18, డిసెంబర్ 2012, మంగళవారం

తెలంగాణలో పట్టు కోల్పోతున్న క చ రా?

ఇంద్రకరణ్ రెడ్డి, జిట్టా మొదలైన తెలంగాణా నాయకుల చేరిక ద్వారా, వై యస్ ఆర్ సి పి తెలంగాణాలో పట్టు బిగిస్తున్నది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఈ తరహా చేరికలు మరింత ఎక్కువై, తె రా స - తె దే పా లు రెండో స్థానానికి పోటీ పడినా ఆశ్చర్యం లేదు. బహుశా రాబోయే కొద్ది నెలల్లో కుల తత్త్వం, ప్రాంతీయ తత్వాన్ని పూర్తిగా అదుపులో ఉంచగలిగే స్థితికి చేరుకోవచ్చు. ఒక పక్క చంద్ర బాబు బూట్లు అరిగేలా తిరుగుతుంటే మరోపక్క జగన్ తల్లి గారు స్వపక్షం, విపక్షం, బంతిలో బలపక్షం అనే తేడా లేకుండా ఎం ఎల్ ఏ లకు మాజీ లకు తమ పార్టీ తీర్ధం ఇచ్చేస్తున్నారు . అదును కోసం ఎదురు చూస్తున్న నల్గొండ, ఖమ్మం, మెదక్ జిల్లాల ప్రముఖ కాంగ్రెస్ నాయకులను తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా, ఉప ప్రాంతీయ పార్టీకి అరికాళ్ళ కింద భూమి కదిలే అవకాశాలు మెండుగా వున్నాయి.
 
ప్రస్తుతం తె రాస పరిస్తితి చూస్తె ఓనిడా టి వి వారి వ్యాపార ప్రకటన "ఓనర్సు ప్రైడ్ నైబర్స్ ఎన్వీ" గుర్తు రాక మానదు. ఎంతసేపటికి, ఆంద్ర నాయకులు వస్తే రాళ్ళేయండి, చొక్కా పట్టుకోండి అని ఉద్యానవనాలలో సేద తీరుతూ తన సొంత బాకా ద్వారా చెప్పడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదు. పైపెచ్చు వాళ్ళని ఉద్రేక పరచి కోర్టుల చుట్టూ తిప్పించడం తప్ప. ఇక తమపార్టీ ప్రచారమంటారా -ఆ నలుగురూఅని రాజేంద్ర ప్రసాద్ సినిమా పాట పాడుకున్నట్లు - అబ్బ కొడుకు, కూతురు మరియు మేనల్లుడు మాత్రమె క్లోస్ అప్ షాట్లో వుంటారు, మిగిలిన వాళ్ళందరూ సినిమాలో ఒక క్షణం మాత్రమే కనిపించే పోస్ట్ మాన్ పాత్రధారులు. ఆడినా, పాడినా, తిట్టినా "ఆ నలుగురికి" మాత్రమె హక్కు. మేము ప్రజలలోకి వెళ్ళము , మేము చెప్పిన మాట వినని వాళ్ళేవరైనా వస్తే అడ్డుకొంటాము అనే ఒకే ఒక స్లోగన్ ద్వారా ఎన్ని రోజులు నెట్టుకొని రాగలుగుతారో కాలమే నిర్ణయిస్తుంది.

5 కామెంట్‌లు :

  1. ఇదేమన్న ఆంధ్రా అనుకున్నరా, కులాలు మనుషులను నడిపియ్యడానికి ? స్వార్థపరులు ఎప్పటికైనా ఏదో వంక పెట్టి తమ దారి తాము చూసుకుంటారు. ఏపీ ఎంపీలలో అత్యధికంగ 14కోట్లు ఎంపీలాడ్స్ నిధులు ఖర్చు చేసింది కచరా అని తెలుసుకోండి. కనిపించిన, చేతనైన అన్ని విషయాల్లో వాళ్ళు పని చేస్తున్నారు. స్వార్థపరులు, అయోగ్యుల కంటే తెరాస వారి లాగ నిక్కచ్చిగా మాట్లాడే వాళ్ళని సపోర్ట్ చేయడం బెటర్.

