని గణనీయంగా చీల్చే అవకాశం వుంది. బహుశా ఈ కారణము వలన కూడా తె దే పా తెలంగాణాకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయం తె రా స కు మింగుడుపడడం లేదు. ఎం ఆర్ పి ఎస్ నుంచి తె దే పా కు తెలంగాణలో అందుతున్న సహకారం విస్మరించలేము. ఎన్నికలకు ఇంకా సమయం వున్నది కాబట్టి, చిన్న చిన్న మార్పులు చేర్పులు జరిగే అవకాశం లేకపోలేదు.


దురదృష్టవశాత్తు నాయకుల నీతి అవినీతిల గురించి ఆలోచించడానికి సగటు ఓటరు అంత ఆసక్తి చూపించడంలేదు. బహుశా దేశంలో ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్తితులలో ప్రకాశం పంతులు, లక్ష్మణ్ బాపూజీ వంటి నిజాయితీ పరులొచ్చినా గెలిచే అవకాశాలు తక్కువ. భా జ పా లాంటి కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు తె దే పా లాంటి పార్టీల మద్దతు కేంద్రంలో అవసరం అవుతుంది. ప్రస్తుతం యు పి ఎ లో 2-3 పార్లమెంటు స్థానాలున్న చిన్న చితక పార్టీలకు కూడా మంత్రి వర్గంలో ప్రాధాన్యత వుంది. ప్రస్తుత సంకీర్ణ యుగంలో శాశ్వత మిత్రుడు, శత్రువుని ఊహించడం కష్టం.
 
 
 

3, జనవరి 2013, గురువారం

ప్రపంచ మహాసభలు జరిగింది బ్రాహ్మణుల కోసమా?

నిన్నటి ఆంధ్రజ్యోతి దిన పత్రికలో శ్రీ కదిరే కృష్ణ గారి వ్యాసం "పుర వైభవాలు పాలకుల కుట్రే" అన్న వ్యాసం చదివి నా వ్యాఖ్యానాన్ని వ్రాయకుండా ఉండలేక పోతున్నాను. ఆయన గారి వ్యాసం దిగువ లింకులో ఇవ్వబడింది:

 
వారి ప్రకారం కేవలం బ్రాహ్మణుల కోసమే ప్రపంచ మహాసభలు జరిపినట్లుగా భావించే ప్రమాదం వుంది. రాష్ట్రంలో కనీసం 6 శాతం కూడా లేని బ్రాహ్మణులు ఈ మధ్య కాలంలో బాగా ప్రాముఖ్యం చెందారు. చివరకు గేలి చేసిన సినీ ప్రముఖులే వెంటబడి తన్నారు.
 
వీరు మహా భారతంలో కర్ణుడి కులం గురించి వ్రాశారు కాబట్టి తప్పకుండా వారికి భారతం మీద నమ్మకం ఉందనే విశ్వాసంతో అదే మహాభారతంలో శాంతి పర్వంలో నేను చదివిన ఒక శ్లోకాన్ని దిగువ ఇస్తున్నాను. దీని
ద్వారా అసలు బ్రాహ్మణులంటే ఎవరు అనే విషయాన్ని తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం--

జాతిః కులం తాత , స్వాధ్యాయః శ్రుతం ,
కారణాని ద్విజత్వస్య , వృత్త మేవాస్య కారణమ్.
బ్రాహ్మణత్వమునకు కారణము జాతి కాదు, కులమూ కాదు, వేదాధ్యయనమున్నూ కాదు, పాండిత్య మంతకంటెనూ కాదు; ప్రవర్తన మొక్కటియే దానికి కారణము.మంచి ప్రవర్తన కలిగియుండటమే కాని మిగిలిన ఏదిన్నీ బ్రాహ్మణత్వానికి కారణాలు కావని మహాభారతంలో చాలా విష్పష్టంగా చెప్పబడింది .

 
 
ప్రపంచ మహాసభలకు కారణమైన ప్రభుత్వాధిపతి కిరణ్ కుమార్ రెడ్డి గారు, మండలి గారు, అవధానంలో ప్రారంభోపన్యాసం చేసిన సుబ్బన్న అవధాని కానీ, సన్మాన గ్రహీతలలో ముందు వరుసలో వున్న శ్రీ మేడసాని మోహన్ గారు గానీ, నరాల రామా రెడ్డి గారు కానీ, శ్రీ నాయుడు గారు కానీ మీ నిర్వచనం ప్రకారం "బ్రాహ్మణులు" కారు. ఇంతే కాదు, గత 3 దశాబ్దాలలో జరిగిన ఎలాంటి చెడు కార్యక్రమాలలో (కారంచేడు, చుండూరు, కుప్పం మొదలుకొని భూ కబ్జాలు, హత్యల వరకు) బ్రాహ్మణుల పాత్ర ఇసుమంతైనా లేదు.
 
ఈ నాడు, పద్య కవులలో సగానికి పైచిలుకు బ్రాహ్మణేతరులున్నారు. వీరిలో ఎంతో మంది తెలంగాణా ప్రాంతంనుంచి వున్నారు. బ్రాహ్మణులలో చాలా మంది తిండికి గతి లేని పేదలు ఉన్నారు. ఎప్పుడో రాయల కాలంలో జరిగిన దాని గురించో, శతాబ్దం క్రితం జరిగిన దాని గురించో మాట్లాడి సమయం వృధా చేసుకోవద్దని మనవి. ప్రస్తుతం, కొన్ని వర్గాల అణచివేతలోగాని, ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడంలో కానీ, తద్వారా తెలంగాణాని అడ్డుకోవడంలో కానీ బ్రాహ్మణుల పాత్ర ఈషన్మాత్రమైనా లేదని మనవి చేస్తున్నాను.