    పైపైన తెలిసినవి మాట్లాడే ముందు ఒకసారి గిచ్చి చూసుకోండి. అంతా తెలిసిందే వ్రాశారా లేక మీ అహం అడ్డొచ్చిందా అని. తెలిసీ,కావాలని వ్రాశారని మాత్రం అనుకోవట్లేదు. అందరిలా మనమూ అవహేళన చేద్దాం, మన సంఖ్యే ఎక్కువ అనుకుంటే మాత్రం... మీ ఇష్టం

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కాయ గారు, కులాలకు, మోసానికి ప్రాంతాలతో సంబంధం వుండదు. లేదంటె, తెలంగాణాలొని కాంగ్రెస్ నాయకులు వై యెస్ ఆర్ సి పి వైపు ఎందుకు దూకుతున్నారు. ఒకప్పుడు కె సి ఆర్ ను తిట్టి రాజశేఖర్ రెడ్డి గారి పంచన చేరిన మందాడి సత్యనారాయన రెడ్డి గారు ఇప్పుదు భా జ పా లొ వుంటె, పునీతుడౌతారా? ఈ నెలో పై నెలో వై యెస్ ఆర్ సి పి లో చేరబోతున్న నల్గొండ బ్రదర్స్, జగన్ గారి నాయకత్వంలొనే తెలంగాణా సాధిస్తాం అంటె తెలంగాణా ప్రాంతం అంతా ఇలాంటి వాళ్ళె అని అంటారా? కాదు కదా! మనిషి మనస్తత్వం ప్రాంతాన్నిబట్టి వుంటుంది అంటె నేను ఏకీభవించను. మంచి చెడు అనేవి వ్యక్తులను బట్టి పెరిగిన వాతావరనం బట్టి వుంటుంది.


      ప్రతి పార్టీకి ఒక టి వి ఛానల్ వుంది. ఇన్ని కోట్ల డబ్బు మీకు ఎక్కడనుంచి వచ్చింది అని ప్రస్నించడం వ్యక్తులుగా మనం ఈ పార్టీల వాళ్ళని ప్రశ్నించడం మర్చిపోయాం. వాళ్ళ మాటల గారడీలో పడిపోయాము.

      తొలగించండి
    2. అవగాహనలేకుండా తెలంగాణా గురిoచి మాట్లవద్దు ,తెలంగాణా ప్రజల సమశ్యలకు కారణాలు ఎన్నో ,అంతిమ లక్చ్శం ప్రత్యేక తెలంగాణా ....కాకపోతే ఎలాసాధ్యం అనేది ఎవరి పద్ధతిలో వారు చేస్తారు ,అణచడానికి ప్రయత్నాలు చేసేవారు అది చేస్తారు ,,,కావల సింది ప్రజా ల రాజ్యంగా హక్కుల పరిరక్చన ,సామాజిక న్యాయం

      తొలగించండి
    3. అవగాహనలేకుండా తెలంగాణా గురిoచి మాట్లవద్దు ,తెలంగాణా ప్రజల సమశ్యలకు కారణాలు ఎన్నో ,అంతిమ లక్చ్శం ప్రత్యేక తెలంగాణా ....కాకపోతే ఎలాసాధ్యం అనేది ఎవరి పద్ధతిలో వారు చేస్తారు ,అణచడానికి ప్రయత్నాలు చేసేవారు అది చేస్తారు ,,,కావల సింది ప్రజా ల రాజ్యంగా హక్కుల పరిరక్చన ,సామాజిక న్యాయం

      తొలగించండి
  2. మీడియా ఎక్కువ ఎవరిని చూపిస్తే వాళ్ళే మీడియా లో కనిపిస్తారు. అందరూ సిద్ధమే మాట్లాడడానికి, కానీ మీడియా మాత్రం కొందరినే హైలైట్ చేస్తుంది. ఎందుకనబ్బా ?

    రిప్లయితొలగించండి